Best Web Hosting Provider In India 2024
Malayalam Movie: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఫ్రీగా చూసేయండి – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Malayalam Movie: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరు శనివారం నుంచి యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. అమిత్, కళాభవన్ షాజాన్, బాబురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు. 2023లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
Malayalam Movie: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరు యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బ్లూహిట్ ఫిల్మ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మూవీని చూడొచ్చు. తెరు మూవీలో అమిత్, కళాభవన్ షాజాన్, బాబురాజ్, విజయరాఘవన్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌జే సిను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
ఐఎమ్‌డీబీలో…
మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెరు మూవీ 2023లో థియేటర్లలో విడుదలైంది. ఐఎమ్‌డీబీలో పదికి గాను 6.8 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్, విజువల్స్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు హీరో పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఆకట్టుకున్నాయి. థియేటర్లలో తెరు మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.
తెరు కథ ఇదే…
హరిని పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని అతడి తండ్రి కలలు కంటాడు. తండ్రి డ్రీమ్‌ను నెరవేరుస్తూ హరి పోలీస్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అవుతాడు. అపాయింట్‌మెంట్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తుంటాడు. కొడుకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ కోసం హరి తండ్రి రోజు పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి చెక్ చేస్తుంటాడు.
ఓ రోజు పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి తిరిగి వస్తోన్న క్రమంలో పోలీసులతో జరిగిన గొడవలో హరి తండ్రి కన్నుమూస్తాడు. తండ్రి చావుకు కారణమైన పోలీసులపై హరి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. పోలీస్ ఉద్యోగం చేయాల్సిన హరి…పోలీస్ వ్యవస్థపైనే తిరుగుబాటు చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఈ పోరాటంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి?అసలు హరి తండ్రి చావుకు కారణం ఎవరు అన్నదే ఈ మూవీ కథ. తెరు మూవీకి జాక్జాన్, నేహా మ్యూజిక్ అందించారు.
టీవీ సీరియల్ డైరెక్టర్‌గా…
టీవీ సీరియల్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు ఎస్‌జే సిను. ఆ తర్వాత తెరుతో పాటు జిబౌటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రభుదేవా, వేదిక హీరోహీరోయిన్లుగా ఇటీవల రిలీజైన తమిళ మూవీ పేట్టరాప్‌కు ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు. పేట్టా రాప్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఎస్‌జే సిను ఉప్పుమ్ ములక్కుమ్ సీరియల్‌కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్ పెద్ద హిట్టయ్యింది. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ 2014 వరకు టెలికాస్ట్ అయ్యింది.
టాపిక్