Best Web Hosting Provider In India 2024
Parenting Tips: పిల్లలతో తల్లిదండ్రులు సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండాలా లేక సరదాగా జోకులు వేస్తూ నవ్వుతూ ఉండాలా?
parenting tips: పిల్లలతో తల్లిదండ్రులు సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండాలా లేక సరదాగా జోకులు వేస్తూ నవ్వుతూ ఉండాలా? ఏది బెస్ట్ పేరెంటిగ్ పద్ధతి? ఎలా ఉంటే వారి భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి సందేహాలు మీకు ఉంటే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పిల్లలు తమ మాట వినాలంటే తల్లిదండ్రులు ఎప్పుడూ సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా మాత్రమే ఉండాలా? సరదాగా జోకులు వేస్తూ వారితో నవ్వుతూ ఉంటే మీ మీద వారికి భయం, భక్తి లేకుండా పోతాయా? అంటే ముమ్మాటికీ కానే కాదని చెబుతున్నాయి తాజా స్టడీలు. పిల్లలతో కలిసి వారి మీద సిల్లీ జోక్ పేల్చడం లేదా పిచ్చిపిచ్చిగా సరదాగా వారితో మాట్లాడటం మిమ్మల్ని మంచి తల్లిదండ్రులుగా మారుస్తుందంటే మీరు నమ్మగలరా? అవును ఇది నమ్మాల్సిన విషయమే అని చెబుతోంది సైన్స్.
పిఎల్ఓఎస్‌వన్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. హాస్యం తల్లిదండ్రులు-పిల్లల మధ్య బంధాలను బలోపేతం చేయడమే కాకుండా సంతాన వ్యూహాలను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. మీ పేరెంటింగ్ పద్దతిలో కొద్దిగా నవ్వును, కొన్ని జోకులను యాడ్ చేయడం వల్ల పిల్లల్లో ఉద్రిక్తత తగ్గి, భావోద్వేగ శ్రేయస్సు, అభిజ్ఞా వశ్యత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
హాస్యం అభిజ్ఞా వశ్యతను ఎలా పెంచుతుందో తెలుసా?
తల్లిదండ్రులుగా మనం పిల్లలతో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవాలని, వారి మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, వారికి మీకు మధ్య చక్కటి సానుకూల వాతావరణం ఏర్పడాలని కోరుకుంటాం. సాధారణంగా మనం వారికి సలహాలు, ఆదేశాలు ఇస్తుంటాం. చివాట్లు పెట్టడం, అరవడం కూడా అందరు తల్లిదండ్రులు చేసేదే.అయితే చాలా మంది తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటంటే.. వీటన్నిటికన్నా పిల్లలు మాట వినడానికి సహాయపడే వాటిలో ముఖ్యమైన సాధనం హాస్యమేనట.
పిల్లల పెంపకంలో హాస్యం ప్రాధాన్యత ఏంటి?
హాస్యం కేవలం సంభాషణ మాత్రమే కాదు.. ఇది శరీరం, మనసుపై ప్రభావం చూపే విషయం. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో హాస్యాన్ని జోడించడం వల్ల వారికీ మీకు మధ్య సంబంధాలు బలంగా మారతాయి. వారి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మెరుగైన కమ్యూనికేషన్ తో పాటు ఇంట్లో ఎప్పుడూ ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నవ్వుతూ ఉండటం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
హాస్యం, జోకులు సంబంధాలను ఎలా బలోపేతం చేస్తాయి?
