Best Web Hosting Provider In India 2024
Baby John Losses: పాపం కీర్తి సురేష్.. తొలి బాలీవుడ్ మూవీయే డిజాస్టర్.. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలు
Baby John Losses: కీర్తి సురేష్ బాలీవుడ్ లో నటించిన తొలి మూవీ, గతేడాది రిలీజైన చివరి మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలతో 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. తమిళ బ్లాక్‌బస్టర్ తేరికి రీమేక్ కావడం విశేషం.
Baby John Losses: కీర్తి సురేష్ పెళ్లి తర్వాత రిలీజైన తొలి సినిమా బేబీ జాన్. హిందీ ఇండస్ట్రీలో కూడా ఆమెకు ఇదే తొలి మూవీ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. వరుణ్ ధావన్ కూడా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య క్రిస్మస్ రోజు రిలీజైంది. కానీ వారం దాటినా ఇప్పటి వరకూ రూ.50 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయినా కూడా హిందీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
బేబీ జాన్ డిజాస్టర్
వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళంలో అట్లీ డైరెక్ట్ చేసిన తేరి మూవీకి ఇది రీమేక్. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అయింది. అంతకుముందు మేకర్స్ ప్రమోషన్లు కూడా బాగానే నిర్వహించారు. తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కూడా వీటిలో బాగానే పార్టిసిపేట్ చేసింది. ఇంత చేసినా ఈ మూవీ తొలిరోజు కేవలం రూ.12 కోట్లే వసూలు చేయగలిగింది. రివ్యూలు కూడా నెగటివ్ గా రావడంతో మూవీ కోలుకోలేకపోయింది.
వరుస హాలిడేస్ ఉన్నా కూడా 8 రోజుల్లో బేబీ జాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.47 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి కూడా రూ.60 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం లేదని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ఇది. దీంతో రూ.100 కోట్ల నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మొదటి రోజు ఏకంగా 4300 షోలతో ప్రారంభమైన ఈ సినిమా.. 8 రోజుల తర్వాత 1800 షోలకు పరిమితమైంది.
కీర్తి సురేష్‌కు చేదు అనుభవం
తెలుగుతోపాటు సౌత్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఓ రేంజ్ సక్సెస్ చూసింది. టాప్ హీరోలందరితోనూ నటించింది. మహానటి మూవీ కోసం నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అలాంటి నటి ఈ బేబీ జాన్ మూవీతోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ తొలి హిందీ సినిమానే ఆమెకు చేదు అనుభవం మిగిల్చింది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే స్పష్టమవుతోంది.
డిసెంబర్ 12న తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్ ను కీర్తి పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత రిలీజైన తొలి సినిమా ఇదే. మూవీ ప్రమోషన్లకు ఆమె మెడలో తాళితోనే వచ్చింది. బాలీవుడ్ కు తగినట్లుగా హాట్ లుక్స్ తో అదరగొట్టింది. ఎవరు ఎన్ని చేసినా చివరికి బాక్సాఫీస్ దగ్గర బేబీ జాన్ కు డిజాస్టర్ టాకే మిగిలింది.
కీర్తి సురేష్ ఈ ఏడాది రెండు తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2024లో సైరెన్, రఘు తాతాలాంటి సినిమాల్లో నటించడంతోపాటు కల్కి 2898 ఏడీ మూవీ బుజ్జి కారుకు డబ్బింగ్ చెప్పిందామె. ఇక ఇప్పుడు తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో రాబోతోంది.
టాపిక్