IRCTC Shirdi Tour 2025 : ఒకే ట్రిప్ లో నాసిక్, షిర్డీ సాయి దర్శనం – ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్ , తగ్గిన టికెట్ ధరలు

Best Web Hosting Provider In India 2024

IRCTC Shirdi Tour 2025 : ఒకే ట్రిప్ లో నాసిక్, షిర్డీ సాయి దర్శనం – ఈనెలలోనే హైదరాబాద్ నుంచి ట్రిప్ , తగ్గిన టికెట్ ధరలు

Maheshwaram Mahendra HT Telugu Jan 04, 2025 01:32 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 04, 2025 01:32 PM IST

IRCTC Hyderabad Shirdi Tour : కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. నాలుగు రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 10 జనవరి, 2025వ తేదీన అందుబాటులో ఉంది.

షిర్డీ సాయిబాబా దర్శనం - టూర్ ప్యాకేజీ
షిర్డీ సాయిబాబా దర్శనం – టూర్ ప్యాకేజీ (source @SSSTShirdi)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఈ కొత్త సంవత్సరం వేళ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాను దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. బడ్దెట్ ధరతోనే ఈ ప్యాకేజీని హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

yearly horoscope entry point

టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షిర్డీని చూయించి తీసుకువస్తారు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ‘సాయి శివమ్’ (SAI SHIVAM) ప్యాకేజీని చూడాలి. కేవలం షిర్డీ మాత్రమే కాదు.. నాసిక్ కూడా చూసి రావొచ్చు.

Open PDF in New Window

హైదరాబాద్ – షిర్డీ ట్రిప్ – ముఖ్య వివరాలు:

  • హైదరాబాద్ నుంచి షిర్డీకి ట్రైన్ ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 10, జనవరి 2025 తేదీన అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా వెళ్లొచ్చు. టూరిజం వెబ్ సైట్ లో వివరాలను అప్డేట్ చేస్తారు.
  • తొలి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్(రైలు నెం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేస్తారు.
  • రెండో రోజు మార్నింగ్ 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిర్డీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
  • మూడో రోజు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • ఫోర్త్ డే ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.
  • టికెట్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 8840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7450గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలతో పోల్చితే ధరలు తగ్గాయి. అక్టోబర్ నెలలో ఇదే ప్యాకేజీ రూ. 9840(సింగిల్ అక్యుపెన్సీ)గా ఉంది. డబుల్, ట్రిపుల్ అక్యుపెన్సీల ధరలు కూడా ఈ జనవరి నెలలో కొంతమేర తగ్గాయి.
  • స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 7170గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 5790ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5770ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.
  • హైదరాబాద్ – షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR008
  •  
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

IrctcIrctc PackagesTourismAp TourismTourist PlacesShirdiMaharashtra News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024