Best Web Hosting Provider In India 2024
Onions tips: ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి
Onions tips: ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడం గుర్తించే ఉంటారు. కళ్ళు విపరీతంగా మండిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
ఏ కూర వండాలన్నా కచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఇగురు ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయలు వేయాల్సిందే. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు విపరీతంగా మంట పుట్టి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది కాస్త ఇబ్బంది పెడుతుంది. కేవలం కోసే వాళ్ళకే కాదు, ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ గదిలో ఉన్న వారికి కూడా కళ్లు మండడం అనేది మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళు మండుతాయి. అలా కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కోసే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ముఖ్యమైన కారణం వాటిలో ఉండే ఎంజైమ్‌లు. ఉల్లిపాయను కట్ చేసినప్పుడు లోపల ఉన్న ఎంజైమ్ నుండి ఒక రకమైన వాయువు బయటకు విడుదలవుతుంది. ఇది ముక్కు, కళ్ళను చికాకు పెడుతుంది. దీనివల్లే కళ్ళనుండి కన్నీళ్లు ధారాపాతంగా వస్తూ ఉంటాయి. కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయడం కుదరదా? అంటే దానికి కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీరు కన్నీళ్లు పెట్టకుండానే ఉల్లిపాయలను చకచకా కోసేయగలరు.
ఉల్లిపాయ కట్ చేసే చిట్కాలు
ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన గాగుల్స్ తయారు చేశారు. వీటిని పెట్టుకుంటే ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే గ్యాస్ మీ కళ్ళను చేరకుండా ఉంటుంది. అలాగే ముక్కు ద్వారా కూడా ఈ గ్యాస్ మీ కళ్ళకు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రత్యేక గాగుల్స్ ని పెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ కూడా కళ్ళ వైపు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల కన్నీళ్లు రావు.
పదునైన కత్తితో
ఉల్లిపాయలు కోసే కత్తి పదునుగా ఉండేలా చూసుకోండి. కత్తి అంచు పదునుగా ఉంటే ఉల్లిపాయలు త్వరగా కట్ అవుతాయి. దీనివల్ల ఉల్లిపాయ పొరలు కూడా ఎంజైమ్‌లు తక్కువగా విడుదలవుతాయి. సాధారణ కత్తితో కట్ చేసేటప్పుడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అలాగే ఉల్లిపాయ గోడలు ఎక్కువగా దెబ్బతిని అందులోంచి గ్యాస్ అధికంగా విడుదలవుతుంది. అదే పదునైన కత్తి అయితే చకాచకా ఉల్లిపాయను కోసేస్తుంది. కాబట్టి ఎంజైమ్‌లు తక్కువగా విడుదల అయ్యే అవకాశం ఉంది.
నీటిలో వేసి
ఉల్లిపాయల్ని కోయడానికి పావుగంట ముందు ఉల్లిపాయ తొక్కను తీసి దాన్ని నాలుగు ముక్కలుగా కోసి నీటిలో వేసి ఉంచండి. అలా ఒక పావుగంట పాటు వదిలేయండి. ఆ నీటిలో రెండు చుక్కల వైట్ వెనిగర్ కూడా వేయండి. పావుగంట తర్వాత ఈ ఉల్లిపాయలను కోస్తే మీకు కళ్ళలోంచి నీళ్లు రావు. ఎందుకంటే ఉల్లిపాయ నుంచి ఎంజైమ్ లు ముందుగానే విడుదల అయిపోయి నీటిలో కలిసిపోతాయి. కాబట్టి మీకు కళ్ళు మండే సమస్య రాదు.
ఫ్రిజ్ లో…
ఉల్లిపాయలను సగానికి కట్ చేసి రెండు ముక్కలుగా చేసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఫ్రిజ్లో పెట్టిన 20 నిమిషాల తర్వాత తీస్తే ఉల్లిపాయ నుంచి ఎలాంటి ఎంజైములు విడుదల కావు. కాబట్టి వాటిని హ్యాపీగా చిన్న చిన్న ముక్కలుగా తరగొచ్చు. కన్నీళ్ళ సమస్య ఉండదు.
ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయండి. గాలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎంజైములు మరింతగా గదిలో వ్యాపిస్తాయి. గదిలో ఉన్న వారందరి కళ్ళకు ఇవి చేరుతాయి. దీనివల్ల అందరికీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి.
ఉల్లిపాయలను తరుగుతున్నప్పుడు మీ నాలుకను బయట పెట్టండి. ఆ నాలుక మీద ఉండే తడి ఈ ఎంజైములను పీల్చుకుంటుంది. దీనివల్ల కొంతవరకు కన్నీళ్లు రాకుండా అడ్డుకోవచ్చు. లేదా నోటితో ఒక బ్రెడ్ స్లైస్ ను పట్టుకోండి. ఆ బ్రెడ్ స్లైసు ఉల్లిపాయల నుంచి విడుదలై ఎంజైములను పీల్చేసి కళ్ళకు చేరకుండా అడ్డుకుంటాయి. మీకు ఎంతో మేలు చేసే చిట్కాలు ఇవన్నీ.
సంబంధిత కథనం