Best Web Hosting Provider In India 2024
OTT Action Thriller: పది నెలల తర్వాత ఓటీటీలోకి మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ – ఎందులో చూడాలంటే?
OTT Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ కడకన్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హకీమ్ షాజహాన్, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి సాజిల్ మాంపాడ్ దర్శకత్వం వహించారు.
OTT Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ కడకన్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి సాజిల్ మాంపాడ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చిలో కడకన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు పది నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
మాలీవుడ్‌లోకి ఎంట్రీ…
కడకన్ సినిమాలో హకీమ్ షాజహాన్, రంజిత్, శరత్ సభా, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషించారు. కొత్త హీరోహీరోయిన్లతో లిమిటెడ్ బడ్జెట్‌లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. రా అండ్ రస్టిక్ టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను మెప్పించాయి. ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది
స్నేహం…ప్రేమ…
ఇండియాలోనే అతి పెద్ద సిటీలో ఒకటైన మల్లపురం ఏరియాలో ఇసుక మాఫియా కారణంగా జరిగిన క్రైమ్స్ నుంచి స్ఫూర్తి పొందుతూ స్నేహం, ప్రేమ, యాక్షన్ అంశాలతో ద్శకుడు సాజిల్ మాంపాడ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ ఇసుక మాఫియా వలలో చిక్కుకొని కొందరు అమాయకుల జీవితాలు ఎలా నాశనమవుతున్నాయనే సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు.
పోలీస్ ఆఫీసర్‌తో గొడవ…
నీలంబూర్ ఏరియాకు చెందిన మణి, సుల్ఫీ కుటుంబాల మధ్య స్నేహం ఉంటుంది. ఇసుక ఇల్లీగల్ బిజినెస్ కారణంగా మణి, సుల్ఫీ శత్రువులగా మారిపోతారు. సుల్ఫీ లోకల్ సీఐ రంజిత్‌తో గొడవపడతాడు. సుల్ఫీపై పగను పెంచుకున్న రంజిత్ అతడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఫిక్సవుతాడు. సుల్ఫీ ఇల్లీగల్ బిజినెస్‌ను అడ్డుకొని అతడిని దెబ్బ తీయాలని ప్లాన్ వేస్తాడు.
రంజిత్ కళ్లు కప్పి తన ఇసుక దందాను సుల్ఫీ ఎలా కొనసాగించాడు. సుల్ఫీ జీవితంలోకి వచ్చిన లక్ష్మి ఎవరు? మణితో నిజంగానే సుల్ఫీకి గొడవలు ఉన్నాయా? సుల్ఫీ రివేంజ్ కారణంగా అతడి తండ్రి హైదర్ అలీ ఎలా చిక్కుల్లో పడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
గోపీ సుందర్ మ్యూజిక్…
కడకన్ మూవీకి గీత గోవిందం ఫేమ్ గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. ఈమంజుమ్మేల్ బాయ్స్, అన్వేషిప్పిమ్ కండేతుమ్ లాంటి సినిమాలతో పోటీపడి థియేటర్లలో కడకన్ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీతోనే డైరెక్టర్ సాజిల్ మాంపాడ్ మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.