Karthika Deepam January 6th Episode: దీప చేసిన టిఫిన్స్ తిన్న శివన్నారాయణ, జోత్స్న.. ఆహా, సూపర్ అంటూ పొగడ్తలు, చివరికి..

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam January 6th Episode: దీప చేసిన టిఫిన్స్ తిన్న శివన్నారాయణ, జోత్స్న.. ఆహా, సూపర్ అంటూ పొగడ్తలు, చివరికి..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 06, 2025 07:26 AM IST

Karthika Deepam Today Episode January 6th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కార్తీక్‍కు మళ్లీ చిరాకు తెప్పిస్తాడు తండ్రి శ్రీధర్. దీప పెట్టిన టిఫిన్ బండిని దూరం నుంచి చూస్తూనే బాధపడుతుంది సుమిత్ర. కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. టిఫిన్స్ ఇంటికి తీసుకెళుతుంది సుమిత్ర. పూర్తిగా ఏం జరిగిందంటే..

Karthika Deepam January 6th Episode: దీప చేసిన టిఫిన్స్ తిన్న శివన్నారాయణ, జోత్స్న.. ఆహా, సూపర్ అంటూ పొగడ్తలు, చివరికి..
Karthika Deepam January 6th Episode: దీప చేసిన టిఫిన్స్ తిన్న శివన్నారాయణ, జోత్స్న.. ఆహా, సూపర్ అంటూ పొగడ్తలు, చివరికి..

కార్తీక దీపం 2 నేటి (జనవరి 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్ సైకిల్ తొక్కుతూ వెళుతుంటే.. ఓ కారు అడ్డంగా వస్తుంది. దీంతో కార్తీక్ కోపంగా అరుస్తాడు. దాంట్లో నుంచి అతడి తండ్రి శ్రీధర్ దిగుతాడు. ఇలాంటి గతి పట్టిందంటూ కార్తీక్‍ను శ్రీధర్ తక్కువ చేసి మాట్లాడతాడు. తన మాట విని ఉంటే రెస్టారెంట్ పెట్టుకునే వాడివని, ఇప్పుడు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకొని పరువు తీస్తున్నావని, తనకు సిగ్గుగా ఉందని మాటలు అంటాడు శ్రీధర్. టిఫిన్ సెంటర్ వద్ద పొట్లాలు కట్టాలి కదా అంటూ హేళన చేసేలా మాట్లాడతాడు. తాను ఆఫర్లు ఇచ్చినా అమానించారని చెబుతాడు. దీనికి కార్తీక్ గట్టిగానే బదులిస్తాడు.

yearly horoscope entry point

దరిద్రాలు మొదలైంది మీ వల్లే

టిఫిన్ బండికి తాను ఓనర్ అని కార్తీక్ అంటాడు. సొంతంగా మా కాళ్ల మీద నిలబడ్డాం అని చెబుతాడు. “కోరి దరిద్రాన్ని పెట్టుకున్న వాడిని ఏమనాలి” అని శ్రీధర్ అంటాడు. వీలైతే మీ పేరుతోనే పిలవాలి అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. ఏ వినడానికి ఇబ్బందిగా ఉందా అని చెబుతాడు. నిజం చెప్పాలంటే ఈ దరిద్రాలన్నీ మొదలైంది మీ వల్లే, అందమైన పూలవనం లాంటి కుటుంబంలో కలుపు మొక్కలా తయారయ్యావ్ అంటూ కోప్పడతాడు. నేను నీ తండ్రిని రా అంటూ శ్రీధర్ అంటే.. “ఆ మాట ఎక్కడా చెప్పకండి.. ఆ రెండు పెళ్లి చేసుకున్నాయన మీ నాన్నేనా అని అడుగుతున్నారు” అని కార్తీక్ అంటాడు. అప్పట్లో శివన్నారాయణ కుటుంబం అంటే ఎంతో గర్వంగా, సంతోషంగా ఉండేదని, దేవుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండే వాడినని అంటాడు. శిఖరంలా అనిపించేదని అంటాడు.

