OTT Review: ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

OTT Review: ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 02, 2025 08:19 AM IST

Alien Romulus Movie Review In Telugu: ఓటీటీలోకి రూ. 3 వేల కోట్లు కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏలియన్ రోములస్ అలరిస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సినిమా ఎలా ఉందో ఏలియన్ రోములస్ రివ్యూలో తెలుసుకుందాం.

ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Alien Romulus Review In Telugu: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అయితే, వీటికి సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ ఎలిమెంట్స్ జోడించి పర్ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకుంటుంది. అలా వచ్చి రూ. 3 వేల కోట్లు కొల్లగొట్టిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీనే ఏలియన్ రోములస్. ఏలియన్ సినిమా ఫ్రాంచైజీలో ఏడో సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఐఎమ్‌డీబీ రేటింగ్ 7.1 ఉండటం విశేషం.

yearly horoscope entry point

మరి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో ఏలియన్ రోములస్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

2142 సంవత్సరంలో ఎల్‌వీ-410 అనే గ్రహంలో మనుషులంతా బానిసల్లా బతుకుంటారు. అక్కడి నుంచి నలుగురు ఫ్రెండ్స్ బయటపడాలనుకుంటారు. అందుకు హీరోయిన్ దగ్గరున్న ఓ రోబో సహాయం తీసుకుంటారు. వారికి దగ్గరిలోకి వచ్చిన ఓ స్పేస్ షిప్ నుంచి తప్పించుకోవాలని అందులోకి వెళ్తారు. అయితే, అక్కడ అదివరకు ఏలియన్‌కు సంబంధించిన పరిశోధనల వల్ల తీవ్ర విధ్వంసం జరిగి ఉంటుంది.

అది పట్టించుకోకుండా ఫ్యూయల్ కోసం ఒక రిస్ట్రిక్టడ్ రూమ్‌లోకి వెళ్లి ఓపెన్ చేస్తారు. దాంతో వింత జీవులన్ని బయటపడి వారిపై అటాక్ చేస్తాయి. వాటి నుంచి వాళ్లు తప్పించుకుంటారు. కానీ, ఒక అమ్మాయి మొహంపై పడిన ఆ వింతజీవి వదలదు. కాసేపటికి ఆ వింతజీవిని ఫ్రీజ్ చేసి మొహంపై నుంచి తీస్తారు. ఆ అమ్మాయి బతికినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది.

ట్విస్టులు

అంతసేపు అమ్మాయిపై ఉన్న ఆ వింతజీవి ఏం చేసింది తర్వాత షిప్‌లో నెలకొన్న పరిస్థితులు ఏంటీ యాసిడ్ కక్కే ఏలియన్ నుంచి ఐదుగురు తప్పించుకున్నారా? బతికి బయటపడ్డారా? వారికి వారితో వచ్చిన రోబో సహాయం చేసిందా హానీ చేసిందా? చివరికి ఎవరు మిగిలారు? వంటి అంశాల మేళవింపే ఏలియన్ రోములస్.

విశ్లేషణ:

ఒక స్పేస్ షిప్, అందులో అతిభయంకరమైన ఏలియన్, దాని నుంచి తప్పించుకునే కొంతమంది మనుషులు. ఇలాంటి స్టోరీతో చాలా వరకు సినిమాలు వచ్చాయి. అయితే, స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కొత్తగా ఉంటే ఆడియెన్స్ కచ్చితంగా హిట్ చేస్తారు. అందులో ఏలియన్ రోములస్ నూటికి నూరు శాతం విజయం సాధించిందని చెప్పొచ్చు.

రెండు గంటల రన్ టైమ్ ఉన్న ఏలియన్ రోములస్ మూవీ ఎక్కడా బోర్ కొట్టదు. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా ఎంగేజింగ్‌గా సినిమా సాగుతూనే ఉంటుంది. ప్రతి సన్నివేశం ఉత్కంఠకు గురి చేస్తుంది. అంతేకాకుండా సినిమాలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్స్ బాగున్నాయి. అతి తక్కువ సమయంలో పాత్రలను పెద్దగా పరిచయం చేయకున్నా ఎమోషనల్ చేయడం మాములు విషయం కాదు.

గ్రిప్పింగ్ అండ్ కన్విన్సింగ్‌గా

అన్ని సినిమాల్లో లాగా ఏలియన్‌ను నార్మల్‌గా చూపించకుండా దాని నుంచి యాసిడ్ రావడం, దాన్ని చంపినా స్పేస్ షిప్ కూలిపోయే ప్రమాదం ఉండటం వంటి చాలా విషయాలు థ్రిల్‌కు గురి చేస్తాయి. ఇది వరకు మూవీస్‌ ప్రకారం ఒక ఏలియన్‌కు ఐదుగురిని చంపడానికి చాలా సమయం పట్టదు. అలాంటిది ఆ ఐదుగురు ఏలియన్ నుంచి తప్పించుకోవడాన్ని రెండు గంటలు ఎంతో గ్రిప్పింగ్‌గా, కన్విన్సింగ్‌గా చూపించిన డైరెక్టర్‌ ఫెడే అల్‌వారిజ్ టేకింగ్‌ను మెచ్చుకోవాల్సిందే.

క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఏలియన్ మనిషి నుంచి సరికొత్తగా రూపాంతరం చెందడం, దాని నుంచి హీరోయిన్ తప్పించుకుని బతకడం, మరోవైపు స్పేస్ షిప్ ఆస్ట్రాయిడ్‌కు ఢీ కొట్టే టైమ్ లిమిట్ ప్రతిసారి చూపించడం వంటి ఎన్నో సీన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

ఈవిల్ డెడ్, డోంట్ బ్రీత్, ది గర్ల్ ఇన్ ది స్పైడర్ వెబ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఫెడే అల్‌వారిజ్ తెరకెక్కించిన ఏలియన్ రోములస్ మూవీలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయింది. అందుకే ఉన్న కొద్దిపాటి ఎమోషనల్ సీన్స్‌ కూడా బాగా పండాయి. ఇక బీజీఎమ్ అయితే మంచి హార్రిఫిక్ ఫీల్ ఇస్తుంది.

ఇక ఫైనల్‌గా చెప్పాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఏలియన్ రోములస్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ఓటీటీ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024