Best Web Hosting Provider In India 2024
OTT: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ డ్రామా- భార్యతో శృంగారం, లైవ్‌గా చూడమని భర్తకు బ్లాక్ మెయిల్- 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్!
Lens Movie OTT Streaming: ఓటీటీలో రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ లెన్స్ అలరిస్తోంది. నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీని న్యూడ్ కాల్స్, సోషల్ మీడియాలో ప్రైవేట్ వీడియోలు లీక్, వాటి వల్ల జరిగే అనర్థాలు వంటి అంశాలతో సందేశాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Lens Movie OTT Release: ఓటీటీలో ఎన్నో జోనర్స్‌లో మూవీస్ అందుబాటులో ఉన్నప్పటికీ ఒక పర్టిక్యూలర్ టైప్ సినిమాలపై అమితాసక్తి చూపిస్తుంటారు సినీ ప్రియులు, ఆడియెన్స్. హారర్, కామెడీ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్స్, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది.
రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్
అలాంటి సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కించుకోకపోయినా ఓటీటీలో మాత్రం అలరిస్తుంటాయి. అలా ఓటీటీలో అలరిస్తోన్న రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీనే లెన్స్. క్రైమ్, రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో
లెన్స్ మూవీ మలయాళం, తమిళం రెండు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. అయితే, మలయాళ భాషలో ఎల్‌జే ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేయగా.. తమిళంలో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్ రూట్ బ్యానర్‌పై రిలీజ్ చేశారు. థియేటర్ల కంటే ముందుగా క్లామ్ (CLAM) ఫెస్టివల్ ఇంటర్నేషనల్ సినిమా సొలిడరీ, సౌత్ ఆసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జాగరన్, చెన్నై, పూణె, బెంగళూరు, లొనవాల, బయోస్కోప్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.
వర్చువల్ సెక్స్ రిలేషన్‌షిప్స్
జయప్రకాష్ రాధాకృష్ణన్, వినుతా లాల్, మిషా ఘోషల్, ఆనంద్ సామి ప్రధాన పాత్రలు పోషించిన లెన్స్ సినిమాను వర్చువల్ సెక్స్ రిలేషన్‌షిప్స్, న్యూడ్ కాల్స్, ప్రైవేట్ వీడియోలు లీక్ వంటి అంశాలపై తెరకెక్కించారు. భార్యాభర్తల ఇంటిమేట్ వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయితే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాలను సందేశాత్మకంగా ఇందులో చూపించారు.
4 ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఇతరుల శృంగార వీడియోలు చూసి సంతోషపడే వ్యక్తులు (వయోరిజం), ఆన్‌లైన్‌లో ఇంటిమేట్ వీడియోలు, ఆ బాధితుల మానసిక క్షోభ, సూసైడ్, రివేంజ్ వంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో గంట 49 నిమిషాల రన్‌టైమ్‌తో లెన్స్ తెరకెక్కింది. లెన్స్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 6.6 రేటింగ్ ఉంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో తప్పా
అమెజాన్ ప్రైమ్, యాపిల్ ప్లస్ టీవీ, గూగుల్ ప్లే, యూట్యూబ్‌లో లెన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా చూడొచ్చు. కానీ, యాపిల్ ప్లస్ టీవీలో రూ. 149, యూట్యూబ్‌లో రూ. 25, గూగుల్ ప్లేలో 50 రూపాయలు చెల్లించి రెంట్ పద్ధతిలో వీక్షించాలి. ఒక్క అమెజాన్ తప్పా మిగతా మూడింట్లో సెపరేట్‌గా డబ్బు చెల్లించి రెంటల్ విధానంలో లెన్స్ మూవీని చూడొచ్చు.
లెన్స్ స్టోరీ
ఇక సినిమా కథ విషయానికొస్తే అరవింద్ అనే వ్యక్తికి ఒక అపరిచితుడు వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు అతను ఒక మహిళతో ఇంటిమేట్ అవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆ వీడియోను లైవ్ గా చూడమని లేకుంటే సూసైడ్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తాడు అపరిచితుడు. తీరా ఆ మహిళ అరవింద్ భార్య కావడంతో షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అపరిచిత వ్యక్తి ఎందుకు అలా చేశాడనేదే లెన్స్ కథ.
3 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, ప్రస్తుతానికి లెన్స్ మూవీ ఓటీటీల్లో తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. కానీ, సబ్ టైటిల్స్‌తో లెన్స్ చిత్రాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. భాషతో సంబంధం లేనుకునేవాళ్లు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ లెన్స్‌ను ఓటీటీలో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.