“తమరి రెండో పెళ్లి గురించి తెలియంతో మొదలుపెట్టి.. నేను ఇల్లు వదిలి వచ్చి ఇడ్లీ బండి పెట్టే వరకు జరిగిన ప్రతీ సంఘటన ఆ శిఖరాన్ని నేలమట్టం చేసింది” అంటారు. స్వార్థం, మూర్ఖత్వంతో కొందరు ఆ శిఖరాన్ని, ఆ ఇంటి గౌరవాన్ని తిరిగి నిర్మించలేనంత నేలమట్టం చేశారంటూ కార్తీక్ కోపంగా అంటాడు. భవిష్యత్తులో సాధించే విజయాలు గతాన్ని మారుస్తాయని అంటాడు. దీపతో ఉన్నంత కాలం ఏం చేయలేవని, ఆమెతో ఉంటే సర్వనాశనం అవుతారని శ్రీధర్ అంటాడు. అనవసరంగా మాట్లాడి ఉన్న మర్యాద పోగొట్టుకోకు అని కార్తీక్ చెబుతాడు. మరో గోల్డెన్ ఛాన్స్ ఇస్తానని శ్రీధర్ ఆఫర్ ఇస్తాడు. భార్య ఆస్తి కలిసి వచ్చినోడు ఎన్నైనా చెబుతాడంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు. రెండు చక్రాలతో ఆగను.. ఇది ముగింపు కాదు.. ఆరంభం అని అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు.

నోరు జారిన దాసు

దీప పెట్టిన టిఫిన్ బండి వద్దకు సుమిత్రను దాసు తీసుకొస్తాడు. ఆటోలో కూర్చొనే కార్తీక్ ఉన్న ఇంటికి, టిఫిన్ సెంటర్‌ను సుమిత్ర చూస్తుంది. కాంచన, కార్తీక్‍కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడుతుంది. “నువ్వు ఆడపడుచు గురించి ఆలోచిస్తాన్నావమ్మా. ఆ పక్కన ఉన్నది నీ సొంత కూతురు. నీ యావదాస్తికి వారసురాలు” అని మనసులో అనుకుంటాడు దాసు. దీపకు ఇంకా కష్టాలు తీరలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీప గొప్పతనం గురించి మాట్లాడుతుంది. ఈ క్రమంలో దీప తల్లిదండ్రులు చనిపోలేదని, బతికే ఉన్నారని నోరు జారతాడు దాసు. ఆ తర్వాత కంగారు పడతాడు. దీంతో దీప అబద్ధం చెప్పిందా అని సుమిత్ర అంటుంది.

దీపే వారసురాలు అని నిజం చెప్పనని జ్యోత్స్నకు ఇచ్చిన మాటను దాసు గుర్తు చేసుకుంటాడు. భౌతికంగా చనిపోయినా.. వారి ఆత్మలు, ఆశీర్వాదాలు దీపకు ఉంటాయని, అదే తన ఉద్దేశం అని దాసు కవర్ చేస్తాడు. దీపను కూడా తాను కూతురు అనే అనుకున్నానని, అంతే ప్రేమగా చూశానని సుమిత్ర అంటుంది. ప్రాణం కాపాడిందనే కాదు, అంతకు మించిన బంధం ఉందని అనిపిస్తోందని సుమిత్ర ఉంటుంది. నిజం తొందరలోనే తెలుస్తుందని మనసులో అనుకుంటాడు దాసు.

టిఫిన్స్ తెప్పించుకున్న సుమిత్ర

దీప చేతి వంట తిని చాలా కాలం అయిందని, అక్కడ తినే వారు ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అని సుమిత్ర అంటుంది. దీప చేసిన టిఫిన్స్ తినాలని ఉందని చెబుతుంది. దీంతో అటుగా వెళుతున్న ఓ వ్యక్తిని పిలిచి డబ్బు ఇస్తాడు దాసు. టిఫిన్స్ తెమ్మని చెబుతాడు.

కార్తీక్ ఎంట్రీ.. సర్దిచెబుతూ..

