Best Web Hosting Provider In India 2024
ETV Win OTT January Releases: సంక్రాంతి బొనాంజా.. ఈటీవీ విన్ ఓటీటీలోకి 4 ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు..
ETV Win OTT January Releases: ఈటీవీ విన్ ఓటీటీ సంక్రాంతి బొనాంజా అందిస్తోంది. ఈ నెలలో నాలుగు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. వీటిలో థ్రిల్లర్స్, సర్వైవల్ థ్రిల్లర్స్ ఉన్నాయి. తాజాగా గురువారం (జనవరి 2) ఈ మూవీస్ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.
ETV Win OTT January Releases: ఓటీటీలోకి కొత్త ఏడాది కొత్త సినిమాలు ఎన్నో రాబోతున్నాయి. అయితే ముందుగా జనవరిలో నెలలో రానున్న సినిమాల గురించి చూద్దాం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఈటీవీ విన్ ఓటీటీ సంక్రాంతి బొనాంజా అందిస్తున్నామంటూ.. తాము స్ట్రీమింగ్ చేయబోతున్న సినిమాల గురించి వెల్లడించింది. వీటి స్ట్రీమింగ్ తేదీలను చెప్పకపోయినా.. మొత్తంగా జనవరిలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ చేయనున్నట్లు మాత్రం తెలిపింది. పోతుగడ్డ, వైఫ్ ఆఫ్, బ్రేకౌట్, మిన్‌మినీ సినిమాల పోస్టర్లను రిలీజ్ చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీ జనవరి మూవీస్
ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జనవరి 2) తమ ఎక్స్ అకౌంట్ ద్వారా పొంగల్ బొనాంజా గురించి వెల్లడించింది. “ఈ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ తో పొంగల్ ను సెలబ్రేట్ చేసుకోండి. ఈ జనవరిలో ఈటీవీ విన్ లోకి వస్తున్న ఈ ఎక్సైటింగ్ మూవీస్ చూడండి” అనే క్యాప్షన్ తో నాలుగు సినిమాల వివరాలను వెల్లడించింది.
అయితే ఈ నాలుగు కూడా చిన్న సినిమాలే. వీటిలో ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ కూడా ఉంది. వైఫ్ ఆఫ్, పోతుగడ్డ, మిన్‌మినీ, బ్రేక్ ఔట్ లాంటి సినిమాలు ఈ నెలలో రాబోతున్న వాటిలో ఉన్నాయి.
అన్నీ చిన్న సినిమాలే
ఈటీవీ విన్ ఓటీటీలోకి జనవరిలో వస్తున్న సినిమాల్లో పోతుగడ్డ ఒకటి. నిజానికి గతేడాది నవంబర్ 14 నుంచే స్ట్రీమింగ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు జనవరిలో మూవీని తీసుకురానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ఓ ప్రేమ కథ, రాజకీయ ఆట, సస్పెన్స్ తో నిండిన మూవీ ఇది అంటూ గతంలోనే ఈటీవీ విన్ ఈ సినిమా గురించి తెలిపింది.
ఇక వైఫ్ ఆఫ్ అనే మరో సినిమా కూడా రానుంది. ఇది కూడా ఓ లోబడ్జెట్ మూవీయే. దివ్య శ్రీ లీడ్ రోల్లో నటించిన థ్రిల్లర్ మూవీ. చాలా రోజుల కిందటే షూటింగ్ జరిగిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇది కాకుండా తమిళ మూవీ మిన్‌మినీ కూడా తెలుగులో రాబోతోంది. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఐఎండీబీలోనూ 7.7 రేటింగ్ నమోదైంది. ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
జవనరిలో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్న నాలుగో సినిమా బ్రేకౌట్ (Breakout). సుమారు రెండేళ్ల కిందట అంటే 2023 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెడుతోంది. రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. మోనోఫోబియాతో బాధపడే ఓ యువకుడు ఓ గ్యారేజీలో చిక్కుకుపోయిన తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీ స్టోరీ. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా కూడా ఆసక్తి రేపుతోంది.