Best Web Hosting Provider In India 2024
TG Caste Names Change: తెలంగాణలో పలు బీసీ కులాల పేర్ల మార్పుకు నోటిఫికేషన్ విడుదల
TG Caste Names Change: తెలంగాణలో 8 కులాల పేర్లకు బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కులాల పేర్లను మార్చాలని వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
TG Caste Names: తెలంగాణలో పలు కులాల పేర్ల మార్పుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కులాల పేర్లను వినియోగించడంలో అభ్యంతరాల నేపథ్యంలో కొన్ని కులాల పేర్లు మార్పులతో పాటు మరికొన్ని కులాలకు పర్యాయపదాలను జత చేర్చాలని వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న కులాల పేర్లలో సమాజంలో చులకనగా ఉండటం, తిట్లుగా వాడుతున్న నేపథ్యంలో వాటిని మార్చాలని బీసీ కమిషన్ గతంలో నిర్వహించిన బహిరంగ విచారణలో వినతులు వచ్చాయి. కుల సంఘాల ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు నిర్వహించిన కమిషన్ పేర్ల మార్పులపై అభయంతరాలు, ఇతర పర్యాయపదాలను సూచించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనవరి 18వరకు హైదరబాద్ జలమండలి కార్యాలయంలో ఉన్న బీసీ కమిషన్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
పేర్లు మారనున్న కులాలు ఇవే…
- ప్రస్తుతం బీసీ ఏ (క్రమ సంఖ్య 7) క్యాటగిరీలో ఉన్న దొమ్మర కులాన్ని గాద వంశీయగా మర్చాలని ప్రతిపాదించారు.
- బీసీ ఏ విభాగంలోనే 18వ కులంగా ఉన్న వంశరాజ్/పిచ్చగుంట్ల కులంలో పిచ్చగుంట్ల పదాన్ని తొలగించాలని ప్రతిపాదించారు.
- బీసీ డీలో 29వ సంఖ్యలో ఉన్న తమ్మలి(బ్రహ్మణేతరులు, శూద్రులు) కులంలో బ్రహ్మణేతర, శూద్ర పదాలను తొలగించాలని ప్రతిపాదించారు.
- బీసీ ఏ క్యాటగిరీలో ఉన్నబుడబుక్కల కులస్తులను ఆరె క్షత్రియ లేదా శివక్షత్రియ, రామజోషి కులాలుగా మార్చాలని ప్రతిపాదించారు.
- బీసీ బీ క్యాటగిరీలో ఉన్న కుమ్మర,కులాల, శాలివాహన కులంలో ప్రజాపతి పర్యాయ పదాన్ని చేరుస్తారు.
- బీసీ ఏ క్యాటగిరీలో ఉన్న రజక(చాకలి, వన్నర్) కులంలో వన్నర్ పదాన్ని తొలగించి దోబీ పదాన్ని చేరుస్తారు.
- బీసీ డీలో ఉన్న చిప్పోళ్లు(మేర) కులంలో మేర పదాన్ని తొలగిస్తారు.
- బీసీఏ క్యాటగిరీలో వీరముష్టి(నెట్టికొట్టాల, వీరభద్రీయ) కులంలో వీరభద్రీయను కొనసాగిస్తారు.
టాపిక్