Karthika Deepam January 4 Episode: దరిద్రానివి నువ్వే.. పారుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. సైకిల్ వల్ల దీప కన్నీరు

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam January 4 Episode: దరిద్రానివి నువ్వే.. పారుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. సైకిల్ వల్ల దీప కన్నీరు

Karthika Deepam Today Episode January 4th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపను అవమానించేలా పారిజాతం చాలా మాటలు అంటుంది. దీంతో కార్తీక్ గట్టిగా స్పందిస్తాడు. పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. దాసును సాయం అడుగుతుంది సుమిత్ర. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam January 4 Episode: దరిద్రానివి నువ్వే.. పారుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. సైకిల్ వల్ల దీప కన్నీరు

కార్తీక దీపం 2 నేటి (జనవరి 4) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపతో పారిజాతం మాట్లాడుతుంది. దీపను దరిద్రం అంటూ అవమానిస్తుంది. దీప తండ్రి చనిపోయాడని, తనను పెళ్లి చేసుకున్న నరసింహం జైలు పాలయ్యాడని అంటుంది. పెళ్లి చేసుకొని నువ్వు కూడా రోడ్డుపైకి వచ్చావని కార్తీక్‍తో పారిజాతం చెబుతుంది. “దీప హైదరాబాద్‍లో అడుగుపెట్టింది. నర్సిగాడిని కలిసింది. కొడితే వెళ్లి జైలులో పడ్డాడు. వాడి బతుకుతో పాటు రెండో పెళ్లి బతుకు సర్వనాశనం. నువ్వు తాళి కట్టావ్. నీ బతుకు రోడ్డు మీదకు తీసుకొచ్చింది కదా” అని పారిజాతం అంటుంది. దీంతో కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

అసలైన దరిద్రానివి నువ్వే

దీపను తానే రోడ్డు మీదకు తెచ్చానని, లేకపోతే హాయిగా ఉండేదని కార్తీక్ అంటాడు. తాతతో మాటపడలేక దీప చేతిని పట్టుకొని బయటికి వచ్చానని చెబుతాడు. “నీ మరదలితో పెళ్లి చెడిపోయేందుకు ఈ దరిద్రపు పాదం కారణం కాదా” అని పారు అంటుంది. “వీటన్నింటికీ కారణం నువ్వే అని పారిజాతాన్ని కార్తీక్ అంటాడు. “అసలైన దరిద్రానివి నువ్వే” అని కౌంటర్ ఇస్తాడు. దీంతో కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది పారు. “ఏ దీపను అనేటప్పుడు ఆ మాట నా చెవులకు వినసొంపుగా ఉందనుకున్నావా.. నీలా నాకూ మండింది” అని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని నీకు ముందు చెప్పానని పారిజాతానికి అప్పటి విషయాలను కార్తీక్ గుర్తు చేస్తాడు. అయినా అతితెలివితో ఆ విషయాన్ని పెళ్లి దాకా తెచ్చావని కోప్పడతాడు. తమ ఇద్దరికీ రాసిపెట్టి ఉందని కార్తీక్ అంటాడు.

నా అదృష్ట దేవత

“దీప దురదృష్టం కాదు. నా అదృష్టం దేవత. జరిగిన తప్పులను తనకు ఏ సంబంధం లేదు. పది మంది మంచి కోరుకునే మనిషి.చ కావాల్సిన వారితో ప్రయాణం చేస్తూ కావాల్సిన వారి సంతోషాన్ని కోరుకుంటారు. దీప కూడా అలాంటిదే” అని కార్తీక్ అంటాడు. దీంతో నువ్వు కావాల్సినట్టు అనుకో.. కానీ చూసే వారికి అలా అనిపించడం లేదని పారు అంటుంది. దీప ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా మాట్లాడుతోందని పారిజాతం కుటిలంగా మాట్లాడుతుంది. భర్త దగ్గరికి వస్తే చంపేస్తానని జ్యోత్స్నతో దీప అంటుందని, ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా మాట్లాడుతోందని నిందలు వేస్తోంది. నీ దగ్గర ఏ మాటలు చెబుతుందో తెలియదని, దీప నీ జీవితానికి విలన్‍రా అని పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.

