Best Web Hosting Provider In India 2024
Telugu Serial: తమిళ హిట్ సీరియల్‌ను తెలుగులోకి రీమేక్ చేస్తోన్న అన్నపూర్ణస్టూడియోస్ – ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?
Telugu Serial: స్టార్ మా ప్రేక్షకుల ముందుకు త్వరలో మరో కొత్త సీరియల్ రాబోతోంది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న మరుమగల్ సీరియల్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. ఈ రీమేక్ సీరియల్‌లో నటించనున్న లీడ్ యాక్టర్స్ ఎవరంటే?
Telugu Serial: కొంత గ్యాప్ తర్వాత హీరో నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఓ తమిళ సూపర్ హిట్ సీరియల్‌ను రీమేక్ చేస్తోంది. స్టార్ విజయ్ ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతోన్న తమిళ సీరియల్ చిన్న మరుమగల్ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళంలో టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్‌లో ఉంది. ఈ సీరియల్ త్వరలోనే తెలుగులోకి రీమేక్ అవుతోంది
గత ఏడాది లాంఛ్…
చిన్న మరుమగల్ సీరియల్ గత ఏడాది జనవరిలో లాంఛ్ అయ్యింది. ఈ సీరియల్‌లో నవీన్ కుమార్, శ్వేత కీలక పాత్రలు పోషిస్తోన్నారు. మనోజ్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సీరియల్ తెలుగులోకి రాబోతుంది. చిన్న మరుమగల్ సీరియల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులోకి రీమేక్ చేయబోతున్నది. ఈ కొత్త సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం.
శంకర్ కుమార్…
చిన్న మరుమగల్ తెలుగు రీమేక్‌లో శంకర్‌కుమార్ చక్రవర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్న ఈ సీరియల్‌తోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. శంకర్ కుమార్ గతంలో తమిళంలో పలు టీవీ షోస్‌తో పాటు కొన్ని సీరియల్స్ చేశాడు.
చిన్న కోడలిగా…
ఓ గొప్పింటిలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన ఓ యువతికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అత్త పొగరు, డామినేషన్‌ను ఎదురించి తన కాపురాన్ని ఎలా సరిదిద్దుకున్నది అనే కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ సాగనున్నట్లు సమాచారం. పలువురు తెలుగు సీరియల్ యాక్టర్స్ ఈ రీమేక్‌లో కీలక పాత్రలు పోషించనున్నారు.
త్వరలోనే అనౌన్స్‌మెంట్…
చిన్న మరుమగల్ తెలుగు రీమేక్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఈ సీరియల్ లాంఛ్ కానున్నట్లు చెబుతోన్నారు. ఏ సీరియల్ స్థానంలో ఈ రీమేక్ టెలికాస్ట్ కానుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం టైమ్ స్లాట్ కేటాయిస్తారా…ప్రైమ్ టైమ్‌లో టెలికాస్ట్ అవుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ఇటీవలే స్టార్ మాలో గీతా ఎల్ఎల్బీ, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కొత్తగా లాంఛ్ అయ్యాయి.
కథలో రాజకుమారి…
గతంలో కథలో రాజకుమారి, పున్నాగ, ముద్ద మందారం, పెళ్లి పందిరి, పుట్టింటి పట్టుచీరతో పాటు పలు తెలుగు సీరియల్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ఈ సీరియల్స్ చాలా వరకు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.