Brahmamudi January 2nd Episode: ఆస్పత్రికి పోలీస్‌గా అప్పు- కల్యాణ్ వార్నింగ్- కిడ్నాపర్స్‌గా రాజ్ కావ్య- భయంతో సావిత్రి

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 2nd Episode: ఆస్పత్రికి పోలీస్‌గా అప్పు- కల్యాణ్ వార్నింగ్- కిడ్నాపర్స్‌గా రాజ్ కావ్య- భయంతో సావిత్రి

Sanjiv Kumar HT Telugu
Jan 02, 2025 07:15 AM IST

Brahmamudi Serial January 2nd Episode: బ్రహ్మముడి జనవరి 2 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కి అప్పు పోలీస్ డ్రెస్‌లో రావడం కల్యాణ్ చూస్తాడు. ఇదివరకు తనను పోలీస్ డ్రెస్ వేసుకోమన్నది కల్యాణ్ చెప్పడం గుర్తు చేసుకుంటాడు. తన గెస్ట్ హౌజ్‌కు లవర్ లిల్లీని తీసుకొచ్చేందుకు నందగోపాల్ వెళ్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 2వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 2వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నందగోపాల్ కోసం రాజ్, కావ్య వెళ్తుంటే.. సాఫ్ట్‌వేర్ సావిత్రి అనే ఒకతను లిఫ్ట్ అడిగి ఎక్కుతాడు. మీరిద్దరు భార్యాభర్తల అని అడిగితే.. అంత పెద్ద తప్పు నేనెందుకు చేస్తాను అని, తను కావ్య డ్రైవర్ అని రాజ్ చెబుతాడు. తర్వాత తనకు అమ్మాయి పేరు పెట్టడం గురించి కథ చెబుతాడు సావిత్రి.

yearly horoscope entry point

మీ నవ్వులో మహత్యం ఉంది

తను పుట్టగానే తనకు సంబంధించినవాళ్లు అంతే చనిపోతారు. అదే విషయం చెప్పి అందుకే పేరు అమ్మాయిగా మార్చుకుంటే మంచిదని పంతులు చెప్పినట్లు, తనది నష్టజాతకం అని చెబుతాడు సావిత్రి. రాజ్ కౌంటర్స్ వేస్తే.. డ్రైవర్ డ్రైవర్‌లా ఉండమని అంటాడు. తర్వాత కావ్యతో మాట్లాడుతాడు సావిత్రి. ఇంతలో అతనికి ఓ గుడ్ న్యూస్ వస్తుంది. దాంతో మీ నవ్వులో ఎంతో మహత్యం ఉంది. ఎప్పటినుంచో చూస్తున్న హోమ్ లోన్ వచ్చిందని సావిత్రి చెబుతాడు.

దాంతో కంగ్రాట్స్ అని సావిత్రి, కావ్య షేక్ హ్యాండ్ ఇచ్చుకోబోతుంటే అది చూసి తట్టుకోలేక బ్రేక్ వేస్తాడు రాజ్. దాంతో సావిత్రి ముందుకు వెనక్కి పడతాడు. ఏ డ్రైవర్ ఏంటీ నడపడం అని వెళ్లి వెనుక ఉన్న కావ్య దగ్గర కూర్చుంటాడు. అక్కడ కూర్చున్నావేంటీ అని రాజ్ అంటే.. ఏవండి మీకెందుకు. మీరు పోనివ్వండి అని కావ్య అంటుంది. ఆహా.. డ్రైవర్‌ను కూడా ఎంత బాగా పిలుస్తున్నారు. డ్రైవర్ చూస్తావేంటీ వెళ్లు అని సావిత్రి అంటాడు.

మరోవైపు హాస్పిటల్‌లో ఒకరు ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతుంటే వెళ్లి కల్యాణ్ మెల్లిగా మాట్లాడమని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అక్కడికి పోలీస్ గెటప్‌లో అప్పు వచ్చినట్లు ఊహించుకుంటాడు కల్యాణ్. అలా చూసి ఆశ్చర్యపోయిన కల్యాణ్ ఇదివరకు అప్పుని పోలీస్ డ్రెస్ వేసుకొమన్నది గుర్తు చేసుకుంటాడు. అప్పు పోలీస్ డ్రెస్‌‌లో చూసి కల్యాణ్ సంతోషపడుతాడు. తర్వాత నువ్ నాకు నచ్చావ్ సినిమాలోని డైలాగ్ చెబుతూ అలా చేస్తే బాగుంటుందని కల్యాణ్ అంటాడు.

కావ్య చేయి పట్టుకుని

ఇంతలో డ్రీమ్ లోనుంచి తేరుకున్న పోలీస్ డ్రెస్‌లో వచ్చింది వేరే మహిళ అని చూసి వెళ్లిపోతాడు. మరోవైపు కొబ్బరిబోండాం తాగాలని ఉందని కావ్య అంటే.. మీరు అలా అడిగితే ఎంత నికృష్టుడైన కొనివ్వకుండా ఉంటారా అని రాజ్‌ను డ్రైవర్ కారు ఆపు అని సావిత్రి అంటాడు. ఇంతలో రాజ్ సడెన్ బ్రేక్ వేస్తే.. ముందుకు వెనక్కి గుద్దుకుంటాడు సావిత్రి. దాంతో రాజ్‌ను తిడతాడు సావిత్రి. తర్వాత కావ్య చేయి పట్టుకుని కారులో నుంచి దింపుతాడు సావిత్రి.

