Best Web Hosting Provider In India 2024
పెళ్లయిన పురుషులు తమ భార్య కాకుండా వేరే మహిళలకు ఎందుకు ఆకర్షితులవుతారు? ఇవే కారణాలని చెబుతున్న అధ్యయనం
భార్యాభర్తల మధ్య బంధం నమ్మకం, ఒకరిపై ఒకరికి ప్రేమ, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలేవీ బంధంలో తగ్గినా కూడా ఆ బంధం విచ్చిన్నమైపోతుంది. చాలాసార్లు, చక్కగా సాగుతున్న వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించి భార్యాభర్తల అనుబంధంలో చిచ్చుపెడతారు. ముఖ్యంగా పురుషులే ఎక్కువగా మోసం చేస్తారనే నమ్మకం ఉంది. అయితే మోసం అనేది మగవారికే ఆపాదిస్తున్నప్పటికీ…అది ఒక నిర్దిష్ట లింగానికి సంబంధించిన విషయం కాదు. ఆడవారు కూడా మోసం చేయవచచు. పెళ్లయిన తరువాత కూడా వేరొకరి పట్ల ఆకర్షితులు కావడం, ఇతరులతో రిలేషన్ షిప్ పెట్టుకోవడం సమాజంలో ఎక్కువైపోయింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనికి బలమైన కారణం ఏదీ లేదు, కానీ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలనే అధ్యయనం చెబుతోంది.
కనెక్ట్ కాకపోయినా
ఏ సంబంధంలోనైనా, భాగస్వాములు ఒకరితో ఒకరు భావోద్వేగంగా కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. భాగస్వాములు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోకపోతే, ఒకరితో ఒకరు మానసిక సంబంధాన్ని కలిగి ఉండకపోతే, ఏ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. పురుషుల స్వభావం కూడా చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది, చాలాసార్లు వారు తమ భావాలను వారి భాగస్వామి ముందు బహిరంగంగా వ్యక్తీకరించలేనప్పుడు, వారి నుండి అవసరమైన భావోద్వేగ మద్దతు పొందలేనప్పుడు, వారు తరచుగా మరొకరిని ఆ స్థానంలో వెతుక్కుంటూ ఉంటారు.
మజా కోసం
కొంతమంది పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కారణం వారి రొటీన్ జీవితం బోర్ కొట్టడమే. తమ రోజువారీ బోరింగ్ రొటీన్ జీవితానికి కొంచెం కిక్ జోడించడానికి, కొంతమంది మగవారు వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటారు. జీవితాంతం భాగస్వామితో కలిసి జీవించడం వారికి భారంగా ఉంటుంది. ఇతర మహిళలతో సంబంధం కలిగి ఉండటం వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు దానివల్ల కలిగే పర్యవసానాల గురించి ఆలోచించకుండా వారు తమ వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటారు.
చాలాసార్లు భార్యాభర్తల మధ్య బంధం సరిగ్గా సరిపోకపోవడానికి మారి మధ్య సమన్వయ లోపం కూడా కారణమే. ఇది సాధారణంగా వివాహమైన చాలా సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. వారు చిన్న చిన్న విషయాలకే వాదోపవాదాలు, గొడవలు పెట్టుకుంటారు. అటువంటి క్లిష్టమైన వాతావరణం నుండి బయటకు వచ్చిన తరువాత శాంతి, ఓదార్పు కోసం వెతుకుతూ మరో మహిళ వైపు ఆకర్షితులవుతారు.
పురుషులు దేనికి భయపడతారు?
చాలా మంది పురుషుల మనస్సులో మగతనం నిర్వచనం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికీ భయపడకుండా, బహిరంగంగా ఏం కావాలన్నా చేసేవాడే అసలైన మగవాడు అని కొంతమంది నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, వారు వివాహేతర సంబంధంలో పడటానికి అవకాశం కనిపిస్తే చాలు అల్లుకుపోతారు. ఈ వికృత ఆలోచన వారిని వారి వైవాహిక జీవితం నాశనం అవుతుందనే ఆలోచనను రానివ్వదు.
శారీరక సంబంధం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది పురుషులు సెక్స్ విషయానికి వస్తే జీవితాంతం తమ భార్యలకు విధేయంగా ఉంటారు. వారు ఒక్కరితోనే ఆ పని చేస్తారు. కొంతమంది పురుషులకు, సెక్స్ అనేది ఒక సరదా. జీవితాంతం ఒకే భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండటం వారికి చాలా బోరింగ్ గా మారుతుంది. అటువంటి వారు లైంగిక వైవిధ్యం కోసం భాగస్వాములను మారుస్తూ ఉంటారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్