Sukumar Daughter: ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

Sukumar Daughter: ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Jan 02, 2025 06:10 AM IST

Sukumar Daughter Sukriti Veni Gandhi Thatha Chettu: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తొలి మూవీ గాంధీ తాత చెట్టు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటించిన తొలి సినిమాకే ఉత్తమ బాల నటిగా అవార్డ్ అందుకుంది సుకృతి బండ్రెడ్డి.

ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!
ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!

Sukumar Daughter Sukriti Veni Gandhi Thatha Chettu: దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూతురు అయిన సుకృతి వేణి నటించిన తొలి సినిమా ఇదే.

yearly horoscope entry point

పుష్ప 2 నిర్మాతలు

ఈ గాంధీ తాత చెట్టు మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. పుష్ప 2 ది రూల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలుగా ఉన్నారు.

ఉత్తమ బాల నటిగా అవార్డ్

ఇప్పటికే ఈ గాంధీ తాత చెట్టు సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఇదిలా ఉంటే, ఈ గాంధీ తాత చెట్టు సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

నెగెటివ్ వైబ్రేషన్స్

ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ.. ఇలా ఓ నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి” అని అన్నారు.

పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం

“ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది” అని డైరెక్టర్ పద్మావతి మల్లాది తెలిపారు.

అందరి హృదయాలను హత్తుకునేలా

“ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అని గాంధీ తాత చెట్టు దర్శకురాలు పద్మావతి మల్లాది పేర్కొన్నారు.

ఇతర ముఖ్యపాత్రలు

కాగా సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు మూవీలో ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రీ సంగీతం అందించగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల చేపట్టారు.

ఇక ఎడిటింగ్‌ హరిశంకర్‌ టీఎన్‌, పాటలు సుద్దాల అశోక్‌ తేజ, కాసర్ల శ్యామ్‌, విశ్వ, ప్రొడక్షన్‌ డిజైన్‌ వి. నాని పాండు, కో పొడ్యూసర్‌ అశోక్‌ బండ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అభినయ్‌ చిలుకమర్రి బాధ్యతలు నిర్వర్తించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024