Best Web Hosting Provider In India 2024
Gundeninda Gudi Gantalu Mounika: గుండె నిండా గుడిగంటలు మౌనిక కొత్త సీరియల్ టైటిల్ ఇదే – ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?
Gundeninda Gudi Gantalu Mounika: గుండె నిండా గుడిగంటలు ఫేమ్ జ్యోతి గౌడ తెలుగులో మరో కొత్త సీరియల్ చేయబోతున్నది. వేయి శుభములు కలుగు నీకు పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్‌లో మౌనికరెడ్డి, శిల్పా చక్రవర్తి, వీజే సంయుక్త, శ్వేత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Gundeninda Gudi Gantalu Mounika: గుండె నిండా గుడి గంటలు ఫేమ్ జ్యోతి గౌడ మరో కొత్త సీరియల్‌తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుండెనిండా గుడి గంటలు సీరియల్‌లో మౌనిక పాత్రలో జ్యోతి గౌడ నటిస్తోంది.
బాలు చెల్లెలుగా కీలక పాత్రలో కనిపిస్తోంది. బాలు, మౌనిక క్యారెక్టర్స్ మధ్య అన్న చెల్లెలు సెంటిమెంట్. డ్రామా వర్కవుట్ కావడంతో కొన్నాళ్లుగా గుండె నిండా గుడి గంటలు టీఆర్‌పీలో టాప్ ప్లేస్‌లో నిలుస్తూ వస్తోంది. అర్బన్ ఏరియాలో టీఆర్‌పీ పరంగా స్టార్ మా సీరియల్స్‌లో గుండె నిండా గుడిగంటలు నంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తూ వస్తోంది.
వేయి శుభములు కలుగునీకు…
కాగా గుండెనిండా గుడిగంటలు జ్యోతి గౌడ తాజాగా మరో కొత్త సీరియల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వేయి శుభములు కలుగు నీకు పేరుతో తెలుగులో ఓ సీరియల్ చేస్తోంది. ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియల్‌తో జ్యోతితో పాటు మౌనికరెడ్డి, శిల్పా చక్రవర్తి, వీజే సంయుక్త, శ్వేత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఆమె కూతుళ్లుగా మౌనికరెడ్డి, వీజే సంయుక్త, శ్వేత, జ్యోతి నటిస్తోన్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సీరియల్ టెలికాస్ట్ డేట్, టైమింగ్స్‌ను త్వరలోనే ఈటీవీ రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నుంచే వేయి శుభములు కలుగునీకు సీరియల్ ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
బిగ్‌బాస్ 3లో…
లాంగ్ గ్యాప్ తర్వాత శిల్పా చక్రవర్తి వేయి శుభములు కలుగు నీకు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇస్తోంది. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శిల్పా చక్రవర్తి మేరా నామ్ జోక్, ఎఫ్ 3, భలే జోడీతో పాటు పలు టీవీ షోస్ చేసింది. కంటే కూతుర్నే కనాలితో పాటు పలు తెలుగు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది శిల్పా చక్రవర్తి. 57వ రోజు షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.