Best Web Hosting Provider In India 2024
Dil Raju: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇద్దరు అభిమానుల మృతి.. 10 లక్షల ఆర్థిక సహాయం.. అండగా ఉంటాన్న దిల్ రాజు
Dil Raju Ex Gratia To Game Changer Event Accident Victims: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు.
Dil Raju About Game Changer Event Accident Victims: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్. ఇటీవల శనివారం (జనవరి 4) ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగిన సంగతి విషయం తెలిసిందే.
కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు
ఈ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించారు. వారు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22)గా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు మీడియా సమక్షంలో స్పందించారు.
చెరో కుటుంబానికి 5 లక్షలు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్నాం. కానీ, ఈ సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ. 5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను” అని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
చీఫ్ గెస్ట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం
“ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను” అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం, చెర్రీ బాబాయ్ పవన్ కల్యాణ్ హాజరైన విషయం తెలిసిందే.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథులు
అలాగే, యాంకర్ సుమ హోస్ట్‌గా చేసిన ఈ గేమ్ ఛేంజర్ వేడుకకు ఓజీ డైరెక్టర్ సుజీత్, రామ్ చరణ్, ఎస్‌జే సూర్య, డైరెక్టర్ శంకర్, శ్రీకాంత్, అంజలి, దిల్ రాజు, మంత్రి కందుల దుర్గేష్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, పాటల రచయిత కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, నటుడు పృథ్వీరాజ్ తదితరులు హాజరు అయ్యారు.
3 డిఫరెంట్ గెటప్స్
గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో మూడు విభిన్న గెటప్పులో రామ్ చరణ్ కనిపించనున్నారని డైరెక్టర్ శంకర్ తెలిపారు.
బెనిఫిట్ షోలు-ధరలు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో గేమ్ ఛేంజర్ టికెట్స్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అలాగే, బెనిఫ్ట్ షోస్‌కి కూడా అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్. మొదటి రోజు బెనిఫిట్ షోలకు జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించగా.. ఉదయం 4 గంటల షోతోపాటు మరో ఆరు షోలకు అనుమతినిచ్చింది. వాటికి మల్టీఫ్లెక్స్‌లలో రూ. 175 టికెట్ ధర ఉంటే, సింగిల్ స్క్రీన్స్‌లలో రూ. 135గా రేటు ఉంది. ఈ ధరలు ఐదు షోలతో 14 రోజుల వరకు ఉండనున్నాయి.
టాపిక్