 

‘దీప ఎక్కడ.. జ్యోత్స్న ఎక్కడ’

దీప చేసిన దరిద్రాలు కాగితంపై రాసి ఇంటికి అతికించాలని అనుకుంటున్నానని పారిజాతం అంటుంది. దీంతో కోపంతో వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. “చేతిలో పెన్ ఉంది కదా అని, కాగితం ఖాళీగా ఉంది కదా అని దీప గురించి ఏది పడితే అది రాయకు. దీపను గురించి నీకు ఏం తెలుసు. పదేళ్ల వయసులో తండ్రి కష్టాన్ని చూసి ఇష్టమైన చదువును వదిలేసింది. ఇష్టం లేకపోయినా తండ్రి కోసం తల పంచుకొని తాళి కట్టించుకుంది. కట్టుకున్న వాడు మోసం చేసిన తన కాళ్ల మీద తాను బతికిందే తప్ప ఎవరి ముందు చేయి చాపలేదు” అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నతో పోలిస్తూ దీప గొప్పతనాన్ని కార్తీక్ చెబుతాడు. “తప్పతాగి మనుషులను చంపిన మనుషులను చంపిన జోత్స్న ఎక్కడ.. సంబంధం లేకపోయినా మా అత్త ప్రాణాలు కాపాడిన దీప ఎక్కడ. సొంత మేనత్త మోసం చేసినా కష్టకాలంలో అనసూయను ఆదుకున్న దీప ఎక్కడ.. తాతను రెచ్చగొట్టి తీసుకొచ్చి నేను ఇల్లు వదిలి రోడ్డు మీద పడేలా చేసిన జ్యోత్స్న ఎక్కడ. జోత్స్నది అసూయ.. దీపది ఆత్మాభిమానం” అంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు. దీంతో పారిజాతం సైలెంట్ అయిపోతుంది. దీప గొప్పతనాన్ని కార్తీక్ వివరిస్తూనే ఉంటాడు. దీప అందరూ బాగుండాలని కోరుకుటుందని చెబుతాడు.

 

కార్తీక్ వార్నింగ్

దీపలాంటి ఔన్నత్యం ఉన్న స్త్రీమూర్తిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు మనసు ఉండాలి, ఆ మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలని పారిజాతానికి బుద్ధి చెబుతాడు కార్తీక్. “కళ్లతో చూసి క్యారెక్టర్ చూసి చేతికొచ్చినది రాయకు. నోటికొచ్చినది వాగకు. ఇప్పటికైనా పద్దతి మార్చుకో. బాధ్యతగా ఉండు. పారు.. నీకే చెప్పేది. చేసిన తప్పులు రాస్తాను.. గోడపై కాగితాలు రాస్తానంటే చూస్తూ ఊరుకోను. నా జీవితానికి దీప విలన్ కాదు. కథానాయిక” అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. ఇది నేను గెలిచిన రోజు అర్థం అవుతుందని అంటాడు. ఇలాంటి వారితో మాట్లాడి మనం సమయం వృథా చేసుకోకూడని దీపతో కార్తీక్ చెబుతాడు. కార్తీక్ ఇంత వైలెంట్‌గా రియాక్ట్ అయ్యాడేంటి అని పారు అనుకుంటుంది. నా ఒక్కదానికే కాదు ఇంకెవరికో కూడా ఈ వార్నింగ్ ఇచ్చినట్టు ఉన్నాడని, కానీ తాను మారను అను పారిజాతం అనుకుంటుంది. ఇలాగే ఉంటానని, మీ జంట విడిపోయే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని అనుకుంటుంది.

