Best Web Hosting Provider In India 2024
Barroz 3D OTT: ఓటీటీలోకి సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Superstar Mohanlal Barroz 3D OTT Streaming: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన త్రీడి ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన బరోజ్ 3డీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐదు భాషల్లో ఓటీటీ రిలీజ్ కానున్న బరోజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై లుక్కేద్దాం.
Barroz 3D OTT Release: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారెజ్ మూవీలో కీలక పాత్ర పోషించి తెలుగు వారికి మరింతగా దగ్గరయ్యారు. 1994లోనే గాండీవం సినిమాలో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుతో గెస్ట్ రోల్ చేసి అలరించారు మోహన్ లాల్.
తొలిసారి మెగాఫోన్
దృశ్యం మూవీ ఫ్రాంచైజీ, లూసిఫర్, బ్రో డాడీ, నెరు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా జైలర్‌లో మంచి కెమియోతో అదరగొట్టిన మోహన్ లాల్ మంచు విష్ణు కన్నప్ప మూవీలో ఓ పాత్ర చేస్తున్నారు. ఇలా తెలుగు, మలయాళం, తమిళ ఆడియెన్స్ ఆకట్టుకుంటున్నారు మోహన్ లాల్. ఇప్పటివరకు హీరోగా, గెస్ట్ రోల్ల్ చేసిన మోహన్ లాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్నారు.
త్రీడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్
మోహన్ లాల్ మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా “బరోజ్ 3డీ: గార్డియన్ ఆఫ్ ట్రెజరర్”. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన బరోజ్ సినిమాను త్రీడీలో రూపొందించారు. మోనహ్ లాల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన బరోజ్ 3డి చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్‌గా నిర్మించారు.
150 కోట్ల బడ్జెట్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించిన బరోజ్ మూవీని గ్రాండ్‌గా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించినట్లు సమాచారం. సినిమా కథ నచ్చడంతో మోహన్ లాల్ స్వయంగా డైరెక్షన్ చేస్తానని చెప్పిన బరోజ్ 3డీ మూవీ క్రిస్మస్ సందర్భంగా గతేడాది డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయింది.
బరోజ్ 9 రోజుల కలెక్షన్స్
అయితే, బరోజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించట్లేదని వచ్చే అతి తక్కువ కలెక్షన్స్ చెబుతున్నాయి. బరోజ్ త్రీడీ మూవీ 9 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. దీంతో సినిమా హిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బరోజ్ ఓటీటీ రైట్స్
ఇదిలా ఉంటే, బరోజ్ 3డీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాక్ చేసుకుంది. మంచి ధరకే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బరోజ్ త్రీడి ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాబట్టి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బరోజ్ 3డీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి ఐదు భాషల్లో బర్రోజ్ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
బరోజ్ 3డీ ఓటీటీ స్ట్రీమింగ్
ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలోకి బరోజ్ 3డీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే, పలు నివేదికల ప్రకారం ఫిబ్రవరి 15వ తేది లేదా వచ్చే నెల రెండో వారంలో బరోజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే, బరోజ్ 3డీ కలెక్షన్స్, టాక్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాపిక్