Wheat Flour Punugulu: మైదా పిండి లేకుండానే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా పునుగులు చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేసేయండి

Best Web Hosting Provider In India 2024

Wheat Flour Punugulu: మైదా పిండి లేకుండానే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా పునుగులు చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేసేయండి

Wheat Flour Punugulu: పునుగులంటే మీకు, పిల్లలకు చాలా ఇష్టమా.. మైదా పిండికి భయపడి తినడం మానేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే. గోధుమ పిండితో చల్ల పునుగులు చేశారంటే ఆరోగ్యం గురించి ఎటువంటి బెంగ లేకుండానే రుచికరమైన పునుగులు తినేయొచ్చు. అదెలాగో చూద్దాం రండి.

మైదా పిండి లేకుండానే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా పునుగులు చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేసేయండి
మైదా పిండి లేకుండానే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా పునుగులు చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేసేయండి

పునుగులంటే చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ చాలా మందికి ఇష్టం. మైదా పిండి తినడం వల్ల ఏదో హాని జరుగుతుందని భయపడి దూరంగా ఉంటుంటారు. కానీ, మైదా పిండి వాడకుండానే టేస్టీగా, క్రిస్పీగా పునుగులు తయారుచేసుకోవచ్చని తెలుసా. గోధుమ పిండితో చల్ల పునుగులు చేసి పెట్టారంటే, ఇంట్లో వాళ్లంతా ఇష్టంగా తింటారు. వారి ఆరోగ్యం గురించి కూడా చింతించాల్సిన పని లేదు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, ఈవెనింగ్ స్నాక్స్ గానూ చేసి పెట్టవచ్చు. ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో పునుగులు ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం రండి.

గోధుమ పిండి చల్ల పునుగులకు కావాల్సిన పదార్థాలు:

  1. గోధుమ పిండి
  2. పుల్లటి పెరుగు
  3. ఉప్పు
  4. జీలకర్ర
  5. వంట సోడా
  6. ఉల్లిపాయలు
  7. పచ్చిమిర్చి
  8. వంట నూనె

గోధుమ పిండి చల్ల పునుగులు తయారుచేసే విధానం:

  • ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి
  • ఒక కప్పు పుల్లటి పెరుగు వేయండి.
  • పెరుగును కాస్త చిలికిన తర్వాత అందులో చిటికెడు వంట సోడా, రుచికి తగినంత ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర వేసి కలపండి.
  • ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి అందులో వేయండి.
  • ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ బాగా కలుపుకోండి.
  • పిండి మధ్యలో ఎక్కడా ఉండలు లేకుండా చేత్తో కలపండి.
  • పిండి బాగా జోరుగా ఉండకూడదు, అలాగే గట్టిగా కూడా ఉండకుండా కలపాలి.
  • (జోరుగా ఉన్న పిండితో పునుగులు వేస్తే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. గట్టిగా కలిపితే మధ్యలో పచ్చిగా ఉండిపోతాయి)
  • టిఫిన్ చేయడానికి కనీసం మూడు గంటల ముందే ఈ పిండిని కలుపుకోవడం బెటర్.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం చేయాలనుకుంటే రాత్రే పిండిని రెడీ చేసుకుని పెట్టుకుంటే, పునుగులు మరింత రుచికరంగా అనిపిస్తాయి.
  • వీటిని సాయంత్రం స్నాక్స్ గా తినాలనుకునే వారు ఉదయాన్నే కలుపుకుని సాయంత్రం వేసుకోవచ్చు.
  • పిండి చక్కగా నానిన తర్వాత పునుగులు వేసుకునే ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రింగులుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. అందులోనే కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి.
  • వీటన్నిటినీ బాగా కలిసిపోయేంతలా మరోసారి కలపండి.
  • ఆ పిండి చేతి నుంచి జారే విధంగా ఉండాలని మర్చిపోవద్దు.
  • ఇప్పుడు లోతుగా ఉండే కళాయి తీసుకోండి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోయండి.
  • నూనె బాగా వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని వేళ్ల సహాయంతో చిన్న చిన్న ఉండలుగా నూనెలో వేయండి.
  • ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత పునుగులను వేయించుకునే సమయంలో కచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలని గుర్తుంచుకోండి.
  • లేదంటే పైన పొర మాత్రమే వేగి లోపలి భాగం పచ్చిగా ఉండిపోతుంది.
  • రెండు నిమిషాలకు ఒకసారి వాటిని కిందకు మీదకు తిప్పుతుండటం వల్ల పునుగులు బాగా ఫ్రై అవుతాయి.
  • గోధుమ పిండితో చేసే పునుగులు గోల్డెన్ కలర్ దాటి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇలా చేస్తే క్రిస్పీగా, టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయినట్లే.
  • వీటిని పల్లీ చట్నీ, టమాటా పచ్చడి లేదా అల్లం పచ్చడి పెట్టుకుని సర్వ్ చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది.

 

 
Whats_app_banner
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024