దాసును ప్రశ్నించిన కాశీ

దాసు డల్‍గా ఉండటంతో కాశీ ప్రశ్నిస్తాడు. నవ్వడం మానేశావని, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నావని అంటాడు. నువ్వు వెతుకుతున్న మనిషి దొరగడం లేదా అని అడుగుతాడు. ఆ మనిషి ఎప్పటికీ దొరకడు అంటూ కాశీ దగ్గర నిజం దాచేస్తాడు దాసు. తాను అన్వేషించిన నిజం దొరికినా.. నా నోటితో చెప్పకూడదని అంటాడు. ఆ దేవుడే చెప్పాలని అంటాడు. దేవుడు చెప్పడం ఏంటి మావయ్య అని స్వప్న ప్రశ్నిస్తుంది. విడిపోయిన వాళ్లను దేవుడే కలపాలని దాసు అంటాడు. తనకు పని ఉందంటూ బయటికి వెళ్లిపోతాడు. దాసు పరిస్థితిపై కాశీ, స్వప్న మాట్లాడుకుంటారు. ఎవరికీ చెప్పలేని కథ కానీ, నిజం కానీ మా నాన్నకు తెలుసు దిల్లూ, అది తనలో దాచుకోలేక బాధపడుతున్నాడని కాశీ అంటాడు. కార్తీక్, దీప గురించి మనం తెలుసుకోవాలని స్వప్న అంటుంది. సమస్యలను దాటి ముందుకు వెళతారని చెబుతుంది.

 

జీతాలు ఇవ్వలేని పరిస్థితి

ఆఫీస్‍లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని శివన్నారాయణతో జోత్స్న చెబుతుంది. ఎప్పడూ లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందని దశరథ్ ప్రశ్నిస్తాడు. లాభాలు తగ్గాయని జోత్స్న సమాధానమిస్తుంది. కంపెనీ సీఈవోగా లాభాలు పెరిగేలా చేయాల్సింది నువ్వు అంటూ శివన్నారాయణ అంటాడు. కంపెనీకి ఏది మంచిదో అది చేయాలని అంటాడు. కంపెనీ వ్యవహారాలు పూర్తిగా జోత్స్న వదిలేయడం కరెక్ట్ కాదేమో నాన్న అని దశరథ్ అంటే.. ఇలాగైనా పనిలో పడి కార్తీక్‍ను మరిచిపోతుందేమో అని శివన్నారాయణ చెబుతాడు. జోత్స్న గురించి ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని, గర్వపడేలా చేస్తుందని అంటాడు.

సైకిలెక్కిన కార్తీక్.. దీప కన్నీరు

తనను స్కూల్‍కు ఎవరు తీసుకొస్తారని కాంచనతో శౌర్య అంటుంది. ఇంతలో కూరగాయలు పట్టుకొని ఇంటికి వస్తారు కార్తీక్, దీప. “ఏం రౌడీ. రెడీ అయిపోయావా” అని శౌర్యతో కార్తీక్ అంటాడు. శౌర్యను తీసుకొని బస్‍లో వెళ్లాలని, మీతో కాదు బాబు అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్‍కు ఓ వ్యక్తి పాత సైకిల్ తీసుకొస్తాడు. ఆఫీస్‍లో పని చేసే వాచ్‍మెన్ సైకిల్ పంపాడని కాంచనతో కార్తీక్ అంటాడు. అతడు బైక్ ఇస్తానంటే.. పెట్రోల్‍కైనా డబ్బు కావాలని కదా సైకిల్ ఉంటే ఇవ్వమ్మన్నానని చెబుతాడు. సైకిల్ మీద అని నిట్టూరుస్తుంది శౌర్య. దేన్ని తక్కువగా చూడకూడదని కార్తీక్ సర్దిచెబుతాడు. దీప కూడా అభ్యంతరం చెబితే.. తనకు సైకిల్ తొక్కడం వచ్చని అంటాడు. ఆ తర్వాత శౌర్యను కూర్చొబెట్టుకొని సైకిల్ తొక్కుతూ వెళతాడు కార్తీక్. ఇది చూసి దీప, కాంచన కన్నీళ్లు పెట్టుకుంటారు. “కారులో తిరిగే కార్తీక్ బాబు.. ఇలా సైకిల్‍పై తిరిగే పరిస్థితి వచ్చింది. అంతా నా వల్లే కదా” అని దీప మనసులో అనుకుంటుంది.

