Best Web Hosting Provider In India 2024
TG Cabinet Decisions : రైతు భరోసా ఏడాదికి రూ.12 వేలు, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు- కేబినెట్ కీలక నిర్ణయాలివే
TG Cabinet Decisions : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు.
TG Cabinet Decisions : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని తెలిపారు.
భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 26న కొత్త పథకాలకు శ్రీకారం చుడతామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. రాళ్లు, రప్పులు, రోడ్లకు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించారు. అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.
జనవరి 26 నుంచి కొత్త పథకాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ నెల 26న పలు కొత్త పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. రైతాంగానికి కొత్త సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాది రూ.10 వేలు ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేలు వ్యవసాయ యోగ్య భూములన్నింటికీ ఇస్తామని ప్రకటించారు.
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు పరిశ్రమలు, మైనింగ్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు రైతు భరోసా విధివిధానాలు వివరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థి పరిస్థితి బాగోలేదన్నారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరటి రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ కొత్త పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయం చేయకపోయినా…సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సమగ్ర కుల గణన, భూమిలేని పేదలకు ఆర్థిక సాయం, సన్నబియ్యం పంపిణీపై కేబినెట్ లో చర్చించారు. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై కేబినెట్ చర్చించింది. పంచాయతీరాజ్ శాఖలో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీలను కేబినెట్ ఆమోదం తెలపింది. ములుగు గ్రామపంచాయతీని ములుగు మున్సిపాలిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
సంబంధిత కథనం
టాపిక్