Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 6th Episode: బంగారు కిరీటం దొంగతనం- రాజ్‌పై నిందలు- అనామిక రిటర్న్ గిఫ్ట్- పగతీర్చుకున్న మాజీ మేనేజర్
Brahmamudi Serial January 6th Episode: బ్రహ్మముడి జనవరి 6 ఎపిసోడ్‌లో చేయించిన నగలను లాకర్‌లో పెడతారు. ఆ విషయం తెలుసుకున్న అనామిక సెక్యురిటీ గార్డ్‌గా ఉన్న మాజీ మెనేజర్‌కు కాల్ చేసి 50 లక్షల ఆఫర్ ఇస్తుంది. దాంతో అతను మిగతా వాళ్లకు మత్తు ఇచ్చి బంగారు కిరీటాన్ని దొంగతనం చేసి డూప్లికేట్ పెడతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన రాజ్, కావ్యను భోజనం చేద్దామని అపర్ణ పిలుస్తుంది. వర్క్‌లో పడి సాయంత్రమే తిన్నామని చెప్పి లోపలికి వెళ్లిపోతారు. వాళ్లు మాత్రం నచ్చింది బయట తిని, మనకు ఆ గడ్డి పెట్టారు అని రుద్రాణి అంటుంది. తినడానికి టైమ్ లేక తిన్నామని చెబుతున్నారు కదా. అర్థం కాలేదా అని ప్రకాశం అంటాడు.
అర్థం చేసుకోలేరుగా
వాళ్లు నచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారని మీకు అర్థం కాలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీరు తినండి. ఈ గడ్డి తినాల్సిన అవసరం మాకు లేదని రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ లేచి వెళ్లిపోతారు. ఏ కూర తిన్న కడుపునింపుకోడానికే కదా. ఇదెప్పుడు వీళ్లకు అర్థమవుతుంది అని ప్రకాశం అంటాడు. అందరూ మీలా అర్థం చేసుకోలేరుగా అంకుల్ అని స్వప్న అంటుంది. మా బావకు అలా అయినప్పటినుంచి ఇంట్లో మనుషులు మారుతున్నారు, దూరం అయిపోతున్నారని అంటుంది ఇందిరాదేవి.
కనీసం కావ్య, రాజ్ అయిన అర్థం చేసుకుని ప్రవర్తిస్తారనుకుంటే వాళ్లు కూడా పట్టనట్లు వెళ్తున్నారు. ఇంకా ఈ ఇంట్లో ఎన్ని చూడాలో అని బాధగా అంటుంది ఇందిరాదేవి. మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో చేయించిన నగలు చూసి డిజైన్స్ సూపర్‌గా ఉన్నాయి. దీని క్రెడిట్ నీకే సొంతం అని కావ్యకు రాజ్ చెబుతాడు. దాంతో అంతా కంగ్రాట్స్ చెబుతారు. ఇది మనకు నచ్చడం కాదు. జగదీష్ సర్‌కు నచ్చాలి అని కావ్య అంటుంది.
మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. జగదీష్ గారికి కూడా నచ్చుతాయ్ చూడు అని రాజ్ అంటాడు. సెక్యూరిటీ ఇంఛార్జ్‌ని పిలిచి అందరూ సెక్యురిటీ డ్యూటీలో ఉండాలి. ఎవరు పడుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లాకర్‌లో పెట్టిస్తాడు రాజ్. కీస్ ఇచ్చి లాక్ చేయిస్తాడు. లాక్ చేసి కీస్ రాజ్‌కు ఇస్తాడు సెక్యూరిటీ ఇంఛార్జ్. మరోవైపు అనామిక డ్రింక్‌ను కంగారుగా లాగేసుకుని సామంత్ తాగుతాడు.
పాయిజన్ కలిపి ఇవ్వు
కావాలంటే ఇంకో పెగ్ ఇచ్చేదాన్ని కదా అని అనామిక అంటే.. ఇవ్వు అందులో పాయిజన్ కలిపి ఇవ్వు. రాజ్ వాళ్లను నాశనం చేస్తానన్నావ్. వాళ్లు కాంట్రాక్ట్ ఫినిష్ చేసి డెలీవరీ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ డిజైన్స్ కావాలంటే తీసుకొచ్చి ఇచ్చాను. ఏం చేయలేకపోతున్నావని మతిపోతుంటే కూల్‌గా ఎలా ఉంటున్నావ్ అని సామంత్ అంటాడు. నువ్ ముందు అరవడం ఆపి, చెప్పేది విను. నేను ఆలోచించకుండా ఏం చేయను అని నీక్కూడా తెలుసు అని అనామిక అంటుంది.
