ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.19-8-2022(శుక్రవారం) ..
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు ..
నందిగామ పట్టణంలోని ఆరో వార్డు యాదవ బావి వద్ద మరియు ఎనిమిదో వార్డు రైతుపేట డౌన్ లో శుక్రవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు , ముందుగా ఉట్టి కొట్టి పండుగ వేడుకలు నిర్వహించారు ,
ఈ సందర్భంగా డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ కృష్ణతత్వాన్ని మానవ జీవితానికి అన్వయించుకోగలిగితే జీవితం ఒడిదుడుకులు కూడా లేకుండా సాగుతుందని అంతేకాకుండా కష్టసుఖాలను రెండిటిని ఒకేలా చూడగలిగే స్థితప్రజ్ఞత వస్తుందని తెలిపారు , కృష్ణసారాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే చాలా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు , కృష్ణుని జీవితమంతా సంక్షోభం ,పోరాటం ,సవాళ్ళతోనే నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు , కష్టాలను నవ్వుతూ దాటే ప్రయత్నం చేసే వారికి విజయం ఖచ్చితంగా దొరుకుతుందని , వినయం -నిజాయితీ -శ్రమ -ధర్మాన్ని అనుసరించటం -దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం వంటివి శ్రీకృష్ణుని విజయ మంత్రాలని తెలిపారు , అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , యాదవ కమిటీ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..