Best Web Hosting Provider In India 2024
Akira Nandan: అకీరా నందన్ హీరోగా ఖుషి సీక్వెల్ – ఎస్‌జే సూర్య రియాక్షన్ ఇదే!
Akira Nandan: రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీలో కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో మోపిదేవి అనే పొలిటికల్ లీడర్ పాత్రలో ఎస్‌జేసూర్య కనిపించబోతున్నాడు. సినిమాలో రామ్ చరణ్‌కు తనకు మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయని ఎస్‌జేసూర్య తెలిపాడు.
రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోపిదేవి అనే రాజకీయ నాయకుడిగా ఎస్‌జే సూర్య కనిపించబోతున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత్రతో పాటు ఖుషి సీక్వెల్‌పై ఎస్‌జే సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
డిఫరెంట్ షేడ్స్‌లో…
గేమ్ చేంజర్ సెట్‌లో డైరెక్టర్ శంకర్ చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ ఇంప్రెస్ అయ్యారు. గేమ్‌ఛేంజర్‌లో నా నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ ప్రతీ ఒక్క క్యారెక్టర్ ఏ సీన్‌కు తగ్గట్లుగా ఎలా చేయాలో నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది. గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు.
ఆ స్థాయి నాకు లేదు…
నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటనపైనే ఫోకస్ పెడతాను. డైరెక్టర్‌గా ఎప్పుడు ఆలోచించను. అయినా శంకర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ అని రాజమౌళి చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.
నోట మాట రాలేదు…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఖుషీ టైంలో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ గురించి చెబుతుండేవారు. కానీ నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు.
మ్యాజిక్ మిస్…
గేమ్ ఛేంజర్‌లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడం కష్టంగా అనిపించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నా క్యారెక్టర్‌కకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. గేమ్ ఛేంజర్ సినిమాను నేను పూర్తిగా చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్‌కు నాకు మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.
ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుంది. థియేటర్లో ఈ సాంగ్ బ్లాస్ట్ అవుతుంది.
అకిరా నందన్‌తో ఖుషి సీక్వెల్
నటుడిగా కంఫర్ట్‌గా నా జర్నీ సాగుతోంది. ఇప్పట్లోడైరెక్షన్ గురించి ఏం ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారెలానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే అకిరా నందన్‌తో ఖుషి సీక్వెల్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి అని ఎస్‌జే సూర్య అన్నాడు.