రాజ్ ఆఫీస్‌లో మేనేజర్ నుంచి సెక్యూరిటీగా మారిన వ్యక్తికి అనామిక కాల్ చేస్తుంది. రాజ్ మీద పగ తీర్చుకోవాలని ఉందా అంటే.. ఉంది. కానీ, ఏం చేయలేకపోతున్నాను అని అతను అంటాడు. నేను చెప్పేది చేస్తే లైఫ్ సెటిల్ అయ్యే డబ్బుతోపాటు పగ కూడా తీర్చుకోవచ్చు. నేను రూ. 50 లక్షలు ఇస్తాను అని అనామిక అంటుంది. దానికి సరే అంటాడు సెక్యూరిటీ గార్డ్. నేను ఒక కిరీటం పంపిస్తాను. దాన్ని ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో పెట్టి ఈ డూప్లికేట్ పెట్టి అది నాకు ఇవ్వు అని అనామిక అంటుంది.
అదేమైనా చిన్న విషయమా. సర్‌కి తెలిస్తే నా పని అంతే అని అతను అంటాడు. అలా జరగకుండా నేను చూస్తాను. నీ లైఫ్‌కు ఏ రిస్క్ ఉండదు అని అనామిక అంటుంది. నాకు ఏం కాకుండా మీరు చూస్తారా. సరే మేడమ్ చేస్తాను అని సెక్యూరిటీ అంటాడు. అది విన్న సామంత్ వామ్మో నువ్ మాములుదానివి కాదు. ఇప్పుడు దానికి డూప్లికేట్ చేసి అక్కడ పెడతావా. దాంతో రాజ్ పేరు సర్వనాశనం అవుతుంది అని సామంత్ అంటాడు. ఇద్దరూ సంతోషంగా డ్రింక్ తాగుతారు.
రేపు ఉదయమే చేస్తా
మరోవైపు బెడ్ ఎక్కి రాజ్ పడుకుంటాడు. కావ్య వచ్చి ఆపుతుంది. నాకు నిద్రొస్తుంది. నేను పడుకుంటాను అని రాజ్ అంటాడు. ఇప్పుడు మనకు చాలా పనులు ఉన్నాయి. ఏడు వారాల నగలు ఇన్ టైమ్‌లో చేయిస్తామని చెప్పాం కదా. రేపు మిగతా ఆరు వారాల నగల పీపీటీ ప్రజంట్ చేయిస్తామని చెప్పాం కదా. అది మీరు చేస్తారని అన్నారు కదా అని కావ్య అంటుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది రేపు ఉదయమే చేస్తా అని రాజ్ అంటాడు.
ఉదయం ఏది పనిచేయకపోతే ఎలా అని కావ్య అంటే రాజ్ అరుస్తాడు. ఇప్పుడు ఏమన్నాను. ముందు చూపుగా ఉండటం తప్పా అని కావ్య అంటుంది. వర్క్ హాలిక్‌గా ఉండాలి కానీ, మరింత హాలిక్ వద్దు. ఇది కూడా ఒకరకంగా గృహహింస కిందే వస్తుంది. నేను ఒప్పుకోను. నా మీద ఏమాత్రం జాలి దయ కరుణ అభిమానం ప్రేమ ఉన్న ఈ పూట ప్రశాంతంగా పడుకోవే. కావాలంటే నీకు నేర్పించాను కదా. నువ్ చేయి అని రాజ్ అంటాడు.
నాకు చిన్న స్లైడ్స్ చేయడం వచ్చు కానీ, కంపెనీకి ఇచ్చేంత రాదు అని కావ్య అంటుంది. కదా. అందుకే ఆగు అని రాజ్ పడుకుంటాడు. ఆఫీస్‌లో పరిస్థితి ఎలా ఉందో అని సెక్యూరిటీ అతనికి కాల్ చేస్తుంది కావ్య. ఎక్స్‌ట్రాగా సెక్యురిటీ పెట్టమన్నా కదా అని అడుగుతుంది. ఉంది మేడమ్ అందరం నిద్రపోకుండా చూసుకుంటున్నాం. టెన్షన్ పడకండి అని అటు నుంచి సెక్యూరిటీ చెబుతాడు. జగదీష్ గారికి రేపు ఇవ్వబోయే జ్యూయెలరీ ఫైల్స్ మొత్తం మెయిల్ చేయమన్నారుగా మర్చిపోయాను అనుకున్న కావ్య ఉదయం చూసుకుందామనుకుంటుంది.
దొంగతనం చేసిన సెక్యురిటీ
మరోవైపు సెక్యురిటీ గార్డ్స్ అందరికి అనామిక మాట్లాడిన వ్యక్తి టీ ఇస్తాడు. దాంతో అంతా నిద్రపోతారు. స్కూటిపైన ఒకతను వచ్చి డూప్లికేట్ కిరీటం ఉన్న బ్యాగ్‌తోపాటు లాకర్ డూప్లికేట్ కీ ఇస్తాడు. నువ్ చెప్పిన కీ ప్రకారం పర్ఫెక్ట్‌గా చేయించాను అని చెబుతాడు. దాంతో బ్యాగ్ పట్టుకుని లాకర్ రూమ్‌లోకి అతను వెళ్తాడు. డూప్లికేట్ కీతో లాకర్ ఓపెన్ చేసి ఒరిజినల్ కిరీటం తీసి డూప్లికేట్‌ది పెట్టి లాక్ వేస్తాడు. కిరీటంను బ్యాగ్‌లో పెట్టి స్కూటీపై వచ్చిన వ్యక్తికి ఇస్తాడు సెక్యూరిటీ గార్డ్.
ఆ విషయం అనామికకు కాల్ చేసి చెబుతాడు. అది విన్న అనామిక శభాష్ అంటుంది. నీకు చెప్పిన డబ్బు ఇస్తాను. ఆ 50 లక్షలు నాకు పెద్ద మ్యాటర్ కాదు. రాజ్కావ్య రోడ్డున పడటం. కంపెనీ దివాళ తీయడం. ఈ దెబ్బతో అది నిజం కాబోతుంది. నేను చాలా సో హ్యాపీగా ఉంది సుబ్బు. ఈ పేరు నీకు బాగా సూట్ అవుతుంది. నీ లైఫ్ సెట్ అయినట్లే. పండగ చేసుకో అని అనామిక మత్తులో సంతోషంగా కాల్ చేస్తుంది. తర్వాత సామంత్‌కు ముద్దుపెడుతుంది.
మరుసటి రోజు ఉదయం రాజ్‌కు శ్రుతి కాల్ చేసి మీటింగ్ ఒక గంట పోస్ట్‌పోన్ అయిందని చెబుతుంది. దాంతో థ్యాంక్యూ అని చెప్పిన రాజ్ మళ్లీ పడుకుంటాడు. ఇంతలో కాఫీ తీసుకొచ్చిన కావ్య లేపుతుంది. ఏడు అవుతుంది, ఆఫీస్‌కు వెళ్లాలి, మీరు చేయాల్సిన వర్క్ పెండింగ్ ఉంది. అది ఎర్లీ మార్నింగ్ చేస్తాను అని చెప్పారు కదా అని కావ్య చెబుతుంది. కాసేపు కూడా పడుకోనివ్వకుండా కక్ష కట్టినదానిలా విసిగిస్తున్నావ్ అని రాజ్ అంటాడు.
రిటర్న్ గిఫ్ట్
సూర్యూడి కంటే ముందే లేచి కూర్చొనే మీరు ఇలా చేస్తున్నారేంటీ. ఇది నిర్లక్ష్యమా, బద్ధకమా అని కావ్య అంటుంది. అయినా కానీ, రాజ్ లేవడు. ఇలా కాదు అని రాజ్‌కు చక్కిలిగింతలు పెడుతుంది కావ్య. దాంతో రాజ్‌పై కావ్య పడుతుంది. తర్వాత కావ్యకు కాల్ చేసి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. అందులో రాజ్ మాత్రమే కాకుండా నువ్ కూడా పాలుపంచుకో అని చెబుతుంది.
మరోవైపు కిరీటం గోల్డ్‌ది కాదని తెలిసి రాజ్‌ను ఇంతలా దిగజారుతారా నానా మాటలు అంటాడు జగదీష్. మీ తాతయ్య నా ఫ్రెండ్ అని నమ్మి ఇస్తే అసలిది మాయం చేసి దాని ప్లేస్‌లో డమ్మీది పెడతారా అని తిడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్