 

మామయ్యకు అబద్దం చెప్పిన సుమిత్ర

కార్తీక్, దీపను చూసేందుకు సుమిత్ర వెళ్లాలనుకుంటుంది. అబద్ధం చెబుతున్నందుకు క్షమించండి మామయ్య అని మనసులో అనుకుంటుంది. గుడికి వెళతానని శివన్నారాయణతో చెబుతుంది. ఇంతలో పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. తాను గుడికి వస్తానని అంటుంది. దీంతో సుమిత్ర కంగారు పడుతుంది. తాను వెళ్లి పని కాలేదని, కార్తీక్ వల్లే ఇలా జరిగిందని పారు అంటుంది. కూరగాయలు మోసుకుంటూ కార్తీక్ రోడ్డుపై నడిచి వెళుతున్నాడని చెబుతుంది. పెళ్లి కోసం సర్వం వదిలేసిన వాడు రోడ్డపై నడిచి కాకుండా.. కారులో వెళతాడా అని శివన్నారాయణ అంటాడు. మీ పరువు అని పారు అనబోతే.. అదెప్పుడో రోడ్డుకెక్కింది.. ఇప్పుడు మీరు ఎక్కాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. తన పరువును మనవరాలు నిలబెడుతుందని అంటాడు.

దాసును చూసి జోత్స్న షాక్

మళ్లీ తమ ఇంటికి దాసు రావడంతో జోత్స్న షాక్ అవుతుంది. ఎన్నిసార్లు మనసు మారుతుందని అంటుంది. తాను నిజం చెప్పేందుకు రాలేదని దాసు చెబుతాడు. ఏ తప్పు చేయనని అనేంత వరకు నిజం చెప్పనని చెప్పాను కదా అని అంటాడు. ఇంతలో గుడికి బయలుదేరతా అని సుమిత్ర చెబుతుంది. దీపే వారసురాలు అనే నిజం చెబితే తాను చనిపోతానని మళ్లీ బెదిరిస్తుంది. ఏం జరిగినా చనిపోయిన తన కన్నతల్లి నిన్ను క్షమించదు నాన్న అని జోత్స్న అంటుంది. దీప పుట్టుక గురించి మరిచిపోతే.. నా చావు జరగదని చెబుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. ఎందుకు వెళ్లాలంటూ సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. మమ్మీ వినేసిందా ఏంటీ అని జోత్స్న కంగారు పడుతుంది. అయితే, ఆమె మాటలతో ఏమీ వినలేదని ఫిక్స్ అవుతుంది జోత్స్న. తాత ఏమైనా ఉంటాడని దాసును వెళ్లిపోవాలని అంటున్నానని చెబుతుంది. నీ నుంచి కోరుకునేది ఇదేనని సుమిత్ర అంటుంది. జోత్స్న అక్కడి నుంచి వెళుతుంది.

 

కార్తీక్, దీప దగ్గరికి తీసుకెళతావా..

జోత్స్న ఏమైనా అందా అని సుమిత్ర అడిగితే.. ఏం లేదంటాడు దాసు. కార్తీక్, దీప విషయంలో జోత్స్న చేసే పనులు దాని మీద చాలా కోపంగా ఉందని, కానీ కూతురు కదా మారుతుందనే ఆశ ఉందని సుమిత్ర అంటుంది. దాన్ని చూస్తే కాస్త మారినట్టే అనిపిస్తుందని చెబుతుంది. ఓ చిన్న సాయం చేస్తావా అని దాసును అడుగుతుంది. వదినను, కార్తీక్‍ను, దీపను, చంటిదాన్ని చూడాలని తనకు అనిపిస్తుందని, వాళ్ల దగ్గరికి తీసుకెళతావా అని అడుగుతుంది. దీంతో “వెళదాం పదండి వదినా. దీప మీద తల్లిలా మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రండి వెళదాం” అని దాసు చెబుతాడు. కార్తీక్, దీప వద్దకు బయలుదేరతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 4) ఎపిసోడ్ ముగిసింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024