Trailer Records: తెలుగు సినిమాల ట్రైలర్ రికార్డ్స్- మూడో ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ వ్యూస్, లైక్స్- తొలి 2 స్థానాలు ఎవరివంటే?

Best Web Hosting Provider In India 2024

Trailer Records: తెలుగు సినిమాల ట్రైలర్ రికార్డ్స్- మూడో ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ వ్యూస్, లైక్స్- తొలి 2 స్థానాలు ఎవరివంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2025 11:40 AM IST

Tollywood Highest Viewed Liked Trailers In 24 Hrs: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన టాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ ఏంటీ?, వాటి స్థానాలు, లైక్స్ అండ్ వ్యూస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు సినిమాల ట్రైలర్ రికార్డ్స్- మూడో ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ వ్యూస్, లైక్స్- తొలి 2 స్థానాలు ఎవరివంటే?
తెలుగు సినిమాల ట్రైలర్ రికార్డ్స్- మూడో ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ వ్యూస్, లైక్స్- తొలి 2 స్థానాలు ఎవరివంటే?

Highest Viewed Liked Telugu Movies Trailers In 24 Hrs: బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి మొదలుకానుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ గేమ్ ఛెంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

yearly horoscope entry point

ఇదిలా ఉంటే, రీసెంట్‌గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలైన 24 గంటల్లో 36.24 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే, 541K లైక్స్ మార్క్ అందుకుంది.

అంటే, వ్యూస్ పరంగా గేమ్ ఛేంజర్ అదరగొట్టినప్పటికీ లైక్స్ పరంగా పెద్దగా కొత్త రికార్డ్స్ ఏం క్రియేట్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో రిలీజైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన టాలీవుడ్ మూవీస్ ట్రైలర్ రికార్డ్స్‌పై ఓ లుక్కేద్దాం.

24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన తెలుగు సినిమాల ట్రైలర్స్:

1. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ట్రైలర్‌ (తెలుగు) 44.67 మిలియన్ వ్యూస్‌తో టాప్ 1 ప్లేస్‌లో ఉంటే.. లైక్స్ పరంగా 885.4 వేలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది.

2. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీ 37.68 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంటే.. లైక్స్‌లో 665.8 వేలు రాబట్టి 12వ స్థానంలో ఉంది.

3. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి వ్యూస్ 36.24 మిలియన్ వ్యూస్‌తో టాప్ 3లో ఉంటే రాగా.. 541 వేల లైక్స్‌తో 17వ ప్లేస్‌తో సర్దుకుంది.

4. ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ చిత్రానికి 24 గంటల్లో 32.58 వ్యూస్ రాగా, 1.238 మిలియన్ లైక్స్ వచ్చాయి. వ్యూస్ పరంగా సలార్ టాప్ 4లో ఉంటే, లైక్స్ ద్వారా మాత్రం టాప్ 2లో నిలిచింది.

5. మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోడీగా యాక్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌కు 26.77 మిలియన్ వ్యూస్ సాధించుకోగా.. 1.219 లైక్స్ సంపాదించింది. దాంతో వ్యూస్ పరంగా టాప్ 5లో ఉంటే, లైక్స్ పరంగా టాప్ 3లో సర్కారు వారి పాట నిలిచింది.

అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న మరికొన్ని టాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్:

రాధేశ్యామ్- 23.20 మిలియన్ వ్యూస్

ఆచార్య- 21.86 మిలియన్ వ్యూస్

బాహుబలి 2- 21.81 మిలియన్ వ్యూస్

ఆర్ఆర్ఆర్ మూవీ- 20.45 మిలియన్ వ్యూస్

కేజీఎఫ్ చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్)- 19.38 మిలియన్ వ్యూస్

బ్రో మూవీ- 19.25 మిలియన్ వ్యూస్

వకీల్ సాబ్ మూవీ- 18.05 మిలియన్ వ్యూస్

అత్యధిక లైక్స్ సాధించిన మరికొన్ని తెలుగు సినిమా ట్రైలర్స్:

ఆర్ఆర్ఆర్ మూవీ- 1.24 మిలియన్ లైక్స్

భీమ్లా నాయక్ చిత్రం- 1.11 మిలియన్ ప్లస్ లైక్స్

వకీల్ సాబ్- 1.006 మిలియన్ లైక్స్

పుష్ప ది రైజ్ మూవీ- 893K

ఇలా రిలీజైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల ట్రైలర్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో వరుసగా పుష్ప 2 ది రూల్, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, సలార్, సర్కారు వారి పాట ఉన్నాయి. ఇక లైక్స్ పరంగా తొలి టాప్ 5 ప్లేసుల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, సలార్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ నిలిచాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024