సైన్స్, స్టడీలు తేల్చి చెబుతున్న విషయం ఏంటంటే ఎటువంటి కుటుంబాలు హాస్యాన్ని కలిసి పంచుకుంటాయో అలాంటి కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలంగా, సానుకూలంగా ఉంటాయి. సాంప్రదాయిక పద్ధతులను మించి, వ్యక్తిగతంగా, స్నేహపూర్వకంగా ఒకటిగా జత నిలిచిపోతున్నాయి. తల్లిదండ్రులు అంటే పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడం లేదా ఆదేశించడం కాకుండా, హాస్యంతో సరదా పంచడం ద్వారా మీరు వారికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చినవారు అవుతారు. అది వారు మీతో ఫ్రీగా ఫీలింగ్స్ షేర్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు వారితో కలిసి కూర్చుని జోకులు చెప్పడం, ఆటపాటలతో కూడిన ముఖభావాలు ప్రదర్శించడం లేదా సరదా సంఘటనలు పంచుకోవడం వల్ల ఇలాంటి మంచి వాతావరణం ఏర్పడుతుందిజ పిల్లలు మిమ్మల్ని మరింత సులభంగా, బలంగా అంగీకరిస్తారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం:
మానసిక స్థితి గురించి మాట్లాడేటప్పుడు హాస్యం మీకు, మీ పిల్లలకు మధ్య ఒక సహాయ సాధనంగా పనిచేస్తుంది. ఎలాంటి కఠినమైన, కష్టతరమైన విషయాన్నైనా వారు భయం, ఆందోళన లేకుండా మీతో అన్నీ పంచుకునేందుకు ఉపయోగుతుంది. వారు తప్పు చేసినా మీతో నిర్భయంగా చెప్పేలా చేస్తుంది.వారి మనస్సులో ఆందోళన, ఒత్తిడి తగ్గించే ప్రాకృతిక రసాయనాలు, ఎండోర్ఫిన్లు విడుదల చేస్తుంది.ఇది మానసిక ఆరోగ్యానికి అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది.
కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం:
పెరుగుతున్న పిల్లలు మీతో మాట్లాడటానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించేలా చేసే శక్తి కేవలం హాస్యానికి మాత్రమే ఉంది. వారితో మీరు సరదాగా నవ్వుతూ గడిపే సమయం వారికి చాలా ఇష్టమైన సమయంగా మారుతుంది. ఇది మళ్లీ మళ్లీ వారిని మీ దగ్గరకు రప్పిస్తుంది.హాస్యం సోషల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను పెంపొందిస్తుంది. పిల్లలు మీకు హాస్యం ద్వారా తమ భావనలను సానుకూలంగా పంచుకుంటారు. అదే పద్ధతి వారికి అలవాటుగా మారుతుంది. వారి చుట్టూ సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని పెంచుతుంది.
పిల్లలతో హాస్యం ఎలా ఉపయోగించాలి..
1. జోకులు, సరదా కథలు చెప్పండి:
మీ పిల్లలకు సరదాగా కథలు చెప్పండి. రోజంతా మీకు ఎదురైన సరదా సంఘటనలను వారితో పంచుకోండి. ఇది మీకు, పిల్లలకు మంచి నవ్వు అందిస్తుంది.
2. ఎక్కువ సరదా ఆటలు ఆడండి:
ప్రతిభాపూర్వకమైన ఆటలు, జోకులు చెప్పడం, లేదా అనుకరణాత్మక ఆటలు ఆడండి. ఈ రకమైన సరదా సమయాలు చిన్న చిన్న అనుభవాలను సంతోషంగా మార్చవచ్చు.
3. ఒత్తిడి తగ్గించడానికి హాస్యాన్ని ఉపయోగించండి:
కష్టమైన సందర్భాలలో సరదా వ్యాఖ్యానాలను ఉపయోగించండి. ఇది ఆపత్కాలంలో మానసిక శాంతిని అందిస్తుంది.వారిలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
4. సరదాగా ఉండండి:
పిల్లలతో సరదాగా ఉండటం వారికి మంచి స్నేహపూర్వక, రిలాక్స్ వాతావరణాన్ని ఇస్తుంది.
5. మీ తప్పులకు మీరే నవ్వండి: మీ తప్పులపై మీరే జోకులు వేసుకుని నవ్వండి. ఇది మీ పిల్లలకు సరదా, స్వీయ గౌరవాన్ని నేర్పిస్తుంది.