Best Web Hosting Provider In India 2024
Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 29 లాంఛ్ – రాజమౌళి కోసం ఫస్ట్ టైమ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహేష్‌బాబు!
మహేష్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ అఫీషియల్‌గా గురువారం లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు రాజమౌళితో పాటు మహేష్‌బాబు అటెండ్ అయినట్లు సమాచారం. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
Mahesh Babu: హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. గురువారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మహేష్‌బాబుతో పాటు డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
ఓపెనింగ్ ఈవెంట్స్‌కు దూరం…
హీరోగా కెరీర్ ఆరంభం నుంచి తన సినిమా ఓపెనింగ్ ఈవెంట్స్‌కు మహేష్‌బాబు దూరంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. . మహేష్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌లోని ఎవరో ఒకరు అటెండ్ అవుతుంటారు. లాంఛింగ్ ఈవెంట్‌కు తాను వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ నమ్ముతుంటారని, అందుకే ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన కనిపించరని టాలీవుడ్ వర్గాలు చెబుతోంటాయి.
సెంటిమెంట్ బ్రేక్…
అయితే రాజమౌళి మూవీ కోసం ఫస్ట్ టైమ్ మహేష్‌బాబు తన సెంటిమెంట్‌ను పక్కనపెట్టాడట. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు హాజరైనట్లు చెబుతోన్నారు. అయితే సినిమా ప్రారంభోత్సవ పూజ కార్యక్రమాలు అయిన తర్వాతే మహేష్‌బాబు ఈ ఈవెంట్‌కు వచ్చి రాజమౌళితో పాటు మిగిలిన యూనిట్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్…
అమెజాన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా మహేష్‌బాబు, రాజమౌళి మూవీ రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజమౌళి మూవీ కోసం మహేష్‌బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఫిజిక్ పరంగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం విదేశాల్లో కొన్నాళ్లు ట్రైనింగ్ తీసుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్‌లో మహేష్ ఈ మూవీలో కనిపిస్తాడని సమాచారం.
హాలీవుడ్ నటీనటులు…
ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో మహేష్‌బాబు, రాజమౌళి మూవీ తెరకెక్కుతోన్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. మహేష్‌కు జోడీగా ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం.
విజయేంద్రప్రసాద్ కథ…
ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తోన్నాడు.
టాపిక్