Best Web Hosting Provider In India 2024
Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి, సెల్‌ఫోన్లు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత
Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి, సెల్‌ఫోన్లు దర్శనమిచ్చాయి. అటు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా.. హోంమంత్రి అనిత జైలును సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వివాదాలపై వివరణ ఇచ్చారు.
విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. యూనిఫాంలో ఉన్న ఉద్యోగులు ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ చేస్తున్నాం..
‘విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫారా ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖైదీల రక్షణే ముఖ్యం. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. సెల్ ఫోన్లు బయటపడిన చోటును కూడా పరిశీలించాము. విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫోన్లో ఎవ్వరెవ్వరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటాం’ అని అనిత స్పష్టం చేశారు.
గంజాయి మొక్క..
‘జైల్లో గంజాయి మొక్క కనిపించింది. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఎవ్వరిని ఉపేక్షించేది లేదు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంంట్రల్ జైల్లో ఉద్యోగులను బదీలిలు చేసాం. ఎవ్వరిని సస్పెండ్ చేయలేదు. యూనిఫాం సర్విస్‌లో ఉన్నవారు ధర్నాలో, బంద్‌లో పాల్గొనకూడదు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారు’ అని హోంమంత్రి వివరించారు.
ఎవరూ తప్పించుకోలేరు..
‘టెక్నాలజీని ఉపయోగగించుకుంటాం. సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పది రోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లావు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్ట్ వస్తుంది. దాన్నిబట్టి చర్యలు ఉంటాయి. జైల్లో సిబ్బందిని కూడా పెంచుతాం’ అని అనిత స్పష్టం చేశారు.
సామర్థ్యానికి మించి..
విశాఖ సెంట్రల్ జైల్లో మొత్తం 16 బ్యారక్‌లు ఉన్నాయి. వీటిల్లో 950 మంది ఖైదీలు మాత్రమే ఉండాలి. కానీ.. డిసెంబరు 30 నాటికి 2,076 మంది ఖైదీలను ఉంచారు. వీరిలో వివిధ కేసుల్లో నేరారోపణలు రుజువై.. శిక్ష అనుభవిస్తున్న వారు 440 మంది ఉన్నారు. మిగిలిన వారంతా రిమాండ్ ఖైదీలే. క్షమాభిక్ష కింద విడుదలయ్యే ఖైదీల జాబితాను మూడేళ్లుగా ప్రకటించలేదు. దీంతో సామర్థ్యానికి మించి ఖైదీలు ఇక్కడ ఉంటున్నారు.
సిబ్బంది కొరత..
ఈ సెంట్రల్ జైలును సిబ్బంది కొరత వేధిస్తోంది. 150 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ సెంట్రల్ జైలులో.. కేవలం 90 మందే ఉన్నట్లు తెలుస్తోంది. మరో 30 మందికిపైగా కావాలని జైలు అధికారులు డీఐజీని కోరారు. సిబ్బంది తక్కువ ఉండడంతో ఖైదీలపై పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ఖైదీలకు మత్తు పదార్థాలు, సెల్‌ఫోన్ల సరఫరా అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గత సూపరింటెండెంట్, మరో అధికారిపై ఆరోపణలు రాగా.. విచారణకు ఆదేశించారు.
టాపిక్