Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం
విశాఖపట్నం: టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చర్లలో వైయస్ఆర్‌సీపీ బలంగా ఉందని, అక్కడ నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్దమని కొట్టిపారేశారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు.
‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది.
విశాఖలోని ముచ్చర్లలో వైయస్ఆర్‌సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్ చేశారు.