Best Web Hosting Provider In India 2024
Rejected Heroes: ఒక హీరో సినిమాలను మూడు సార్లు రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు.. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్‌తోపాటు!
Actors Rejected Hero Movies For 3 Times Telugu: ఒక పెద్ద హీరో సినిమాను ఏ సెలబ్రిటీ రెజెక్ట్ చేయరు. కానీ, కొంతమంది హీరోల సినిమాలో నటించేందుకు మూడు సార్లు రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. రెజెక్ట్ కాబడిన హీరోల్లో చిరంజీవి, మహేశ్ బాబు కూడా ఉన్నారు. మరి రెజెక్ట్ చేసిన తారలు ఎవరో ఇక్కడ చూద్దాం.
Actors Rejected Hero Movies For 3 Times In Telugu: ఒక అగ్ర హీరో సినిమాలో నటించేందుకు ఏ సెలబ్రిటికీ అయిన పెద్ద అవకాశం అని చెప్పాలి. ఒక్క ఛాన్స్ వస్తే దూరిపోయి సినిమాను చేసేందుకు రెడీగా ఉంటారు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సార్లు నటించి ఆఫర్ వచ్చిన రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. మరి వారెవరు, ఎవరి సినిమాలను రెజెక్ట్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
రాజ్ తరుణ్-చాందిని చౌదరి
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ చాందిని చౌదరి ఇద్దరు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చినవారే. వీళ్లిద్దరు కలిసి జంటగా అనేక షార్ట్ ఫిల్స్మ్‌లో నటించి అలరించారు. ఈ జంటకు అప్పట్లో మంచి క్రేజ్ కూడా ఉండేది. షార్ట్ ఫిల్మ్స్ క్వీన్‌గా యూట్యూబ్ సెన్సేషన్‌గా చాందిని చౌదరి పేరు తెచ్చుకుంది. 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ ముందుగా ఎంట్రీ ఇస్తే.. 2015లో కుందనపు బొమ్మ మూవీతో చాందిని చౌదరి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
అనంతరం ఇద్దరు విడివిడిగా హీరో హీరోయిన్స్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే, రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన మొదటి మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చాందిని చౌదరినే తీసుకుందామని అనుకున్నారట. కానీ, ఒక్కొక్క కారణం వల్ల చాందినీ చౌదరి నటించకలేకపోయిందట. “అనుకోకుండా ఆ సినిమాలు చేయలేకపోయాను. అంతకుమించి కారణం లేదు” అని ఓ ఇంటర్వ్యూలో చాందినీ చౌదరి చెప్పింది.
చిరంజీవి-అజయ్ ఘోష్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ ఘోష్. ఇటీవల చాందీని చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా వచ్చి పర్వాలేదనిపించుకుంది. బెదురులంక 2012, సరిపోదా శనివారం, మంగళవారం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ ఘోష్.
అయితే, ఒక నటుడిగా ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించాలని ఉంటుంది. కానీ, అజయ్ ఘోష్ మాత్రం చిరంజీవి హీరోగా చేసిన గాడ్ ఫాదర్, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. కానీ, ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల చిరంజీవి మూవీస్‌ను మూడు సార్లు రెజెక్ట్ చేయాల్సి వచ్చిందట.
డైరెక్టర్ శంకర్
డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజ్ చెప్పాల్సి పనిలేదు. ఆయనతో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు కోరుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. జనవరి 10న విడుదల కానున్న గేమ్ ఛేంజర్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలని చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ ఎంతో అనుకున్నారట. కానీ, ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో ఒక్క మూవీ పడలేదు. జెంటిల్‌మెన్ సినిమా చూసిన తర్వాత శంకర్‌తో ఓ సినిమా చేయాలని చిరంజీవి ఆశపడినట్లు, ఇప్పటికీ అది కుదరలేదు అని ఓ సందర్భంలో చిరంజీవి తెలిపారు. అలాగే, మహేశ్ బాబు, ప్రభాస్ కూడా తమకున్న బిజీ షెడ్యూల్స్, ఇతర కారణాల వల్ల శంకర్‌తో మూవీస్ చేయలేకపోయారట.