Best Web Hosting Provider In India 2024
Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్‍పై మళ్లీ బజ్.. అప్పుడే రానుందా?
Pushpa 2 OTT Release: పుష్ప 2 ఓటీటీ రిలీజ్‍పై మళ్లీ బజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ తేదీపై సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతూ దూకుడు చూపిస్తోంది. భారీ అంచనాలతో డిసెంబర్ 5న రిలీజైన ఈ యాక్షన్ మూవీ ఆరంభం నుంచి అదరగొట్టే వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.1,800 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. హిందీలో ఏకంగా ఆల్‍టైమ్ రికార్డును సృష్టించింది. పుష్ప 2 చిత్రం ఇంకా జోరుగా వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
స్ట్రీమింగ్‍పై బజ్
పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్‍పై మళ్లీ బజ్ నెలకొంది. జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెడుతుందంటూ అంచనాలు బయటికి వస్తున్నాయి. మూవీ టీమ్ పెట్టిన 56 రోజుల డెడ్‍లైన్ అప్పటికి ముగుస్తుందని, దీంతో ఆరోజు స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ అయిందని తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ.250 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ విషయంలోనూ పుష్ప 2 రికార్డు సాధించింది. థియేటర్లలోనూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. రిలీజైన 56 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని మూవీ టీమ్ ఇటీవల చెప్పింది. జనవరి చివరి వారంలోనే ఇది ముగియనుంది. దీంతో అప్పుడే స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
పుష్ప 2 రికార్డుల మోత
పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లోనే సుమారు రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన భారతీయ మూవీగా రికార్డు సృష్టించింది. హిందీలో రూ.800 కోట్ల నెట్ వసూళ్లను ఈ చిత్రం దాటేసింది. దీంతో హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా ఇది సాధించలేకపోయింది. బాలీవుడ్ చిత్రాలన్నింటినీ దాటేసి హిందీలో అగ్రస్థానాన్ని అధిష్టించారు అల్లు అర్జున్. ఇక ప్రతీ మైలురాయికి రికార్డుల మోతతో అదరగొడుతోంది పుష్ప 2.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని మరింత భారీగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన హైలైట్‍గా నిలిచింది. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. సామ్ సీఎస్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం