Best Web Hosting Provider In India 2024
OTT Psychological Thriller: ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌కు అవాక్కవడం ఖాయం.. ఓటీటీలో ఎక్కడుందంటే.. తప్పక చూడాల్సిన మూవీ!
OTT Psychological Thriller: కొన్ని సినిమాల్లోని ట్విస్టులు.. ఆశ్చర్యపరుస్తాయి. వావ్ అనిపిస్తాయి. మైండ్‍బ్లాక్ చేసేస్తాయి. అలాంటి ఓ చిత్రం గురించి.. అదెక్కడ స్ట్రీమ్ అవుతోందో ఇక్కడ చూడండి.
కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు చివరి వరకు ఊహించని విధంగా ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా అదిరే ట్విస్టులతో కొన్ని చిత్రాలు అవాక్కేలా చేస్తాయి. ఇంతసేపు అనుకున్నది ఇదా అని ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా.. అవాక్కయ్యేలా చేసే ట్విస్టులతో కొన్ని హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘ది సిక్స్త్ సెన్స్’ (The Sixth Sense) చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం చాలా సస్పెన్స్ ఫుల్‍గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం వావ్ అనిపిస్తుంది. ఒక్కసారి కుదిపేస్తుంది. ఈ సినిమా వివరాలు, స్ట్రీమింగ్‍కు ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకోండి.
ది సిక్స్త్ సెన్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ది సిక్స్త్ సెన్స్ (1999) చిత్రం ఇండియాలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంటా 47 నిమిషాల రన్‍టైమ్ ఉంటుంది. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారు ఈ మూవీని తప్పక చూడాలి. సస్పెన్స్, ట్విస్టులతో ఆకట్టుకుంటుంది.
ది సిక్స్త్ సెన్స్ చిత్రానికి నైట్ ష్యామలాన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ నరేషన్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉత్కంఠభరిత కథనంతో మెప్పించారు. ఈ సినిమాలో బ్రూస్ విల్స్, హేలీ జోయెల్ ఓస్మెంట్ ప్రధాన పాత్రలు పోషించారు. టోనీ కోల్లెట్, ఒలివియా విలియమ్స్, డోనీ వాల్‍బర్గ్, గ్లెన్ ఫ్లిట్‍గెరాల్జ్, ట్రెవోర్ మోర్గాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో పిల్లాడిగా జోయెల్ నటన మరింత ఆకట్టుకుంటుంది.
కమర్షియల్‍గానూ బ్లాక్‍బస్టర్
ది సిక్స్త్ సెన్స్ చిత్రం 1999 ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా అప్పట్లో 40 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమాకు ఏకంగా 672 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. బడ్జెట్‍తో పోలిస్తే 15 రెట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఆ రేంజ్‍లో కమర్షియల్‍గానూ ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఇప్పటికీ హాలీవుడ్ థ్రిల్లర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది.
ది సిక్స్త్ సెన్స్ సినిమాను హాలీవుడ్ పిక్చర్స్, స్పైగ్లాస్ ఎంటర్‌టైన్‍మెంట్, ది కెనెడీ మార్షల్ కంపెనీ, బ్యారీ మండెల్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించాయి. జేమ్స్ న్యూటన్ హోవర్డ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి టక్ ఫుజిమోటో సినిమాటోగ్రఫీ చేశారు. టెక్నికల్‍గా ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. డైరెక్టర్ ష్యామలాన్ టేకింగ్ చాలా మెప్పిస్తుంది.
ది సిక్స్త్ సెన్స్ స్టోరీలైన్
పిల్లల సైకాలజిస్ట్ మాల్కమ్ క్రో (బ్రూస్ విల్స్).. తన పేషెంట్‍ను చావు నుంచి కాపాడలేకపోయానని బాధపడుతుంటాడు. తాను దెయ్యాలను చూడగలనని, మాట్లాడగలనని చెప్పే అబ్బాయి కోల్ సీర్ (హేలీ జోయెల్ ఓస్మెంట్)కు మానసిక చికిత్స అందించాలని మాల్కమ్ నిర్ణయించుకుంటాడు. బాలుడికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ బాలుడికి ప్లాష్‍బ్యాక్ ఉంటుంది. ఆ పిల్లాడికి మానసిక చికిత్స అందిస్తుంటాడు మాల్కమ్. క్రమంగా నిజాలు బయటికి వస్తుంటాయి. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో అనుకోని ట్విస్ట్ ఉంటుంది. సినిమాలో ఈ థ్రిల్లింగ్ అంశాలు హైలైట్‍గా నిలుస్తాయి.
ది సిక్స్త్ సెన్స్ చిత్రం సస్పెన్స్, ట్విస్టులతో పాటు ఎమోషనల్‍గానూ ఉంటుంది. ఇందులోని మలుపులు ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే ఈ మూవీ హాలీవుడ్‍లో ఒకానొక బెస్ట్ థ్రిల్లర్ చిత్రంగా ఉంది. స్టోరీ టెల్లింగ్ పవర్ ఏంటో ఈ మూవీతో ష్యామలాన్ చూపించారు. ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయండి.
సంబంధిత కథనం