కార్తీక్ ఎక్కడ కనిపించడం లేడని సుమిత్ర అంటుంది. భర్తపై ప్రేమతో కార్తీక్ టిఫిన్ సెంటర్ అని దీప పేరు పెట్టిందని సంతోషిస్తుంది. ఇంతలో దీప చేసిన టిఫిన్‍లను ఓ వ్యక్తి తీసుకొస్తాడు. వాసన చూస్తుంటూ ఆకలి గుర్తుకొస్తోందయ్యా అని సుమిత్ర అంటుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆటోలో కూర్చున్న సుమిత్రతో మాట్లాడతాడు. మరి ఆలస్యం ఎందుకు తినేయొచ్చు కదా అని అంటాడు. ఏంటత్తా అందరినీ ఓసారి చూడాలని అనిపించిందా అని కార్తీక్ అంటే.. అవును అంటూ కన్నీరు పెట్టుకుంటుంది సుమిత్ర. మమకారం గుండెకు తగిలి కన్నీళ్లు వస్తున్నట్టున్నాయని కార్తీక్ అంటాడు. అన్ని వదులుకొని ఇంత సాధారణంగా, సంతోషంగా ఎలా బతుకుతున్నారని సుమిత్ర అడుగుతుంది. దీపంలా వెలుగుతున్న ఆ మనిషిని చూసి.. అంటూ దీపను చూపిస్తాడు కార్తీక్. కష్టకాలమే అయినా.. చికట్లో వెలుగు చూపే దీపంలా నా భార్య నాతో ఉందని కార్తీక్ అంటాడు. సుమిత్రకు సర్దిచెబుతాడు. తన తల్లి, భార్య, కూతురు గురించి గొప్పగా చెబుతాడు. నా లాంటి వాడు ధైర్యంగా అనుకున్నది సాధించేందుకు ఇది చాలదా అని అంటాడు. నువ్వు గెలవాలని కార్తీక్‍కు సుమిత్ర చెబుతుంది. అమ్మను, దీపను పలుకరించు అత్తా అని కార్తీక్.. అంటే ముందుకు వచ్చేందుకు ముఖం చెల్లడం లేదంటుంది.

నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తా

మీరు ఇల్లు వదిలేటప్పుడు నేను వచ్చి ఆపాల్సిందని, తన వల్ల కూడా తప్పు జరిగిందని సుమిత్ర అంటుంది. జరిగిపోయింది కదా వదిలేయ్ అని కార్తీక్ అంటాడు. ఇక్కడి వెళ్లడం ఇంట్లో తెలియదు అనుకుంటా.. తాతకు తెలిస్తే నిన్ను కూడా బయటికి గెంటేయమంటాడు అని కార్తీక్ అంటాడు. అప్పుడు నేను కూడా మీతో హాయిగా ఉంటానని సుమిత్ర అంటుంది. ఆ ఇంటికి నువ్వు అందం అని కార్తీక్ అంటాడు. కార్తీక్ బాబు ఎవరితోనో మాట్లాడుతున్నాడని దీప అటుగా చూసినా.. సుమిత్ర కనిపించదు. దీప చేతి వంట తీసుకెళుతున్నావ్ కదా అని కార్తీక్ అంటాడు. బెంగ పెట్టుకోవద్దని చెబుతాడు. ఆ తర్వాత అక్కడి వెళ్లిపోతుంది సుమిత్ర. ఎవరితో మాట్లాడావని కాంచన అడిగితే.. చాలా కావాల్సిన వారని కార్తీక్ చెబుతాడు. టిఫిన్ తీసుకెళ్లారని అంటాడు. ఎవరై ఉంటారని కాంచన ఆలోచనలో పడుతుంది.

దీప చేసిన టిఫిన్స్ వడ్డించిన సుమిత్ర

పారిజాతం మేకప్ వేసుకుంటూ ఉంటే జోత్స్న వెటకారం చేస్తుంది. తినేందుకు పిలుస్తుంది. శివన్నారాయణ, దశరథ్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్లను కూడా జోత్స్న పిలుస్తుంది. ఇంతలో దీప బండి నుంచి తెచ్చిన టిఫిన్లను డైనింగ్ టేబుల్‍పై ఎవరూ చూడకుండా పెడుతుంది సుమిత్ర. శివన్నారాయణ, జ్యోత్స్న, దశరథ్, పారిజాతానికి ఆ టిఫిన్లను సుమిత్ర వడ్డిస్తుంది.

