Best Web Hosting Provider In India 2024
డీఎస్సీ పేరుతో 1.87 లక్షల మందికి దగా
వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ధ్వజం
చంద్రబాబు మొదటి సంతకమే దగా
ఇప్పటి వరకు అతీగతీ లేని మెగా డీఎస్సీ
రోజుకో ప్రకటనతో వాయిదాలు వేయడం సరికాదు
రవిచంద్ర స్పష్టీకరణ
ఖాళీలు తెలియకుండానే టెట్ నిర్వహించారా?
16 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు?
నిరవధికంగా డీఎస్సీ వాయిదా వేసే కుట్రే ఇది
వంద రోజుల్లో ఉద్యోగాలిచ్చామని చెప్పడం విడ్డూరం
ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర తీవ్ర ఆక్షేపణ
తాడేపల్లి: డీఎస్సీ పేరుతో 1.87 లక్షల నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దగా చేసిందని, రోజుకో ప్రకటన పేరుతో వాయిదాలు వేస్తున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాడిస్ట్ ప్రభుత్వమని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. టీవీలు, పేపర్లకు లీకులిస్తూ టీచర్ ఉద్యోగాల భర్తీని నిరవధికంగా వాయిదా వేసే కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
రవిచంద్ర ఇంకా ఏమన్నారంటే..
– చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది.
– అధికారంలోకి రాగానే 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. అధికారం చేపట్టాక మెగా డీఎస్సీ పేరుతో 16,347 పోస్టులు మాత్రమే ప్రకటించారు.
– టీచర్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ జూన్ 13న మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. దాదాపు 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారు.
– గత ప్రభుత్వంలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై టెట్ రాసి, క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎదురు చూస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ అర్హతను పరిగణించకుండా, ఆ టెట్ రద్దు చేసి
మెగా డీఎస్సీ పేరుతో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాడు.
– గత సెప్టెంబరు చివరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ కూడా నీటిమూటగా మారింది.
– మొన్నటికి మొన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 3 నెలలు సమయం ఇస్తున్నామన్న ప్రభుత్వం నవంబరు 6న నోటిఫికేషన్ ఇస్తున్నామని చివరి వరకు నమ్మించి మళ్లీ వాయిదా వేసింది. మరోసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
– తాజాగా జిల్లాలవారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ, విద్యా శాఖను ఆదేశించి, మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారు.
– జిల్లాల్లో ఖాళీ పోస్టులపూ ప్రభుత్వానికి వగాహన లేకుండానే, 16వేల పోస్టులను భర్తీ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించిందా? ఈ తతంగమంతా చూస్తుంటే డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
– టెట్ అర్హత సాధించిన 1.87 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో పోస్టుకు 11,439 మంది పోటీ పడుతున్నారు.
– బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులంతా తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి, డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో, వేలకు వేలు ఖర్చు చేసి, భారమైనా సరే కోచింగ్ తీసుకుంటున్నారు.
– సీఎం చంద్రబాబు నిర్వహించాలని కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కానీ ఆలోచనే లేదు. ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వం.
– కానీ ఈ ప్రభుత్వానికి సిగ్గులేకుండా మాది మంచి ప్రభుత్వం అని బాకాలు ఊదుకుంటూ వంద రోజుల్లో పూర్తి చేసిన హామీల్లో డీఎస్సీ ద్వారా 13,347 పోస్టులు భర్తీ చేశామని ప్రకటించుకోవడం విడ్డూరం.
– విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్ ఘోరంగా విఫలమయ్యారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలోనే కాకుండా ఎస్‌ఏ.1 పరీక్షలు నిర్వహణలో కూడా వైఫల్యం చెందారు. – పత్రికలు, టీవీలకు లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేయాలన్న ఆలోచన పక్క పెట్టి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి.
– లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పోరాడతామని రవిచంద్ర వెల్లడించారు.