రాజ్‌కు డబ్బులిచ్చి కొబ్బరిబొండాలు తీసుకురా అని డబ్బులిస్తాడు సావిత్రి. అవసరం లేదని రాజ్ వెళ్లి తీసుకొస్తానంటాడు. ఇంతలో సావిత్రికి ఫోన్ కాల్ వస్తుంది. కోర్టులో తను కేసు గెలిచినట్లు చెబుతాడు. కావ్య గారి చేయి తాకగానే తాతల కాలం నాటి ఆస్తి వచ్చిందని సావిత్రి చెబుతాడు. రాజ్, కావ్య షేక్ హ్యాండ్ ఇచ్చుకోబోతుంటే కొబ్బరిబొండాం కాలిపై పడేస్తాడు రాజ్. దాంతో నొప్పితో గింజుకుంటాడు సావిత్రి. తర్వాత తన కంటే నష్టజాతకుడి గురించి చెబుతాడు. బోండాలు తాగిన తర్వాత మళ్లీ చేయి పట్టుకుని కావ్యను కారులోకి ఎక్కిస్తాడు సావిత్రి.

కావ్య తాకిన స్పర్శను చూస్తూ మురిసిపోతుంటాడు సావిత్రి. చేయి కారులో ఉండగానే రాజ్ డోర్ కాలితో తన్ని వేస్తాడు. దాంతో సావిత్రి చేయి ఇరుక్కుపోతుంది. నొప్పితో గిలగిల్లాడుతాడు సావిత్రి. మరోవైపు నంద గోపాల్ తన గెస్ట్ హౌజ్‌కు వెళ్లి అక్కడ మూడు నెలలు ఉంటానని, అన్ని ఏర్పాట్లు చేయమని, మేడమ్ కూడా వస్తారని వాచ్‌మెన్‌కి చెబుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ లిల్లికి కాల్ చేసి లొకేషన్ పంపిస్తా రమ్మంటాడు. కానీ, లిల్లి రానని, నువ్ వచ్చి పికప్ చేసుకుంటేనే వస్తాను అని లిల్లి అంటుంది.

వాచ్‌మన్‌కి డబ్బులిచ్చి

దాంతో సరేనని ఒప్పుకుంటాడు నందగోపాల్. పేరుకే మగాళ్ల డామినేషన్ అంటారు కానీ, వీక్ నెస్ పట్టుకుని ఆడుకుంటారు అని నందగోపాల్ వాచ్‌మెన్‌కు డబ్బులిచ్చి మందు, మంచింగ్ ఏర్పాటు చేయమంటాడు. మరోవైపు కారులో తను పెళ్లి చేసుకోబోయేది కూడా నష్టజాతకురాలని, అందుకే మనసు మార్చుకున్నానని, కావ్య గారు మీకు పెళ్లి అయిందా అని అడుగుతాడు సావిత్రి. నన్ను ఆడుకుంటారు కదా. ఇవాళ నేను ఆడుకుంటాను అని లేదని, ఎందుకు మీకు నేను నచ్చానా అని కావ్య అంటుంది.

ఎంతటి పాపిష్టోడికి అయినా మీరు నచ్చుతారు. మీరు నవ్వితే హౌజ్ లోన్ వచ్చింది, చేయి తాకితే కోర్టులో కేస్ గెలిచాను. లైఫ్‌లోకి వస్తే ఏ రాజ్యానికి రాజునైపోతానో. మీ లక్ మొత్తం నాకు వస్తోంది. అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది అని సావిత్రి అంటాడు. తర్వాత కావ్య అందాన్ని పొగుడుతాడు సావిత్రి. రాజ్‌కు మండిపోతుంది. అసూయ, ఈర్శ్యతో రగిలిపోతాడు. డ్రైవర్‌వి డ్రైవర్‌లా ఉండమంటాడు సావిత్రి. ఇంతలో ఎస్సై కాల్ చేసి నందగోపాల్ అడ్రస్ తెలిసిందని, వెంటనే అక్కడికి వెళ్తే దొరుకుతాడని ఎస్సై అంటాడు.

కిడ్నాప్ ప్లాన్ చేస్తాం

దాంతో రాజ్ సంతోషిస్తాడు. ఏంటీ నీకు గుడ్ న్యూస్ వచ్చిందా అని సావిత్రి అడిగితే.. అవును, ఈరోజు మేము కిడ్నాప్ చేయాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోయింది. నేను చాలా సీరియస్‌గా చెబుతున్నాను. ఇందులో నేను, మీ పక్కనున్న మేడమ్ ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తాం అని రాజ్ అంటాడు. దాంతో సావిత్రి భయపడిపోతాడు.

మరోవైపు నందగోపాల్ గెస్ట్ హౌజ్‌కు వెళ్లి వాచ్‌మన్‌తో మీ సార్‌కు డబ్బు అవసరం చాలా ఉందని, వద్దంటే వెళ్లిపోతాను అని, నిన్ను ఉద్యోగంలోనుంచి తీసేస్తాడు అని రాజ్ అంటాడు. లోపలికి వెళ్లగానే అక్కడ ఫస్ట్ నైట్ గదిలా రూమ్ డెకరేట్ చేసి ఉంటుంది. అది చూసి ఇది ఆ బూత్ బంగ్లాకు జిరాక్స్ కాపీలా ఉంది, అసలు మిమ్మల్ని అని కావ్య అంటూ కొంగు తట్టుకుని రాజ్‌పై పడిపోతుంది. ఇద్దరు బెడ్‌పై పడతారు. రొమాంటిక్‌గా చూసుకుంటూ ఉంటారు. మరోవైపు నందగోపాల్ వస్తాడు. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024