సూపర్ అన్న శివన్నారాయణ, జ్యోత్స్న

ఎప్పుడూ లేనిది టిఫిన్ ఘుమఘులు బయటికే వస్తున్నాయని శివన్నారాయణ అంటాడు. నేను చేసినప్పుడు ఇలా అనలేదని పారు అంటే.. నువ్వు వండితే ఆకలే ఆత్మహత్య చేసుకుంటుందని పంచ్ వేస్తాడు. వంట మళ్లీ మొదలుపెడదానని పారు అంటే.. అమ్మో అంటూ.. నీ వంటకు శ్రద్ధాంజలి ఘటిస్తానని శివన్నారాయణ అంటాడు. ప్రేమతోనే టీజ్ చేస్తున్నావ్ తాత అని జ్యోత్స్న అంటుంది. దీప చేసిన టిఫిన్స్ తింటూ మైమరిచిపోతారు. టిఫిన్స్ చాలా బాగున్నాయని శ్రీధర్ అంటే.. అవును రా కొత్తదనం తెలుస్తోందని శివన్నారాయణ కూడా చెబుతాడు.

రెస్టారెంట్‍లో ఇలా ఉంటే..

మన ఇంట్లో ఎప్పుడూ ఈ టేస్ట్ రాలేదని జ్యోత్స్న అంటుంది. సూపర్‌గా ఉందంటుంది. మన రెస్టారెంట్‍లో చట్నీలు అంతగా లేవని చెబుతుంది. అదే టిఫిన్స్ ఈ టేస్టుతో ఉంటే కస్టమర్లు సంతృప్తి చెందుతారని, ఏమంటావ్ తాత అని అడుగుతుంది. తన మనసులోనూ ఇదే మాట ఉందని శివన్నారాయణ అంటాడు. కోడలు ఏదో అద్భుతం చేసిందని, టేస్ట్ సూపర్ అని చెబుతాడు. నువ్వు ఏం ట్రై చేశావో చెబితే రెస్టారెంట్‍లో అప్లై చేస్తుందని దశరథ్ అంటాడు. జ్యోత్స్న కూడా ఇలాంటి మార్పులు అవసరం అంటుంది.

పొగడ్తలు.. నిజం చెప్పడంతో షాక్

ఈ టిఫిన్స్ అందరికీ నచ్చినట్టే కదా అని సుమిత్ర అడుగుతుంది. నచ్చడం ఏంటి.. అదిరిపోతేనూ అని పారిజాతం అంటుంది. అంటే ఈ టేస్టుకు రెస్టారెంట్ స్థాయి ఉందంటారా అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. రెస్టారెంట్‍లో కూడా ఈ టేస్ట్ ఉండడం లేదు మమ్మీ అని, అందుకే ఇదే క్వాలిటీ, టేస్టుతో మన రెస్టారెంట్‍లో టిఫిన్స్ ఉండేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నానని జ్యోత్స్న చెబుతుంది. రోడ్డు పక్కన పెట్టే టిఫిన్ బండ్లకు ఇలాంటి టేస్ట్ ఉండే అవకాశం ఉందంటారా అని సుమిత్ర అంటుంది. ఇంత టెస్టీగా, హైజీనిక్‍గా బండ్ల మీదనా.. సాధ్యం కాదు అని దశరథ్ అంటాడు. అలా ఎవరైనా చేస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టి.. మెడలో దండ వేయవచ్చని పారిజాతం అంటే.. తీసుకొచ్చి రెస్టారెంట్‍లో పెట్టుకోవచ్చని, వాళ్లతోనే రెస్టారెంట్ కూడా పెట్టవచ్చని జ్యోత్స్న అంటుంది. అవును అనేలా శివన్నారాయణ సైగ చేస్తాడు. ఇంతలో నిజం చెప్పేస్తుంది సుమిత్ర. “నువ్వు అన్నది నిజమే జ్యోత్స్న. ఈ టిఫిన్స్ చేసిన మనిషి అలాంటిది” అని సుమిత్ర ఉంటుంది. ఈ టిఫిన్స్ ఎవరు చేశారని జోత్స్న అడుగుతుంది. దీప చేసిందని సుమిత్ర నిజం చెప్పేస్తుంది. దీంతో చివరికి అందరూ షాక్ అవుతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 6) ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024