Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu: రిషి, వసుధార జోడి రిపీట్ – గుప్పెడంత మనసు సీక్వెల్ టైటిల్ ఇదేనా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌కు నిండు మనసులు అనే టైటిల్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. గుప్పెడంత మనసులో రిషి, వసుధారలుగా కనిపించిన ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఈ సీక్వెల్‌లో లీడ్ రోల్స్ చేయనున్నట్లు సమాచారం
Guppedantha Manasu: గత ఏడాది ఎండ్ అయిన తెలుగు సీరియల్ గుప్పెడంత మనసుకు సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ మాలో నాలుగేళ్ల పాటు గుప్పెడంత మనసు సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. 2020లో ప్రారంభమైన ఈ సీరియల్‌కు 2024లో మేకర్స్ ఎండ్‌కార్డ్ వేశారు.
సీక్వెల్…
సడెన్‌గా గుప్పెడంత మనసు సీరియల్‌కు ముగింపు పలకడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు.వారికి స్టార్ మా త్వరలోనే గుడ్‌న్యూస్ వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ రాబోతోన్నట్లు సమాచారం. క్యారెక్టర్స్ అవే అయినా సీక్వెల్ కథ, టైటిల్ మొత్తం కొత్తగా ఉండనున్నట్లు చెబుతోన్నారు.
నిండు మనసులు…
గుప్పెడంత మనసు సీక్వెల్‌కు నిండు మనసులు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.గుప్పెడంత మనసులో రిషి, వసుధారలుగా నటించిన ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఈ సీక్వెల్‌లో లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్‌లో తమ కెమిస్ట్రీతో ముఖేష్ గౌడ, రక్షా గౌడ బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పించారు. నిజమైన లవర్స్ అనే ఫీల్ కలిగిస్తూ నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచారు. అసలు పేర్ల కంటే సీరియల్ పేర్లతోనే ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఫేమస్ అయ్యారు.
సీరియల్ క్రేజ్…
బుల్లితెరపై రిషి, వసుధార జోడీకి ఉన్నఫాలోయింగ్‌తో పాటు గుప్పెడంత మనసు సీరియల్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. సీక్వెల్‌లో రిషి, వసుధార అవే పేర్లతో కనిపిస్తారా? కొత్త పేర్లతో నటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
రీఎంట్రీ ఇచ్చినా?
గుప్పెడంత మనసు సీరియల్ గత ఏడాది ఆగస్ట్ 31తో ఎండ్ అయ్యింది. అదే రోజు సీక్వెల్ గురించి మేకర్స్ హింట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అలాంటిదేమి జరగలేదు.
గుప్పెడంత మనసులోని ప్రధాన పాత్రధారులతో పాటు మరికొంత మంది కొత్త ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. గుప్పెడంత మనసు స్టార్ మాలో చాలా కాలం పాటు నంబర్ వన్ సీరియల్‌గా కొనసాగింది. టీఆర్‌పీలో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
రిషి పాత్ర చేసిన ముఖేష్ గౌడ సడెన్‌గా గుప్పెడంత మనసుకు దూరం కావడంతో సీరియల్ డౌన్‌ఫాల్ స్టార్టయ్యింది. ఆ తర్వాత అతడు కొత్త క్యారెక్టర్‌తో రీ ఎంట్రీ ఇచ్చినా అంతగా వర్కవుట్ కాలేదు.
హీరోగా…
గుప్పెడంత మనసు సీరియల్‌కు గుడ్‌బై చెప్పిన ముఖేష్ గౌడ త్వరలోనే హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు. రెండు సినిమాలు చేస్తోన్నాడు. గీతా శంకరం, ప్రియమైన నాన్నకు సినిమాలు ఈ ఏడాది వేసవిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
గీతా శంకరం సినిమాలోని మట్టిబుర్ర అనే సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా గీతాశంకరం తెరకెక్కుతోంది. ప్రియమైన నాన్నకు మూవీ రోడ్ జర్నీ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ప్రియమైన నాన్నకు రిలీజ్ కాబోతోంది.