Best Web Hosting Provider In India 2024
Stomach pain: మీకు తరచూ పొట్టనొప్పి వస్తూ ఉంటే వరుసగా పది రోజులు ఈ ఆహారాలను తినండి
Stomach pain: జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది. గట్ లో మంచి బ్యాక్టీరియా తగ్గినా కూడా పొట్ట నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. పొట్ట నొప్పి తగ్గడానికి కొన్ని రకాల ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని వరుసగా పదిరోజులు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
తిన్న తరువాత పొట్ట నొప్పి రావడం కొంతమందిలో కనిపిస్తుంది. మరికొందరికి కారణం లేకుండా తరచూ పొట్టనొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు చాలా ఇబ్బంది పడుతు ఉంటారు. జీర్ణక్రియ సరిగా జరగక ఇలా పొట్టనొప్పి వేధిస్తూ ఉంటుంది. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు జీవనశైలి. దీనివల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ బ్యాక్టిరియాలు పేగుకు చేరిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి.
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాల సంఖ్య తగ్గిపోతే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆహారం కడుపులో కుళ్లిపోయి గ్యాస్, ఎసిడిటీ సమస్య పెరగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. మీరు పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచాలనుకుంటే, పోషకాహార నిపుణులు ఏం చేయాలో చెబతున్నారు. ఈ 5 పనులు రోజూ చేయడం ప్రారంభిస్తే కొన్ని రోజుల్లోనే పొట్ట నొప్పి తగ్గిపోతుంది. ఇవి తిన్న పది గంటల తర్వాతే దీని ప్రభావం కనిపిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పాడ్ కాస్ట్‌లో గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహార నిపుణుడు ఖ్యాతి రూపానీ ఈ 5 పనులు చేయాలని సలహా ఇచ్చారు.
ప్రతిరోజూ మజ్జిగ త్రాగాలి
శీతాకాలం వచ్చిందటే గట్ బ్యాక్టిరియా దెబ్బతింటుంది. పొట్ట ఆరోగ్యానికి మజ్జిగ ఉత్తమ వనరు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి రోజూ మజ్జిగ తాగండి. కేవలం 10 రోజుల్లో వ్యత్యాసం కనిపించడం ప్రారంభమవుతుంది.
ప్రోబయోటిక్ ఆహారం తినండి
ఇడ్లీ, దోశ, ధోక్లా, కంజీ, కంజీ రైస్, పెరుగు అన్నం వంటి సహజ పులియబెట్టిన ఆహారాలు వారానికి కనీసం రెండుసార్లు తినండి. ఇవి మీ శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి.
ఈ డ్రింక్ ను ఉదయాన్నే త్రాగాలి
ప్రతి రోజూ ఉదయాన్నే మెంతులు, పసుపు టీ తాగాలి. ఒక చెంచా మెంతులను నీటిలో వేసి మరిగించాలి. తర్వాత చిటికెడు నల్ల మిరియాలు, పసుపు వేసి తాగాలి.
రోజూకో ఉసిరికాయ బెర్రీ తినండి
చలికాలంలో శరీరంలోని అన్ని లోపాలను బ్యాలెన్స్ చేసి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఒక ఉసిరికాయ తినండి. ఇది మీ శరీరంలో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ సమతుల్యం చేస్తుంది.
మీరు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే, ప్రతిరోజూ ఏదైనా కూరగాయలతో డిన్నర్ ప్రారంభించండి. సలాడ్లు, సూప్లు లేదా తేలికగా ఉడికించిన కూరగాయలు తినండి. అయితే కూరగాయలతో డిన్నర్ ప్రారంభించండి. ఆ తర్వాత పిండి పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్