Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 Serial: దీప ఆదిశక్తి అవతారం – కాళ్లబేరానికి వచ్చిన రౌడీ – లాకెట్ కథ బయటపెట్టిన కార్తీక్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 2 ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ కొత్తగా పెట్టిన టిఫిన్ సెంటర్‌కు వచ్చిన ఓ రౌడీ టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వనని అంటాడు. డబ్బులు అడిగినందుకు దీపను బెదిరిస్తాడు. టిఫిన్ సెంటర్ కూల్చేస్తానని అనడంతో కోపం పట్టలేకపోయిన దీప ఆ రౌడీని చితక్కొడుతుంది.
Karthika Deepam 2 Serial: బతుకుతెరువు కోసం టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారు కార్తీక్, దీప. వారి టిఫిన్ సెంటర్‌కు వచ్చిన సత్తి అనే రౌడీ టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోబోతాడు. డబ్బులు ఇవ్వమని అతడిని దీప అడుగుతుంది. నేను ఎవరనుకున్నావు…తెలియకపోతే తెలుసుకో…ఈ ఏరియా నాదే అని దీపకు వార్నింగ్ ఇస్తాడు సత్తి. నేను ఎక్కడ టిఫిన్ చేసిన డబ్బులు ఎవరు అడగరు…నేను ఇవ్వను…అడిగితే పగిలిపోద్ది అని బెదిరిస్తాడు. అసలు ఇక్కడ ఎవరిని అడిగి టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారని కార్తీక్, దీపను బెదిరిస్తాడు సత్తి.
నాతో పెట్టుకుంటే…
నాతో పెట్టుకుంటే టిఫిన్ సెంటర్ ఉండదు. మీరు ఉండరని తన ఎదురుగా ఉన్న కుర్చీని తన్నేస్తాడు సత్తి. మర్యాదగా కుర్చీ అక్కడ పెట్టి, డబ్బులు ఇచ్చి వెళ్లిపో అని దీప ఎన్ని సార్లు చెప్పిన సత్తి వినడు. టిఫిన్ సెంటర్ బండిని కిందపడేయబోతాడు. రౌడీ సత్తిని చితక్కొడుతుంది. వీడికి ముఠామేస్త్రి సెకండ్‌షో సినిమా చూపించేదాకా దీప వదిలిపెట్టదని కార్తీక్ అనుకుంటాడు.
బలుపు చూపిస్తున్నావా…
టిఫిన్ పీకలదాకా తిని డబ్బులు ఇవ్వమంటే బలుపు చూపిస్తున్నావా…ఈ ఏరియా నీదా. టిఫిన్ సెంటర్ పెట్టడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ తక్కురేగ్గొడుతుంది. నా ముందు రౌడీయిజం చూపిస్తే చెప్పు తెగిపోతుందని అంటుంది. రౌడీ దగ్గర డబ్బులు లేకపోవడంతో అతడి వాచ్ లాక్కుంటుంది. దీప దెబ్బలకు తాళలేక రౌడీ పారిపోతాడు.
ఆకాశమంత ప్రేమ…
నీలో ఆకాశమంత ప్రేమ ఉంది, అంతే ఆవేశం ఉంది. ఎక్కడ బుజ్జగించాలో…ఎక్కడ బెదిరించాలో నీకు బాగా తెలుసు అని దీపను పొగొడుతాడు కార్తీక్. నువ్వు ఇలాగే ఉంటే నాకు ఇంకా ఇంకా నచ్చుతావని కాంప్లిమెంట్ ఇస్తాడు. దీపకు కోసమస్తే ఇంతగా వైల్డ్‌గా మారిపోతుందా అని కాంచన షాకవుతుంది. ఆడదంటే అమ్మలా కాదు…అవసరమైతే ఆదిశక్తిలా ఉండాలని మనసులోనే దీపను మెచ్చుకుంటుంది.
జ్యోత్స్న కంగారు…
ఎంప్లాయ్స్‌కు శాలరీస్ ఇంకా ఇవ్వలేదని జ్యోత్స్నకు గుర్తుచేస్తాడు మేనేజన్. మన బిజినెస్ డల్‌గా ఉందని, బిజినెస్ అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేవని అంటాడు. తాను సీఈవోగా మారిన తర్వాతే బిజినెస్ డల్ అయ్యిందంటే తన ఫెయిల్యూర్‌గా కార్తీక్ లాంటి వేలేత్తి చూపించే అవకాశం దొరుకుతుందని జ్యోత్స కంగారు పడుతుంది. తాత సహాయంతో ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది.
సగం కావాలి…
టిఫిన్ సెంటర్‌లో వచ్చిన లాభంలో సగం వాటా తనకు కావాలని పట్టుపడతాడు కార్తీక్. డబ్బులు మొత్తం దీప అతడికే ఇవ్వబోతుంది. కానీ సగమే కావాలని అంటాడు. అతడు అడిగినంత మొత్తం ఇస్తుంది దీప.
