Best Web Hosting Provider In India 2024
Kalki TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ బ్లాక్‍బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలు ఇవే
Kalki 2898 AD TV Premiere Date: కల్కి 2898 ఏడీ చిత్రం టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ అధికారికంగా ఖరారయ్యాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్లలో దుమ్మురేపింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది 2024 జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైంది. గ్రాండ్ విజువల్స్, మహాభారతం బ్యాక్‍డ్రాప్, ప్రభాస్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపింది. ఇప్పుడు కల్కి 2898 ఏడీ చిత్రం టీవీ ఛానెల్‍లో తొలిసారి ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.
టెలికాస్ట్ ఎప్పుడంటే..!
కల్కి 2898 ఏడీ సినిమా జనవరి 12వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. సంక్రాంతికి రెండు రోజుల ముందే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు టీవీ ఛానెల్ అధికారికంగా ఖరారు చేసింది.
కల్కి చిత్రం త్వరలో వచ్చేస్తోందంటూ కొంతకాలంగా జీ తెలుగు చెబుతూ వస్తోంది. దీంతో సంక్రాంతి సందర్భంగా టెలికాస్ట్ అవుతుందని అర్థమైంది. ఈ క్రమంలో జనవరి 12న సాయంత్రం 5.30 గంటలకు ఈ మూవీ ప్రసారం అవుతుందని తాజాగా ప్రోమోలో వెల్లడించింది జీ తెలుగు. దీంతో కల్కి 2898 ఏడీ ఎంత టీఆర్పీ సాధిస్తుందో అనే విషయంపై ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఓటీటీలో ఎక్కడ!
కల్కి 2898 ఏడీ చిత్రం ఓటీటీలోనూ భారీ వ్యూస్‍తో దుమ్మురేపింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపింది. కొన్ని వారాల పాటు ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. గ్లోబల్ రేంజ్‍లోనూ ట్రెండింగ్‍లో సాగింది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో కొన్ని రోజులు టాప్‍లో కొనసాగింది.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్.. భైరవతో పాటు కర్ణుడిగానూ కనిపించారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో వావ్ అనిపించారు. లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. సస్వత ఛటర్జీ, శోభన దిశా పటానీ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అనా బెన్ కీరోల్స్ పోషించారు. మహాభారతం బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఆయన విజన్‍కు ప్రశంసలు దక్కాయి.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ సుమారు రూ.1,200కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి మూవీకి సీక్వెల్ రానుంది. దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రెండో భాగం పనులను కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ రూపకల్పనలో ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండో భాగం మరింత భారీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సంబంధిత కథనం