Best Web Hosting Provider In India 2024
Baby names: మీరు శివ భక్తులైతే మీ బాబుకు ఈ శివుడి నామాల్లో నచ్చిన పేరును పెట్టుకోండి
Baby names: మీరు శివ భక్తుడైతే మీ బాబుకు ఆ శివుడి పేరు పెట్టాలనుకుంటున్నారా? ఇక్కడ మేము ఎన్నో శివుడి నామాలు ఇక్కడ ఇచ్చాము. ఇందులో ఆధునిక పేర్లు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకుని మీ బాబుకు పెట్టుకోండి.
శివుని అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తారు. ప్రతిరోజూ శివుడికి దీపం పెట్టాక పనులు మొదలుపెడతారు. అలాగే శివుడి పేరును తమ పిల్లలకు ఎంతో ఇష్టంగా పెట్టుకునేవారు కూడా ఉన్నారు. మీ ఇంట్లో కొడుకు పుడితే మీరు కూడా శివుడి పేరును పెట్టాలనుకుంటున్నారా? ఇక్కడ మేము అందమైన శివుడి పేర్లు ఇచ్చాము. ఇందులో మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకుని మీ వారసుడికి పెట్టండి. ఇవి అర్థవంతంగా, ఆధునికంగా కూడా ఉంటాయి.
అబ్బాయిల కోసం శివుడి పేర్లు
1. అశుతోష్
ఇదొక అందమైన పేరు. దీనికి అర్థం సంతోషంగా జీవించే వ్యక్తి అని.
2. అమరేశ్
ఈ పేరుకు శివుడు అనే అర్థం మాత్రమే కాదు, ఇంద్రుడు అనే అర్థం కూడా ఉంది.
3. అలోక్
ప్రపంచాలను అధిగమించే వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.
4. అనికేత్
ఈ పేరుకు అర్థం అందరికీ ప్రభువు అని అర్థం.
5. ఆదిదేవ్
ఈ పేరుకు శివుడనే అర్థం మాత్రమే కాదు, సూర్యుడు అని కూడా అర్థం. ప్రకాశవంతమైన దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు.
6. భవేష్
భవేష్ అంటే ప్రపంచానికి ప్రభువు అని. ఆధిపత్యాన్ని సాధించ వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు.
7. చంద్రపాల్
చంద్రుడిని నియంత్రించే వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.
8. దేవేష్
ఈ పేరుకు అర్థం అన్ని దైవాలకే దేవుడు అని చెప్పుకోవచ్చు.
9. ధ్యానదీప్
ఈ పేరుకు అర్థం ధ్యానంతో పాటూ ఏకాగ్రత అని అంటారు.
10. జతిన్
శివుడు నామాల్లో ఇది ఆధునిక మైనది. క్రమశిక్షణతో ఉన్న వ్యక్తిని జతిన్ అని పిలుస్తారు.
11. కైలాష్
కైలాస పర్వతం మీద నివసించే భగవంతుడు కైలాష్ అని చెప్పుకోవచ్చు.
12. లోకపాల్
ప్రపంచ శ్రేయస్సును కాపాడే వ్యక్తి లోకపాల్ అని పిలుస్తారు.
13. ప్రణవ్
ప్రణవ అంటే ఓం అనే అత్యంత పవిత్రమైన చిహ్నం నుంచి ఉద్భవించింది. ఇది అందమైన పేరు అనే చెప్పుకోవాలి.
14. పుష్కర్
ఇదొక శివుడి అందమైన పేరు ఇది. ఈ కాలం అబ్బాయికి ఇది చక్కగా ఉంటుంది.
15. దిగంబర్
ఆకాశాన్నే వస్త్రంగా చేసుకున్న వ్యక్తి ఈ పేరుకు అర్థం.
16. సనాతన్
లోకంలో శాశ్వతంగా నిలిచే వ్యక్తి, శివుడు అని ఈ పేరుకు అర్థంగా చెప్పుకోవాలి.
17. త్రిలోకేష్
మూడు ప్రపంచాలను పాలించే ప్రభువు అని ఈ పేరుకు అర్థం.
18. అనిశ్వర్
గురువు లేకుండా సొంతంగా ఎదిగిన వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.