Best Web Hosting Provider In India 2024
Comedy OTT: తెలుగులోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ – ఏ ఓటీటీలో చూడాలంటే?
Comedy OTT: కెవిన్ హీరోగా నటించిన బ్లడీ బెగ్గర్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడీ బెగ్గర్ సినిమాను జైలర్ దర్శకుడు నెల్సన్ ప్రొడ్యూస్ చేశాడు.
Comedy OTT: కెవిన్ హీరోగా నటించిన బ్లడీ బెగ్గర్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించాడు. జైలర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
రెండు ఓటీటీలలో…
బ్లడీ బెగ్గర్ తమిళ వెర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి రాగా..తెలుగు వెర్షన్ మాత్రం రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
డిజాస్టర్…
దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ వారం ఆలస్యంగా నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఈ సినిమా రిలీజైన విషయం తెలిసేలోపే థియేటర్లలో కనిపించకుండాపోయింది. థియేటర్లలో ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం హిట్టు టాక్‌ను తెచ్చుకున్నది. ఈ మూవీకి వంద మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
కెవిన్ యాక్టింగ్…
బ్లడీ బెగ్గర్‌లో బిచ్చగాడి పాత్రలో కెవిన్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. కామెడీతో పాటు ట్విస్ట్‌లు తేలిపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చెన్నై సిటీలోని ఓ బిచ్చగాడు (కెవిన్) తనకు కళ్లు, కాళ్లు లేవంటూ మాయమాటలు చెబుతూ డబ్బులు అడుక్కుంటుంటాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. ఓ గొప్పింట్లో అన్నదానం జరుగుతుందని తెలిసి ఆ ఇంటికి వస్తాడు బిచ్చగాడు.
ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిలోనే కొన్నాళ్లు తలదాచుకోవాలని ఫిక్సవుతాడు. ఆ ఇంట్లోనే దాక్కుంటాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంట్లో తనతో పాటు మరికొందరు సీక్రెట్‌గా ఉంటున్నారనే నిజం బిచ్చగాడికి తెలుస్తుంది. వాళ్లు ఎవరు? ఆ బిచ్చగాడిని చంపాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ ఇళ్లు ఎవరిది? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగు కమెడియన్…
బ్లడీ బెగ్గర్ మూవీలో తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో నటించాడు. అతడితో పాటు రాధారవి, రెడిన్ కింగ్స్‌లే ముఖ్య పాత్రలు పోషించారు. గత కొన్నాళ్లుగా తమిళంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోన్నాడు కెవిన్. అతడు హీరోగా నటించిన దాదా, లిఫ్ట్, స్టార్ సినిమాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం నయనతారతో ఓ సినిమా చేస్తున్నాడు కెవిన్.