Best Web Hosting Provider In India 2024
Mythological Thriller: విలన్‌గా యాంకర్ ఉదయభాను – త్రిబాణధారి బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన రాజాసాబ్‌డైరెక్టర్
Mythological Thriller: సత్యరాజ్ ప్రధాన పాత్రలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా తెలుగులో త్రిబాణధారి బార్బరిక్ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ను మారుతి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఉదయభాను, సత్యంరాజేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Mythological Thriller: బాహుబలి ఫేమ్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో బార్బరిక్ పేరుతో తెలుగులో ఓ మూవీ తెరకెక్కుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్‌ను రాజాసాబ్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్ తో పాటు వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యంరాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోండటం గమనార్హం.
దిమాక్ ఉన్నాడే చేయాలే…
స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ టీజర్‌లో వచ్చే టైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
టీజర్‌లో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తోన్నాయి. డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్‌లను చూపించారు. ఉదయభాను నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. మైథలాజికల్ అంశాలకు రొమాన్స్, క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు మోహన్ శ్రీ వత్స ఈ మూవీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.
రిస్కీ జానర్…
టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ చాలా రిస్కీ జానర్‌లో వచ్చిన మూవీ. విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో డైరెక్టర్ చూపించారు. సత్య రాజ్ బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు” అని అన్నాడు.
కథే హీరో…
‘బార్బరిక్ సినిమాకు కథే హీరో. ఇందులో నా పాత్ర చాలా వెరైటీగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను” అని సత్యరాజ్ తెలిపారు. . మినీ బాహుబలిలా ఉంటుందని, ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా సత్యరాజ్‌తో పాటు కలిసి ఉంటే క్యారెక్టర్‌లో తాను కనిపిస్తానని సత్యం రాజేష్ అన్నాడు. బార్బరిక్ మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని హీరోయిన్ సాంచిరాయ్ అన్నది.
త్వరలో థియేటర్లలో…
బార్బరిక్ మూవీలో మూవీలో క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఇన్ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది. విజయ్‌పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. త్వరలోనే థియేటర్ల ద్వారా ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.