Fake profile Crime: ఇంటర్నేషనల్ మోడల్స్ ప్రొఫైల్ ఫొటోలతో అమ్మాయిలను ఆకర్షించి, ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి ..!

Best Web Hosting Provider In India 2024


Fake profile Crime: ఇంటర్నేషనల్ మోడల్స్ ప్రొఫైల్ ఫొటోలతో అమ్మాయిలను ఆకర్షించి, ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి ..!

Sudarshan V HT Telugu
Jan 04, 2025 08:11 PM IST

వివిధ ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ ఫామ్ లలో 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను ఆకర్షించి, వారి నుంచి లక్షల మొత్తాల్లో మోసం చేశాడో 23 ఏళ్ల యువకుడు. తన ప్రొఫైల్ లో తరచూ నకిలీ ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్ గా పోస్ట్ చేసేవాడు. చివరకు పోలీసులకు చిక్కి, కటకటాలు లెక్క పెడుతున్నాడు.

ఇంటర్నేషనల్ మోడల్స్ ప్రొఫైల్ ఫొటోలతో అమ్మాయిలను మోసం చేసి..!
ఇంటర్నేషనల్ మోడల్స్ ప్రొఫైల్ ఫొటోలతో అమ్మాయిలను మోసం చేసి..!

బంబుల్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో స్నేహం చేసిన 700 మంది మహిళల నుంచి వివిధ రకాలుగా డబ్బు వసూలు చేసిన 23 ఏళ్ల భారతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా మహిళల ముందు అమెరికాకు చెందిన మోడల్ లేదా, బ్రెజిల్ మోడల్ ఫోటోలను ఉపయోగించి వారిని నమ్మించేవాడు. క్రమంగా, వారి నుంచి పెద్ద మొత్తాలను వసూలు చేసేవాడు. నిందితుడి నుంచి పలు బ్యాంకులకు సంబంధించిన 13 క్రెడిట్ కార్డులతో సహా మొబైల్ ఫోన్లలోని నేరపూరిత సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

yearly horoscope entry point

బ్లాక్ మెయిల్ చేసి..

బంబుల్, స్నాప్ చాట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకుని బాధితులను ప్రలోభపెట్టడం, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి, వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం తదితర ఆరోపణలపై తుషార్ బిష్త్ ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మోడల్ గా నటిస్తూ నిందితుడు వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్, బ్రెజిల్ మోడల్ ఫోటోలను ఉపయోగించి నకిలీ ఐడెంటిటీలను సృష్టించాడని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) విచిత్రా వీర్ వెల్లడించారు. వివిధ ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ ఫామ్ లలో 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలతో కనెక్ట్ అవ్వడానికి బిష్త్ ఇలా నకిలీ ప్రొఫైల్స్ ను ఉపయోగించేవాడు.

బంబుల్, స్నాప్ చాట్, వాట్సప్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంబుల్, స్నాప్ చాట్, వాట్సప్ యూజర్లే తుషార్ బిష్త్ ప్రధాన టార్గెట్. వారితో ముందుగా పరిచయం పెంచుకుని, క్రమంగా చాట్ చేస్తూ, వారి నమ్మకాన్ని చూరగొనేవాడు. వారి సన్నిహిత ఫోటోలు, వీడియోలను షేర్ చేయమని వారిని నమ్మించి, ఆ తర్వాత ఆ విషయాలను ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. కంటెంట్ దొరికిన తర్వాత సున్నితమైన విషయాలను ఆన్ లైన్ లో లీక్ చేస్తానని, బాధితులు డబ్బులు ఇవ్వకపోతే డార్క్ వెబ్ కు అమ్ముతామని బెదిరించేవాడు.

విద్యార్థిని బెదిరింపుతో..

డిసెంబర్ 13న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దోపిడీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థినికి తుషార్ బిష్త్ ఒక నకిలీ ప్రొఫైల్ తో బంబుల్ లో పరిచయం అయ్యాడు. తనను అమెరికాకు చెందిన ఒక మోడల్ గా పరిచయం చేసుకున్నాడు. మోడలింగ్ ఆఫర్స్ ఉన్నాయని, స్నాప్ చాట్, వాట్సప్ లలో ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలని ఆమెను నమ్మించాడు. ఆ తరువాత, నిందితుడు ఆమె షేర్ చేసిన ప్రైవేట్ వీడియోను ఆమెకు పంపి డబ్బులు డిమాండ్ చేయడంతో, ఆమెకు విషయం అర్థమైంది. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ బాధితురాలు చిన్నపాటి చెల్లింపులు చేసింది. అయితే ఎడతెగని డిమాండ్ల కారణంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసింది అని డీసీపీ తెలిపారు. ఢిల్లీలోని షకర్ పురా ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు.

వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్

బిష్త్ రెండేళ్లుగా వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ ను ఉపయోగిస్తున్నాడని, దానిని అతను యాప్ ద్వారా పొందాడని పోలీసులు తెలిపారు. మహిళలను మోసం చేసేందుకు నకిలీ ప్రొఫైల్స్ తయారు చేశాడు. మొదట్లో వినోదం కోసమే ఇలా చేశాడని, ఆ తర్వాత డబ్బు గుంజడానికి పక్కా పథకంగా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. పలువురు మహిళల వ్యక్తిగత కంటెంట్ ను సోషల్ మీడియా (social media) లో వైరల్ చేస్తానని బెదిరించానని అతను అంగీకరించాడు” అని విచిత్రా వీర్ తెలిపారు.

ఎవరీ తుషార్ బిష్త్?

తుషార్ బిష్త్ షకర్ పూర్ కు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి. అతని సోదరి గురుగ్రామ్ లోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. అతను బీబీఏ గ్రాడ్యుయేట్. గత మూడేళ్లుగా నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్ గా పనిచేస్తున్నాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source link