Best Web Hosting Provider In India 2024
Thriller OTT: ఓటీటీలోకి సముద్రఖని కోలీవుడ్ థ్రిల్లర్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
Thriller OTT: వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని హీరోగా నటించిన తమిళ డ్రామా థ్రిల్లర్ మూవీ తిరు మాణికం డిజిటల్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. జనవరి నెలాఖరున ఈ తమిళ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అనన్య, భారతీరాజా, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.
Thriller OTT: సముద్రఖని హీరోగా నటించిన తిరు మాణికం మంచి సినిమాగా కోలీవుడ్ ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంటోంది. నంద పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య, భారతీరాజా, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
జీ5 ఓటీటీ…
తిరు మాణికం డిజిటల్ రైట్స్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నది. తిరుమాణికం మూవీ జనవరి 31న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు.
లాటరీ బ్యాక్‌డ్రాప్…
తిరు మాణికం మూవీలో తమిళ హీరో ఆర్య, పార్తిబన్, పా విజయ్‌తో పాటు మరికొందరు కోలీవుడ్ సినీ ప్రముఖులు గెస్ట్‌లుగా కనిపించారు. మాణికం (సముద్రఖని) కేరళలోని ఓ చిన్న సిటీలో లాటరీ షాఫ్ నిర్వహిస్తుంటాడు. నితీ నిజాయితీ ఎక్కువ. లాటరీ షాప్ నుంచి వచ్చే ఆదాయం సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు.
మాణికం లాటరీ షాప్‌లో ఓ వృద్ధుడు (భారతీరాజా) టికెట్ కొంటాడు. ఆ టికట్‌ను మాణికం దగ్గరే దాచిపెడతాడు. ఆ వృద్దుడు కొన్న టికెట్‌కు కోటిన్నర లాటరీ వస్తుంది. మాణికం ఏం చేశాడు? ఆ టికెట్‌ను ముసలాయనకు ఇచ్చేశాడా? మాణికం వెంట పోలీసులు పడటానికి కారణం ఏమిటి? లాటరీ టికెట్ కారణంగా మాణికం ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్…
తిరు మాణికం మూవీలో నిజాయితీపరుడైన లాటరీ షాప్ ఓనర్‌గా సముద్రఖని నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ డ్రామా థ్రిల్లర్ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు.
యాక్టర్ బిజీ…
డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సముద్రఖని ఆ తర్వాత యాక్టర్‌గా బిజీ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తోన్నాడు. తెలుగులో ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురములో, భీమ్లానాయక్, దసరా, హనుమాన్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
గేమ్ ఛేంజర్‌లో…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్‌లో సముద్రఖని ఓ కీలక పాత్ర పోషించారు. జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 2024లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా 15 సినిమాలు చేశాడు.