Best Web Hosting Provider In India 2024
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే.. 10 ముఖ్యాంశాలు
Indiramma Atmiya Bharosa : రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంట పొలాల్లో ఉపగ్రహ సర్వే చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వీలైనంత ఎక్కువ సాయం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పథకాలు ప్రకటించి అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. తాజాగా.. యాసంగి సీజన్ పంటల సాగు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో 500 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నమోదు చేస్తారు.
ఈ ప్రక్రియ అతి వేగంగా జరగలాని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని ఈ నెల 6న ప్రారంభించి.. 8వ తేదీలోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ నుంచి జిల్లాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్వే చేస్తున్న సమయంలో ఏవైనా సమస్యలు వస్తే.. ఉన్నతాధికారులను సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాటపట్టారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
10 ముఖ్యాంశాలు..
1.ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతుభరోసా పథకం అమలులో భాగంగా.. ఈ సర్వే చేస్తున్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది. సాగయ్యే భూములకే పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
2.శాటిలైట్ సర్వే ద్వారా.. ప్రత్యేకంగా మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రైతులకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు.
3.రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పంటలు వేశారు.. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగుచేశారు అనే వివరాలు సేకరిస్తారని అధికారులు చెబుతున్నారు.
4.పంటలు సాగుచేయని భూమి సర్వే నెంబరు, దాని విస్తీర్ణం వంటి వివరాలను కూడా నమోదు చేయాలని.. వ్యవసాయ శాఖ సూచించింది.
5.ఈ సర్వేకు సంబంధించిన యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంటల వివరాలు నమోదు చేసేందుకు.. క్షేత్రస్థాయి ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు.
6.రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే సర్వే చేస్తామని.. డివిజన్, మండల స్థాయి అధికారులు చెబుతున్నారు.
7.గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ ప్రకటించారు.
8.తెలంగాణలోని తండాలు, మారుమూల గ్రామాల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు.. ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
9.ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
10.భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం చేయడం హర్షణీయమని.. రైతు కూలీలు అంటున్నారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.
టాపిక్