Crime news : అమానుషం- 6ఏళ్ల చిన్నారులే వారి టార్గెట్​! రేప్​ చేసి, చంపి..

Best Web Hosting Provider In India 2024

Crime news : అమానుషం- 6ఏళ్ల చిన్నారులే వారి టార్గెట్​! రేప్​ చేసి, చంపి..

Rape case : దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి! తాజాగా జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు 6ఏళ్ల చిన్నారులను రేప్​ చేసి, చంపేశారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

మధ్యప్రదేశ్​, యూపీలో దారుణం!

మధ్యప్రదేశ్​లో అత్యంత అమానవీయ, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, ఓ 6ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి, అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను చంపేశాడు.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ నర్మదాపురం జిల్లా సియోని మాల్వా ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది ఈ ఘటన. ఆరేళ్ల బాలికను నిందితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు! నిందితుడు అజయ్ ధుర్వే (30)ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

చిన్నారి కుటుంబ సభ్యులకు ధుర్వే పరిచయస్తుడు. కాగా గురువారం రాత్రి ఆమె బంధువులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి ఆపై ఊపిరాడకుండా చేసి చంపేశాడు! తెల్లవారుజామున సమయంలో ఓ కాలువ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి పారిపోయాడు.

చిన్నారి కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం పోలీసులకు కూడా తెలిసింది. చివరికి.. కాలువకు సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిచినట్టు ఇన్​స్పెక్టర్ అనూప్ ఉయికే తెలిపారు.

ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్టు, నేరం జరిగిన 4-5 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్​పీ గురుచరణ్ సింగ్ వెల్లడించారు.

ఇదిలావుండగా, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి సమీపంలోని జంక్షన్ వద్ద బాధితురాలి బంధువులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ధూర్వేను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

 

యూపీలో కూడా..

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూపీలో 6ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్​ ముజఫర్​నగర్​లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

మన్సూర్​పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎన్​కౌంటర్​ జరిగిందని, ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్​ చేశామని శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశామని సర్కిల్ ఆఫీసర్ (సీఓ) రమాశిష్ యాదవ్ తెలిపారు.

మన్వీర్ (40) మిఠాయి ఇస్తానని నమ్మించి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు!

పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడిన నిందితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

అసోంకు చెందిన చిన్నారి కుటుంబం స్థానిక ఫ్యాక్టరీలో పనిచేస్తోంది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link