కార్తీక్ ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు, అతడికి ఏమైందోనని దీప అనుకుంటుంది. శౌర్య ఆరోగ్యం పూర్తిగా కుదటపడలేదని, తన అవసరం కోసమే డబ్బులు అడగాల్సివచ్చిందని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప దగ్గర తీసుకున్న డబ్బులు దాచిపెడుతోండగా…అతడి లాకెట్ కిందపడిపోతుంది. అది కార్తీక్ గమనించదు.
కిందపడ్డ లాకెట్…
కార్తీక్ లాకెట్ శౌర్యకు దొరుకుతుంది. ఆ లాకెట్ దీప చూస్తుంది. తనకు ఆ లాకెట్ ఇవ్వమని దీప ఎంత అడిగిన శౌర్య ఇవ్వదు. అది కార్తీక్ బాబుది అని, అది ఎంతో ముఖ్యమైనది కాబట్టే భద్రంగా దాచుకున్నారని దీప అంటుంది. లాకెట్‌కు ఏమన్నా అయితే కార్తీక్‌బాబు బాధపడతాడని, అతడికి ఇచ్చేయమని శౌర్యకు చెబుతుంది దీప. శౌర్య వినికపోవడంతో కూతురు చేతిలో నుంచి లాకెట్‌ను లాక్కుంటుంది దీప.
తల్లి జ్ఞాపకంగా…
ఆ లాకెట్‌ను గుర్తుపడుతుంది దీప. చిన్నతనంలో తల్లి జ్ఞాపకంగా తండ్రి తనకు ఇచ్చిన లాకెట్ అది అని తెలుసుకుంటుంది. నీళ్లలో పడిన ఓ అబ్బాయిని కాపాడే క్రమంలో లాకెట్ మిస్సయిన సంగతి గుర్తుతెచ్చుకుంటుంది. లాకెట్ బీరువాలో కనిపించకపోవడంతో కార్తీక్ కంగారు పడతాడు. లాకెట్ కోసం వెతుకుతుంటాడు. మీరు వెతుకుతున్నది దీని కోసమేనా అని కార్తీక్‌కు లాకెట్ చూపిస్తుంది దీప
దీప ప్రశ్నలు…
. ఈ లాకెట్ ఎవరిది? దీనిని మీరు ఇంత భద్రంగా ఎందుకు దాచుకుంటున్నారు? ఈ లాకెట్ మీ దగ్గరకు ఎలా వచ్చిందని ప్రశ్నలు అడుగుతుంది. దీనిని మీకు ఇచ్చిన మనిషి ఎవరు అని అంటుంది.
ఈ లాకెట్ వెనుక పెద్ద కథ ఉందని కార్తీక్ అంటాడు.ఇన్ని రోజులు మనసువిప్పి మాట్లాడే అంతా దగ్గరతనాన్ని నువ్వు నాకు ఇవ్వలేదని అందుకే లాకెట్ గురించి చెప్పలేకపోయానని కార్తీక్ అంటాడు.
నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు ఇద్దరి మధ్య ఓ గీత అడ్డుగా నిలిస్తూ వచ్చిందని, ఆ గీతను చెరపడానికి రెండు చేతులు కావాలి…ఆ గీతను చెరపడానికి నీ చేతి సిద్ధంగా లేదని కార్తీక్ అంటాడు. అందుకే మన మధ్య కొంత దూరం అలాగే మిగిలిపోయిందని అంటాడు.
రెండు అక్షరాలు కలిస్తేనే..
మన మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి నా అడుగులు ఎంత ముందుకు పడినా…నా అడుగులను చేరుకోవడానికి నీ పాదం సిద్ధంగా లేదని దీపతో అంటాడు. రెండు అక్షరాలు కలిస్తేనే పెళ్లి, భార్య, భర్త అని కార్తీక్ అంటాడు. ఏదైనా రెండు ఒక్కటైతేనే అందం…ఇద్దరు ఒక్కటైతేనే బంధం అని చెబుతాడు.
మనం మాత్రం ఒక్కటిగా జీవిస్తున్నా…ఇద్దరు ఒంటరివాళ్లమని కార్తీక్ చెబుతాడు. మన మధ్య ఉన్న అడ్డుగోడలను కూర్చే ప్రయత్నం నువ్వు చేయలేదు..నేను చేయలేదని ఎమోషనల్ అవుతాడు. ఈ లాకెట్ గురించి చెప్పే సమయం వచ్చిందని అంటాడు. నా ప్రాణం పోసిన కథ…రుణం తీర్చుకోవడానికి మిగిలిపోయిన ఓ పదేళ్ల అమ్మాయి కథ ఇదని అంటాడు.
జ్యోత్స్న కోసం…
గ్రామ దేవత మొక్కు తీర్చుకోవడానికి ఓ పల్లెటూరికి వచ్చిన సమయంలో జ్యోత్స్న కలువ పువ్వుల అడిగితే కోసివ్వడానికి కోనేరులో దిగాను. ఆ టైమ్‌లో జారి కోనేరులో పడిపోతే ఓ పదేళ్ల అమ్మాయి తనను కాపాడిందని, ఆమెదే ఈ లాకెట్ అని చెబుతాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2సీరియల్ ముగిసింది.