Best Web Hosting Provider In India 2024
OTT Tamil Thriller: ఓటీటీలో థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్.. థియేటర్లలో డీలా, స్ట్రీమింగ్‍లో సత్తా.. తెలుగులోనూ..
OTT Tamil Thriller Movie: ఓ తమిళ సినిమా థియేటర్లలో డీలా పడినా.. ఓటీటీలో సత్తాచాటుతోంది. భారీ వ్యూస్ సాధిస్తూ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‍తోనే వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది.
కొన్ని సినిమాలు థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కించుకున్నా.. ఓటీటీల్లో అదరగొడుతుంటాయి. స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటూ ఉంటాయి. తాజాగా తమిళ మూవీ ‘సొర్గవాసల్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ థ్రిల్లర్ చిత్రానికి థియేటర్లలో పెద్దగా వసూళ్లు దక్కలేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఆర్జే బాలాజీ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు. సొర్గవాసల్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో టాప్-5లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ట్రెండింగ్‍లో మూవీ
సొర్గవాసల్ చిత్రం ప్రస్తుతం (జనవరి 5) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఇండియా ట్రెండింగ్‍లో ఐదోస్థానంలో ఉంది. మంచి వ్యూస్ సాధిస్తూ టాప్-5లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అప్పటి నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
సొర్గవాసల్ చిత్రం సుమారు రూ.15కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అంచనాలకు తగ్గట్టు వసూళ్లు రాలేదు. మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. అయితే, ఈ తక్కువ బడ్జెట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్‍లో సత్తాను చాటుకుంటోంది. సొర్గవాసల్ చిత్రానికి సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
సొర్గవాసల్ చిత్రం థియేటర్లలో తమిళంలో ఒక్కటే రిలీజ్ అయింది. అయితే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది.
యథార్థ ఘటన ఆధారంగా..
సొర్గవాసల్ చిత్రం జైలు బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. చేయని హత్యకు జైలు శిక్షకు గురైన ఓ వ్యక్తికి ఎదురైన ఘటనలు, అక్కడ జరిగిన అల్లర్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. 1999 మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర్ల ఘటన ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ సిద్ధార్థ్ విశ్వనాథన్ రూపొందించారు. యథార్థ ఘటనల స్ఫూర్తితో గ్రిప్పింగ్ కథనంతో మెప్పించారు.
ఈ సొర్గవాసల్ ఆర్జే బాలాజీతో పాటు సెల్వరాఘవన్ కూడా లీడ్ రోల్ చేశారు. పార్థిబన్ పాత్రలో బాలాజీ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ చిత్రంలో సానియా ఇలప్పన్, షరాఫుద్దీన్, షరాఫుద్దీన్, నాటీ సుబ్రమణియం, బాలాజీ శక్తివేల్, హక్కిమ్ షా, రవి రాఘవేంద్రన్ కీరోల్స్ పోషించారు. ఈ చిత్రానికి క్రిస్టో గ్జేవియర్ మ్యూజిక్ ఇచ్చారు.
సొర్గవాసల్ చిత్రానికి మొత్తంగా రూ.8కోట్లలోపే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో కమర్షియల్‍గా ప్లాఫ్ అయింది. థియేటర్లలో డీలా పడింది. అయితే, ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతోంది.
సంబంధిత కథనం