Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: పెళ్లి పందిట్లో బాలును కొట్టిన సత్యం – సంజు భార్యగా మారిన మౌనిక – పంతం వీడని ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 2 ఎపిసోడ్‌లో మౌనిక మెడలో సంజు తాళికట్టేస్తాడు. చెల్లి మెడలో సంజు తాళి కట్టడం సహించలేని బాలు మండపంలోనే అతడిని కొడతాడు.మౌనిక మెడలో తాళి తెంపబోతాడు
సంజును కిడ్నాప్ చేసి మౌనిక పెళ్లి ఆపాలన్న బాలు ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. సంజు మనుషులకే బాలు దొరికిపోతాడు. పెళ్లి ఆపకుండా బాలును కట్టిపడేస్తాడు సంజు. భర్తను మీనా సేవ్ చేస్తుంది. మరోవైపు మౌనిక పెళ్లి సంజుతో జరుగుతుందని తెలిసిన రవి, శృతి షాకవుతారు. ఎలాగైనా పెళ్లి ఆపాలని అనుకుంటారు.
తాళికట్టిన సంజు…
సంజు మనుషుల బారి నుంచి మీనా సహాయంతో తప్పించుకున్న బాలు ఆవేశంగా పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు. బాలు వస్తాడని ముందే ఊహించిన నీలకంఠం..కొడుకు పెళ్లి తొందరగా అయ్యేలా ప్లాన్ చేస్తాడు. మౌనిక మెడలో సంజు తాళికట్టేస్తాడు. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన బాలు పెళ్లి జరగడం చూసి షాకవుతాడు. ఆవేశంగా అంక్షితల తాంబూలాన్ని పడేస్తాడు. దీపపు కుందే తీసుకొని సంజును పొడవబోతాడు. కానీ మౌనిక అడ్డొస్తుంది.
నరరూప రాక్షసుడు…
సంజు నరరూప రాక్షసుడని, తొందరపడి మౌనికతో అతడి పెళ్లి చేశారని తండ్రితో కోపంగా బాలు అంటాడు. సంజును వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు. సంజు కాలర్ పట్టుకొని చితక్కొడతాడు. సంజు మీ బావ అని, అతడిని ఎందుకు కొడుతున్నావని కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసిన బాలు వినడు. సంజును కొడుతూనే ఉంటాడు.
బాలుకు వార్నింగ్…
ఇంకోసారి నా కొడుకుపై చేయి వేసిన, ఒక్క మాట తప్పుగా మాట్లాడిన విషయం చాలా దూరం వెళుతుందని బాలుకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం. కొడుకును సరిగ్గా పెంచడం చేతకానీ నువ్వు ఒక తండ్రివేనా. వీడు మనిషి కడుపులో పుట్టిన మానవ మృగం అని బాలు అంటాడు. సంజు చంపి జైలుకైనా వెళతాను గానీ…నా చెల్లెలి భర్తగా మాత్రం అంగీకరించనని అంటాడు.
మీనా ఆన్సర్…
ఎవరు చెప్పిన వినకపోవడంతో బాలు చెంపపై గట్టిగా ఒక్కటి కడతాడు సత్యం. పచ్చని పందిట్లో నీ చెల్లెలి కాపురం కూర్చేయడానికి తయారయ్యావా అంటూ క్లాస్ ఇస్తాడు. పశువులా మారిపోయావని బాలుపై కోప్పడుతాడు. సంజు ఎలాంటి వాడో మీనాను అడగమని తండ్రితో అంటాడు బాలు. మీనా సమాధానం చెప్పబోతుండగా ప్రభావతి అడ్డుకుంటుంది. దరిద్రపుగొట్టు సంబంధం చేసుకున్న నువ్వు నా కూతురికి వచ్చిన గొప్పింటి సంబంధం చెడగొట్టాలని అనుకుంటున్నావా అంటూ బాలు, మీనాను అవమానిస్తుంది.
బాలును పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్లిపొమ్మని అంటుంది. నీ ముఖం కూడా నాకు చూపించొద్దని చెబుతుంది
కళ్లల్లో నిప్పులు…
. నేను చెప్పేది వినండి అని మీనా అగానే ప్రభావతి కోపంగా నోర్ముయ్ అని అంటుంది. నా కూతురు ఎక్కవ సుఖ పడుతుందో అని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నావా పాపిష్టిదానా అని మీనాపై ప్రభావతి ఫైర్ అవుతుంది. సుశీలతో పాటు రోహిణి కూడా బాలు మాటలనే తప్పుపడతారు.
సంజును పెళ్లి చేసుకొని తన చెల్లెలు సుఖంగా బతకలేదని, దినదిన గండలా బతుకుతూ ప్రతి క్షణం నరకాన్ని చూస్తుందని బాలు ఎంత చెప్పిన ఎవరూ వినరు. సంజు నిజస్వరూపం తెలిస్తే మీరే వాడిని తరిమి తరిమి కొడతారని బాలు అంటాడు. అయినా బాలు మాటలను సత్యం, ప్రభావతితో పాటు మిగిలిన వాళ్లు తప్ప పడతారు. అప్పడే అక్కడికి రవి, శృతి వస్తారు.
నిజం బయటపెట్టిన శృతి…
నేను తప్పుగా మాట్లాడుతున్నానని అంటున్నారుగా…సంజు ఎలాంటివాడో రవి, శృతిని అడగమని బాలు అంటాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నది సంజునే అని శృతి అసలు నిజం బయటపెడుతుంది. సంజు శాడిజం నుంచి తప్పించుకోవడానికే నన్ను పెళ్లి చేసుకోమని రవిని తొందరపెట్టానని అంటుంది. సంజు తిక్కలోడు అని రవి అంటాడు.
రవి సీరియస్…
అత్తింటి కుటుంబంతో తిరిగి కలిసిపోవడానికి నా కొడుకుపై నిందలు వేస్తే ఊరుకోనని శృతిని హెచ్చరిస్తాడు నీలకంఠం. అసలు శృతి పెళ్లి చేసుకున్నది రవినే అని తెలియనట్లుగా నటిస్తాడు. సంజు మంచోడని వెనకేసుకొస్తాడు. నిజంగా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా అని నీలకంఠాన్ని నిలదీస్తుంది శృతి.
ఆడపిల్లవని ఊరుకుంటున్నానని, ఇంకో మాట మాట్లాడితే బాగుండదని నీలకంఠం వార్నింగ్ ఇస్తుంది. ఊరుకోకపోతే ఏం చేస్తావని రవి సీరియస్ అవుతాడు. నీ కొడుకు ఎంత వెధవో తెలిసే గబగబా ఈ పెళ్లి జరిపించావని రవి అంటాడు. బాలు చెప్పిందే నిజమని రవి చెబుతాడు.
తాళి తెంపబోయిన బాలు…
సంజు గురించి ఎవరు ఎన్ని చెప్పిన నేను విననని ప్రభావతి అంటుంది. తాళి కట్టినంత మాత్రానా వీడు భర్త అయిపోతాడంటే…సంజు కట్టిన తాళిని ఇప్పుడే తెంపేస్తానని బాలు అంటాడు. తాళిబొట్టు తెంపబోతాడు. మౌనిక అతడిని కొడుతుంది. నీకు నచ్చిన నచ్చకపోయనా సంజునే నా భర్త అంటుంది.
నీ కోపం, ఆవేశంలో నా జీవితాన్ని బలిచేయద్దని, నా తాళి తెంచే అధికారం నీకు లేదని బాలుతో అంటుంది మౌనిక. బాలును అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. నీ ముఖం నాకు చూపించొద్దని సత్యం కూడా అంటాడు. నష్టజాతకుడు, నీ కడుపున చెడబుట్టావని ప్రభావతి కూడా బాలును నానా మాటలు అంటుంది.
మౌనిక శిక్ష…
బాలును కొట్టినందుకు మౌనిక ఎమోషనల్ అవుతుంది. బాలును కొట్టిన చేతికి శిక్ష విధించుకుంటుంది. దీపంతో తన చేయి కాల్చుకోబోతుంది. మీనా వచ్చి అడ్డుకుంటుంది. మీ అన్నయ్యకు నువ్వంటే ప్రాణం. నువ్వు కొట్టిన దెబ్బను మర్చిపోతాడని మౌనికను ఓదార్చుతుంది.
గొడవలు పడితే అన్నయ్య మళ్లీ జైలుకు వెళ్లాల్సివస్తుందని, నన్ను క్షమించమని అన్నయ్యతో నువ్వైన చెప్పమని మీనాను రిక్వెస్ట్ చేస్తుంది మౌనిక. మీకు మేమంతా ఉన్నామని, అత్తగారింట్లో ఏ సమస్య ఉన్నా మీకు మేము అండగా ఉంటామని మౌనికకు మాటిస్తుంది.
సత్యం క్షమాపణలు…
బాలు చేసిన అవమానం తట్టుకోలేక మౌనికను వదిలిపెట్టి వెళ్లిపోతున్నట్లుగా నటిస్తారు నీలకంఠం, సంజు. బాలు తరఫున నీలకంఠంతో పాటు అతడి ఫ్యామిలీకి సత్యం క్షమాపణలు చెబుతాడు. బాలు ఎమోషనల్ అవుతాడు. చెల్లి కొట్టినందుకు బాధపడుతున్నారా అని భర్తను అడుగుతుంది మీనా. మౌనిక కొట్టినందుకు కాదని, సంజుతో ఆమె పెళ్లి జరగడం బాధను కలిగిస్తుందని బాలు అంటాడు.
ఫస్ట్‌నైట్ రోజే తన నిజస్వరూపం బయటపెడతాడు సంజు. బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకున్నానని మౌనికతో అంటాడు. సంజు మాటలతో మౌనిక షాకవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.