Best Web Hosting Provider In India 2024
HMPV cases in India : బెంగళూరులో హెచ్ఎంపీవీ అనుమానిత కేసు- 8 నెలల శిశువుకు వైరస్ సోకిందా?
HMPV Bengaluru : బెంగళూరులో హెచ్ఎంపీవీ అనుమానిత కేసు నమోదైంది. 8 నెలల శిశువుకు వైరస్ నుంచి సాంపిల్స్ సేకరించినట్టు సమాచారం.
చైనాలో కలకలం రేపుతున్న హెంచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) కి సంబంధించి భారత్‌లో తొలి అనుమానిత కేసు నమోదైంది! ఈ మేరకు బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువు సాంపిల్స్‌ని ల్యాబ్ టెస్టింగ్ కోసం సేకరించారు.
ఇండియాలోకి హెచ్ఎంపీవీ వైరస్..?
శిశువుకు, సంబంధిత కుటుంబానికి ఇటీవలి కాలంలో ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా ఆందోళన కలిగించే లక్షణాలేవీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
శిశువు సాంపిల్స్కి సంబంధించిన ఫలితాల్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వతంత్రంగా ధృవీకరించనప్పటికీ, హెచ్ఎంపీవీ విషయంలో ప్రైవేట్ ఫెసిలిటీ పరిశోధనల విశ్వసనీయతకు వారు మద్దతిచ్చారు. వారి టెస్టింగ్ విధానాల కచ్చితత్వాన్ని తాము విశ్వసిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
హెచ్ఎంపీవీ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ కేసుల్లో ఈ వైరస్ వాటా 0.7శాతం. అయితే నిర్దిష్ట స్ట్రెయిన్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని కర్ణాటక ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై ఊహాగానాల మధ్య, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ “ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని చెప్పినట్లు దూరదర్శన్ నివేదించింది.
హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే తెలిపింది. శ్వాసకోశ వ్యాధులను నిర్వహించడానికి భారతదేశం “బాగా సిద్ధంగా ఉంది” అని, చైనాలో పరిస్థితి “అసాధారణం కాదు” అని పేర్కొంది.
హెచ్ఎంపీవీ అంటే ఏమిటి?
చైనాలో పుట్టిన ఈ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. చైనాలోని ఆసుపత్రులు హెచ్ఎంపీవీ సహా శ్వాసకోశకు సంబంధించిన రోగులతో నిండిపోయాయని అనేక వీడియోలు సూచిస్తున్నాయి. హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ -19 వంటి వైరస్ల ఔట్‌బ్రేక్ కారణంగా ఆసుపత్రులుస శ్మశానవాటికల్లో రద్దీ నెలకొందని చైనా నుంచి వస్తున్న వీడియోల్లో చూడవచ్చు.
అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. నెదర్‌ల్యాండ్స్‌లోని పరిశోధకులు 2001లో మొదటిసారి గుర్తించిన ఈ హెచ్ఎంపీవీ.. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ముఖ్యమైన కారణం! వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం ద్వారా, దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాస బిందువుల ద్వారా లేదా డోర్నాబ్స్ లేదా బొమ్మలు వంటి కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.
హెచ్ఎంపీవీ సాధారణంగా శీతాకాలం, వసంత నెలల్లో అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
హెచ్ఎంపీవీ లక్షణాలు..
హెచ్ఎంపీవీ లక్షణాలు తీవ్రత బట్టి మారవచ్చు. సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పిని కలిగి ఉంటాయి. కొంతమంది శ్వాస ఆడకపోవడం వంటివి లక్షణాలుగా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, సంక్రమణలో భాగంగా దద్దుర్లు అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link