Best Web Hosting Provider In India 2024
కూటమి సర్కార్‌పై వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్
తాడేపల్లి : ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసపోయిన ప్రతి మహిళా ఇప్పుడు ముఖ్యమంత్రిని గద్దె దించాలని అనుకుంటున్నారని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడారు.
బాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం
ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను నమ్మించి.. మాటిచ్చి.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారని శ్యామల విమర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. దీపం పథకం ఎక్కడా?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవవచ్చని శ్యామల అన్నారు.
రూ.15 వేలు ఎక్కడా?
ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇంటింటా తిరిగి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు సమాధానం చెప్పకుండా అధికార పార్టీ నేతలు దాక్కున్నారు. తల్లికివందనం పేరుతో వైయస్ జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేసి లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులకు మోసం చేశారని శ్యామల విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ ఏది?
2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత శ్యామల డిమాండు చేశారు. హామీల అమలుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శ్యామల పేర్కొన్నారు.