Best Web Hosting Provider In India 2024
Spinach: పాలకూర మంచిదే కానీ, అది తిన్నాక మాత్రం వీటిని తినకూడదు, తింటే పొట్టలో గడబిడే
Spinach: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అవి పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడతాయి.
ఆకుకూరల్లో పాలకూర ముఖ్యమైనది. పిల్లలు, పెద్దలు, గర్భిణీలు… అందరూ తినాల్సిన వాటిలో పాలకూర ఒకటి. ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అవసరం. అయితే ఆయుర్వేదం ప్రకారం పాలకూర తినేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలా తింటే అది పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పాలకూర సరిగా తినకపోతే ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది.
పాలకూరతో ఆరోగ్యం
పాలకూర ఉండే పోషకాల కారణంగా ఇది ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి2, సి, ఇ, కె, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పాలకూరలో ఫాస్పరస్, జింక్, సెలీనియం, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఇనుము లోపాన్ని తొలగించి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఆకుకూరలు మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పాలకూరను కొన్నిరకాల ఆహారాలతో తింటే… అది ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పాలకూరను ఏయే పదార్ధాలతో కలిపి తినకూడదో తెలుసుకోండి.
పాలకూరతో తినకూడని అయిదు పదార్థాలు
ఆయుర్వేదం ప్రకారం పాలకూర, నువ్వులు తినకూడదు.రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మీ ఎనర్జీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
పాలు, పెరుగు
పాలకూరను పాలు, పెరుగు, కాటేజ్ చీజ్ మొదలైన వాటితో తినడం మానుకోండి. పాలకూరలో ఐరన్, పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఒకదానికొకటి శోషించుకోకుండా అడ్డుకుంటాయి. పాలలోని కాల్షియం, పాలకూరలోని ఆక్సాలిక్ ఆమ్లం కలిసి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఏర్పడేలా చేస్తాయని చెప్పుకుంటారు. ఈ కారణంగా మూత్రపిండాల్లో సమస్యలు వస్తాయి. అందువల్ల, పాల ఉత్పత్తులతో కలిపి పాలకూరను తినకపోవడమే మంచిది.
కాఫీచ టీ
పాలకూరతో చేసిన ఏ ఆహార పదార్థాలను కాఫీ లేదా టీతో తినకూడదు. టీలో ఉండే పాలీఫెనాల్స్, టానిన్లు… ఇనుము శోషణను నిరోధించవచ్చు.
రక్తం సన్నబడటానికి
పాలకూరలోని విటమిన్ కె రక్తం సన్నబడటానికి మందులతో ప్రతిస్పందించడం ద్వారా శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
సిట్రస్ పండ్లు
పాలకూరలోని ఆక్సలేట్స్… నారింజ, ద్రాక్షపండు లేదా నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లతో పాటు కాల్షియం ఆక్సలేట్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సిట్రస్ ఆహారాలతో పాలకూరను నివారించడం మంచిది.
చేపలు
పాలకూర తిన్న రోజు చేపలను తినకూడదు. ఇది జీర్ణక్రియ, పోషక సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల, ఆకుకూరలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట పాలకూర తినకుండా ఉంటేనే మంచిది.