Best Web Hosting Provider In India 2024
Methi Pakoda Recipe: ఆరోగ్యానికి మేలు చేసే మెంతి ఆకులతో పకోడీలు ఎప్పుడైనా చేశారా? ఇదిగో ఇలా చేశారంటే మెచ్చుకోకుండా ఉండరు
Methi Pakoda Recipe: రుచిలో, సువాసనలో, ఆరోగ్యంలో అన్ని ఆకుకూరల్లోనూ మెంతికూర ముందుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మెంతి ఆకులతో పకోడీలు ఎప్పుడైనా చేశారా? ఇదిగో ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. తిన్న వారందరూ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు.
సాయంత్రం అయిందంటే చాలు వేడి వేడిగా క్రిస్పీగా ఏమైనా కావాలని ఆశగా మీ మొహం చూసే వాళ్లు మీ ఇంట్లోనూ ఉన్నారా? వారికోసం రోజుకో రకంగా, ఆరోగ్యకరంగా ఏం చేసి పెట్టాలో అర్థంకాక సతమతం అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. రుచికరమైన, ఆరోగ్యదాయకమైన మెంతి ఆకులతో సాయంత్రం పూట స్నాక్స్ తయారు చేసి ఇంట్లో వారికి ఇచ్చారంటే సరదాగా, సంతోషంగా తినేస్తారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. మెంతికూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆహారంపై మంచి ప్రభావం చూపించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ పకోడీలు చలికాలంలో లేదా వర్షాకాలంలో తినచ్చు. మామూలు రోజుల్లో కూడా టీటైం స్నాక్స్‌గా చక్కగా సరిపోతాయి.మరి ఇంకెందుకు ఆలోచించండం. టేస్టీ, క్రంచీ మెంతి పకోడీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి.
మెంతికూర పకోడీల కోసం కావాల్సిన పదార్థాలు:
– 1 కప్పు మెంతికూర (తరిగిన)
– 1/2 కప్పు శనగపిండి
– 1/4 కప్పు గోధుమ పిండి( ఇది ఆప్షనల్ మాత్రమే తప్పనిసరి కాదు)
– 1/2 టీస్పూన్ జీలకర్ర
– 1/2 టీస్పూన్ పసుపు
– 1/2 టీస్పూన్ కారం (మిరప పొడి)
– 1/2 టీస్పూన్ ధనియాల పొడి
– 1/4 టీస్పూన్ హల్దీ పొడి
– 1/4 టీస్పూన్ ఉప్పు (రుచికి అనుగుణంగా)
– 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (ఆప్షనల్)
– కొంచెం కొత్తిమీర (ఆప్షనల్)
– 1/4 కప్పు నీరు (పిండిని కలపడానికి)
– నూనె (డీప్ ఫ్రైకి సరిపడా)
తయారీ విధానం:
- మెంతికూర ఆకులను తీసుకుని మట్టి లేకుండా శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పక్కక్కు పెట్టుకోండి.
- తరువాత లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకుని దాంట్లో శనగపిండి, బియ్యం పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి,ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో నీటిని పోస్తూ చక్కగా కలపండి. పిండిని గట్టిగా కాకుండా,జోరుగా కాకుండా మధ్యస్తంగా ఉండేలా చూసుకోండి.
- ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత పిండిని చిన్నచిన్న గోళలుగా తీసుకుని నూనెలో వేసి కాల్చండి.
- పకీడీలు కాల్చుతున్నప్పడు స్టవ్ ను మీడియం ఫ్లేములోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించండి.
- పకోడీలు రెండు వైపులా బాగా క్రిస్పీగా తయార్యేవరకూ వేయించిన తర్వాత తీసి టిష్యూ పేపర్లో వేయండి. చండి.
- అంతే మెంతికూర పకోడీలు రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకుని టీలో లేదా పచ్చిమిరప చట్నీ లేదా టమాటో కిచ్చడీ లేతా అల్లం చట్నీతో తినేయచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
- మెంతికూర ఫైబర్, ఐరన్, విటమిన్ C, ఆంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- ఈ పకోడీలు తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, హార్మోనల్ బలెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
- శనగపిండి, గోఢుమపిండితో తయారయ్యే ఈ పకోడీలు ప్రోటీన్ ఫైబర్‌ను అందిస్తాయి. ఇది శరీరానికి పుష్కలమైన శక్తిని ఇస్తుంది.