Best Web Hosting Provider In India 2024
Venkatesh: వెంకటేష్ పాట పాడటం దేవుని దయ.. పాటకు దక్కిన గౌరవం.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్
Bheems Sisirolio About Venkatesh Singing: సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సంగీత దర్శకుడుగా వర్క్ చేస్తున్న భీమ్స్ సిసిరోలియో హీరో విక్టరీ వెంకటేష్ పాట పాడటంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెంకటేష్ గారే స్వయంగా పాట పాడేందుకు రావడం దేవుని దయ అంటూ భీమ్స్ చెప్పారు.
Bheems Sisirolio About Venkatesh Singing: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కొత్త మూవీ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెంకటేష్‌కు జోడీగా హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేశారు.
ధమాకా, మ్యాడ్, బలగం, టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్ సినిమాలకు చార్ట్ బస్టర్స్ మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంక్రాంతికి వస్తున్నాం మూవీకి స్వరాలు సమకూర్చారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భీమ్స్ సిసిరోలియో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది? మీరెలా వచ్చారు? ఈ జర్నీ గురించి చెప్పండి?
-ముందుగా తెలుగు ప్రేక్షకులుకు ధన్యవాదాలు. అనిల్ రావిపూడి గారి ‘పటాస్’ సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది. కానీ, అప్పుడు కుదరలేదు. ఫైనల్‌గా13 ఏళ్ల తర్వాత మళ్లీ అనిల్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి ధన్యవాదాలు.
-దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో బలగం సినిమా చేశాను. సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో వెంకటేష్ గారు అనిల్ గారితో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పాట ద్వారా మీ అందరికీ చేరువైనందుకు ఆనందంగా ఉంది.
సంగీతంపై ఉన్న అభిరుచి
-ధమాకా, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్ .. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ గారితో కలసి పని చేయడం సందడిగా సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై ఉన్న అభిరుచి దీనికి కారణం.
-వెంకటేష్ గారి సినిమాకి పని చేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేష్ గారు ఆయనంతట ఆయనే వచ్చి పాడటం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా ఇది నాకో అచీవ్‌మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు సంక్రాంతికి వస్తున్నాం.
70 మిలియన్ వ్యూస్
-ఈ సినిమాలో గోదారి గట్టు సాంగ్ రమణ గోగుల గారు పాడటం, ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఆనందంగా ఉంది. రమణ గోగుల గారు నా పాట పాడతానని ఒప్పుకోవడం చాలా లక్కీగా భావించాను. మధుప్రియ కూడా అద్భుతంగా పాడారు. ఈ పాట ప్రతి ఇంట్లో వినిపించడం ఆనందంగా ఉంది.
-అలాగే నేను పాడిన మీను సాంగ్ 17 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే వెంకటేష్ గారు పాడిన బ్లాక్ బస్టర్ సాంగ్ వైరల్ హిట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రీరికార్డింగ్ చేశాను. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఎలా అయితే ఉందో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారనే నమ్మకం ఉంది. పాటలని ప్రేక్షకులు ఇంత గొప్పగా స్వీకరించిన విధానం బట్టి ఈ సినిమా ఉన్నతి ప్రగతి కనిపిస్తోంది. ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది.